చోరీకి గురైన బంగారు నగలు.. 2 రోజుల తర్వాత అనూహ్యంగా వచ్చిన పార్శిల్.. ఓపెన్ చేయగా

అక్టోబర్ 31 సాయంత్రం వారి ఇంటికి ఓ కొరియర్ వచ్చింది. అందులో ఏముందని తెరిచి చూడగా, వారి ఇంటి నుంచి దొంగిలించిన నగల డబ్బా కనిపించింది. దానిని తెరిచి చూడగా దొంగ అపహరించిన రూ.5 లక్షల విలువైన నగలు కనిపించాయి.

చోరీకి గురైన బంగారు నగలు.. 2 రోజుల తర్వాత అనూహ్యంగా వచ్చిన పార్శిల్.. ఓపెన్ చేయగా
Robbery In House
Follow us

|

Updated on: Nov 02, 2022 | 1:09 PM

అక్టోబరు 23న దీపావళి వేడుకల కోసం ఓ ఇంటిల్లిపాది..తమ స్వగ్రామానికి వెళ్లారు..అక్టోబర్ 27 సాయంత్రం తిరిగి వచ్చేసరికి దోపిడీ దొంగలు తమ ఇంటిని ఊడ్చుకెళ్లారు. ఇంట్లో చోరీ జరిగినట్లు గుర్తించిన ఆ ఇంటి యజమాని ప్రీతి సిరోహి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఫిర్యాదు ఆధారంగా ఘజియాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, కేసు తదనంతరం, ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అక్టోబర్ 31 న బాధితులకు నిందితులు దొంగిలించిన బంగారు ఆభరణాలతో కూడిన కొరియర్ వచ్చింది.

అక్టోబర్ 31 సాయంత్రం వారి ఇంటికి ఓ కొరియర్ వచ్చింది. అది పంపిన వ్యక్తి పేరును తనిఖీ చేసినప్పుడు, ప్యాకెట్‌పై రాజ్‌దీప్ జ్యువెలర్స్, సరాఫా బజార్, హాపూర్ అని ఉన్నట్టుగా ప్రీతి కుమారుడు హర్ష్ తెలిపారు. అందులో ఏముందని తెరిచి చూడగా, వారి ఇంటి నుంచి దొంగిలించిన నగల డబ్బా కనిపించింది. దానిని తెరిచి చూడగా దొంగ అపహరించిన రూ.5 లక్షల విలువైన నగలు కనిపించాయి. మిగిలిన నగలు ఇంకా అందలేదు. ఘటన తర్వాత సొసైటీ గేటు వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఫుటేజీలో 22ఏళ్ల వయసు గల ఒక యువకుడు తన భుజంపై స్కూల్ బ్యాగ్‌తో సొసైటీ గేట్ నుండి బయటకు వస్తున్నట్లు కనిపించాడు. విచారణలో ఆ బ్యాగ్ ప్రీతి కుమారుడిదని పోలీసులు గుర్తించారు. అన్షు జైన్, సర్కిల్ ఆఫీసర్-2, “కొరియర్ ప్యాకెట్ గురించి పోలీసులకు తెలియగానే ఆ వస్తువులను తనిఖీ చేశారు. తరువాత, మేము విచారణ కోసం హాపూర్‌కు ఒక బృందాన్ని తరలించారు. పోలీసు బృందం సరాఫా బజార్‌కు చేరుకుని ప్యాకర్‌పై పేర్కొన్న దుకాణ వివరాలను తనిఖీ చేసినప్పుడు, రాజ్‌దీప్ జ్యువెలర్స్ పేరుతో ఉన్న అటువంటి దుకాణం ఇక్కడ ఏదీ లేదని తేలింది. ప్యాకెట్‌పై పేర్కొన్న మొబైల్ నంబర్ కూడా ఫేక్‌ నంబర్‌గా తెలిసింది. పోలీసులు కొరియర్ కంపెనీలో కూడా ఆరా తీశారు. అక్కడ ఇద్దరు వ్యక్తులు కనిపించిన ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను గుర్తించేందుకు పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు. విచారణ కొనసాగుతోందని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Latest Articles