PM Modi: పెట్టుబడిదారులను ‘రెడ్ టేప్’కాదు.. ‘రెడ్ కార్పెట్’ పరిచాం..- ప్రధాని మోదీ..
పెట్టుబడిదారులకు రెడ్ టేప్ నుంచి విముక్తి కల్పించామన్నారు. అవకాశాలకు రెడ్ కార్పెట్ వేస్తున్నట్లుగా తెలిపారు. కొత్త సంక్లిష్ట చట్టాలను రూపొందించడానికి బదులుగా..
ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం (నవంబర్ 2) మూడు రోజుల ‘ఇన్వెస్ట్ కర్ణాటక 2022’ సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ.. మదుపుదారులను రెడ్ టేపుల వలలో బంధించకుండా ప్రభుత్వం రెడ్ కార్పెట్ పరిచిందని అన్నారు. పెట్టుబడిదారులకు రెడ్ టేప్ నుంచి విముక్తి కల్పించామన్నారు. అవకాశాలకు రెడ్ కార్పెట్ వేస్తున్నట్లుగా తెలిపారు. కొత్త సంక్లిష్ట చట్టాలను రూపొందించడానికి బదులుగా..తాము వాటిని హేతుబద్ధంగా చేసామన్నారు. రక్షణ, డ్రోన్లు, అంతరిక్షం, జియోస్పేషియల్ మ్యాపింగ్ వంటి ప్రైవేట్ పెట్టుబడులకు అంతకుముందు మూసివేయబడిన వివిధ రంగాలలో పెట్టుబడులను భారతదేశం ప్రోత్సహించిందని ప్రధాని మోదీ అన్నారు. ఇది ప్రపంచ సంక్షోభ యుగం అయినప్పటికీ, నిపుణులు భారతదేశాన్ని ఒక ప్రకాశవంతమైన ప్రదేశంగా చూస్తారు. ప్రభుత్వం తన ప్రాథమిక సూత్రాలపై నిరంతరం కృషి చేస్తోంది, తద్వారా భారత ఆర్థిక వ్యవస్థ గడిచిన ప్రతి రోజు మరింత బలపడుతుంది.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్, ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, ప్రహ్లాద్ జోషి, రాజీవ్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర గ్లోబల్ ఇన్వెస్టర్ మీట్ కర్ణాటక గొప్ప సామర్థ్యాన్ని ప్రదర్శించడం. సంభావ్య పెట్టుబడిదారులను ఆకర్షించడం లక్ష్యంగా పెట్టుకుంది. బెంగళూరులో జరిగే మూడు రోజుల కార్యక్రమంలో 80కి పైగా స్పీకర్ సెషన్‌లు, 300 మందికి పైగా ఎగ్జిబిటర్‌లతో అనేక వాణిజ్య ప్రదర్శనలు జరుగుతాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం