Diabetes: డయాబెటిక్ బాధితులకు సూచన.. చక్కెర స్థాయి 200-400 mg/dl ఉంటే పెద్ద ప్రమాదం.. ఏం జరుగుతుందంటే..
డయాబెటిక్ రోగులలో చక్కెర స్థాయి 200-400 mg/dl ఉంటే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
మధుమేహం అనేది దేశంలోనే కాదు ప్రపంచంలో వేగంగా పెరుగుతున్న ఒక వ్యాధి. కోవిడ్-19 మహమ్మారి తర్వాత డయాబెటిక్ రోగుల సంఖ్య మరింత వేగంగా పెరుగుతోంది. ఏ వయసు వారైనా ఈ వ్యాధి బారిన పడేంత దారుణంగా తయారైంది పరిస్థితి. అయితే దీనిని పూర్తి స్థాయిలో తగ్గించులేము.. కానీ నియంత్రించడం మాత్రం సాధ్యమవుతుంది. లాసెంట్ డయాబెటిస్ & ఎండోక్రినాలజీలో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, టైప్ 2 డయాబెటిస్ ఉన్న రోగుల సంఖ్య రాబోయే 20 సంవత్సరాలలో భయంకరమైన స్థాయికి చేరుకుంటుంది. నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ నివేదిక ప్రకారం, 2045 నాటికి భారతదేశంలో టైప్ 2 డయాబెటిస్ ఉన్న రోగుల సంఖ్య 134 మిలియన్లకు మించి ఉంటుందట.
మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలంటే ఆహారంలో నియంత్రణతోపాటు శరీరాన్ని చురుగ్గా ఉంచుకోవాలి. మధుమేహాన్ని పెంచడంలో ఒత్తిడి పెద్ద శత్రువుగా మారుతుంది. డయాబెటిక్ రోగులకు సాధారణ రక్తంలో చక్కెరను నియంత్రణలో ఉంచుకోవడం ముఖ్యం. రక్తంలో చక్కెర స్థాయి 200 mg/dl దాటితే, శరీరంలోని అనేక అవయవాలు దెబ్బతింటాయి. డయాబెటిక్ రోగులలో చక్కెర స్థాయి 200-400 mg/dl ఉంటే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తుల చక్కెర స్థాయి 200-400 mg/dl ఉన్నప్పుడు వారిని ఎలా నియంత్రించాలో తెలుసుకుందాం.
రక్తంలో చక్కెర, గుండెపోటు మధ్య సంబంధం:
డయాబెటిక్ రోగుల ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్ 70-100 mg/dl మధ్య ఉండాలి. భోజనం చేసిన రెండు గంటల తర్వాత 130-140 mg/dl సాధారణం. తిన్న తర్వాత మీ చక్కెర స్థాయి 200-400 mg/dlకి చేరుకుంటే.. అప్పుడు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మధుమేహం ఉన్నవారు గుండె జబ్బులకు ఎక్కువ అవకాశం ఉంది.
డయాబెటిక్ రోగుల్లో 50 నుంచి 60 శాతం వరకు గుండె జబ్బులు ఉంటాయని అనేక పరిశోధనల్లో వెల్లడైంది. షుగర్ నియంత్రణలో లేకపోతే.. దాని ప్రభావం గుండెను నియంత్రించే రక్తనాళాలు, నరాలను దెబ్బతీస్తుంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం, డయాబెటిస్ ఉన్న రోగులకు గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
చక్కెర స్థాయి 200-400 mg/dl ఉన్నప్పుడు ఎలా నియంత్రించాలి:
- రక్తంలో చక్కెర స్థాయి 200 దాటితే వెంటనే వైద్యులను సంప్రదించాలి. చక్కెర నియంత్రణ మందులు తీసుకోండి.
- షుగర్ నియంత్రణకు జీవనశైలిలో మార్పులు చేసుకోండి. బరువు తగ్గండి.. ఆహారాన్ని నియంత్రించండి.
- చక్కెరను నియంత్రించడానికి, తీపి పదార్థాలను నివారించండి. తీపి పదార్థాలు చక్కెరను వేగంగా పెంచుతాయి.
- ఉప్పు తీసుకోవడం కూడా తగ్గించండి.
- ఆహారంలో పిండి, బంగాళదుంపలు వంటి ఆహారాలను నివారించండి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం