Skin Care: మనం తాగే మజ్జిగ చర్మంపై ఉండే సన్‌టాన్‌ను తొలగిస్తుంది..ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి

మజ్జిగను ఉపయోగించడం వల్ల చర్మంపై పేరుకున్న మురికి సులభంగా బయటకు వస్తుంది.

Skin Care: మనం తాగే మజ్జిగ చర్మంపై ఉండే సన్‌టాన్‌ను తొలగిస్తుంది..ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి
Skin Care
Follow us
Sanjay Kasula

|

Updated on: Nov 01, 2022 | 2:13 PM

పెరుగుతున్న కాలుష్యం, దుమ్ము, రసాయన ఉత్పత్తుల విపరీత వినియోగం చర్మాన్ని పాడుచేస్తున్నాయి. కాలుష్యం, వాతావరణంలో ఉండే దుమ్ము , హానికరమైన సూర్య కిరణాలు చర్మం మొత్తం మంచి మెరుగైన ఛాయను దూరం చేస్తాయి. దీంతో చర్మం మురికిగా కనిపిస్తుంది. గాలిలోని దుమ్ము, ధూళి, పొగ, ధూళి చర్మానికి చేరి అనేక సమస్యలను కలిగిస్తాయి. చర్మంపై ఉండే మురికి చర్మంపై పొరల రూపంలో పేరుకుపోయి ముఖంపై మొటిమలను కలిగిస్తుంది. అంతే కాదు చర్మం పొడిబారడం వల్ల చర్మంపై నల్లటి వలయాలు, నల్ల మచ్చలు, ముడతలు రావడం మొదలవుతాయి. మారుతున్న కాలంలో చర్మ సంరక్షణ కోసం రసాయన ఉత్పత్తులపై ఆధారపడకుండా, కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఉపయోగించండి. 

మజ్జిగ అనేది మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో, మన చర్మానికి కూడా అంతే మేలు చేస్తుంది. మజ్జిగ తీసుకోవడం వల్ల చర్మంపై పేరుకున్న మురికి తేలికగా బయటకు వచ్చి చర్మం పొడిబారడం కూడా తొలగిపోతుంది. మజ్జిగ వాడకం శీతాకాలంలో చర్మం మెరుస్తూ.. తేమగా ఉండటానికి చాలా ప్రభావవంతంగా ఉంటుంది. మజ్జిగ చర్మాన్ని ఎలా శుభ్రపరుస్తుంది. దానిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.

మజ్జిగ చర్మాన్ని ఎలా శుభ్రపరుస్తుంది:

మజ్జిగ అనేది చర్మంపై టానిక్‌గా పనిచేసే ఆహారం. ఇది చర్మంలోని బ్యాక్టీరియాను తొలగించి, చర్మంపై ఉండే మురికిని శుభ్రపరుస్తుంది. చర్మానికి మజ్జిగను ఉపయోగించడం వల్ల చర్మంపై వచ్చే మొటిమల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉన్న మజ్జిగ ఫ్రీ రాడికల్స్‌తో పోరాడడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది. చర్మంపై వృద్ధాప్య సంకేతాలను తొలగిస్తుంది. చర్మంపై వృద్ధాప్యాన్ని తొలగించేందుకు వారానికి రెండుసార్లు మజ్జిగను ముఖానికి పట్టించాలి. మీరు సన్‌టాన్‌తో ఇబ్బంది పడుతుంటే.. ముఖానికి మజ్జిగతో మసాజ్ చేయండి. ఈ ప్రభావం త్వరలో కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

చర్మంపై మజ్జిగను ఎలా ఉపయోగించాలి:

చర్మాన్ని శుభ్రం చేయడానికి, మీరు మజ్జిగను ప్యాక్‌గా తయారు చేసి ఉపయోగించవచ్చు. ఒక గిన్నెలో మూడు టేబుల్ స్పూన్ల మజ్జిగ తీసుకోండి. దానికి ఒక చెంచా ఆలివ్ ఆయిల్, ఒక చెంచా బాదం నూనె వేసి బాగా కలపాలి. ఈ ప్యాక్‌కి కొన్ని చుక్కల రోజ్ వాటర్ జోడించండి. మీ ప్యాక్ సిద్ధంగా ఉంది. ఈ ప్యాక్‌ని కాటన్‌తో ముఖానికి పట్టించి 15-20 నిమిషాల పాటు ముఖంపై అలాగే ఉంచాలి. 20 నిమిషాల తర్వాత నీళ్లతో ముఖం కడుక్కుంటే ముఖం శుభ్రంగా కనిపిస్తుంది. ఈ ప్యాక్ ముఖంలోని మురికిని లోపలి నుంచి శుభ్రపరుస్తుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం

Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు