GOOD NEWS: భారతీయులకు పండగే.. నైపుణ్యాలున్న వారికి ఆ దేశం రెడ్ కార్పెట్.. 15 లక్షల మందికి పైగా..
ఉద్యోగ నైపుణ్యాలు ఉన్న భారతీయులు స్థిరపడాలనుకునే దేశాల జాబితాల్లో అమెరికా మొదటి స్థానంలో ఉంటే రెండో స్థానం కెనడాతో అని చెప్పాలి. అంతలా భారతీయులు కెనడాలో స్థిరపడుతున్నారు. కెనడా జనాభాలో సుమారు 23 శాతం మంది వలసదారులే కాగా, వీరిలో మెజారిటీ వాట భారతీయులదే...
ఉద్యోగ నైపుణ్యాలు ఉన్న భారతీయులు స్థిరపడాలనుకునే దేశాల జాబితాల్లో అమెరికా మొదటి స్థానంలో ఉంటే రెండో స్థానం కెనడాతో అని చెప్పాలి. అంతలా భారతీయులు కెనడాలో స్థిరపడుతున్నారు. కెనడా జనాభాలో సుమారు 23 శాతం మంది వలసదారులే కాగా, వీరిలో మెజారిటీ వాట భారతీయులదే అని నివేదికలు చెబుతున్నారు. కెనడా గణాంక సంస్థ సెన్సస్ రిపోర్ట్ ప్రకారం కెనడాలో నివసిస్తున్న వలసదారుల్లో 18.6 శాతం మందితో భారత్ మొదటి స్థానంలో ఉంది. ఇదిలా ఉంటే భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి కారణం తాజాగా కెనడా ప్రభుత్వం వలసదారులకు ఆహ్వానం పలకడమే.
కెనడాలో కార్మికులు, నిపుణుల కొరత ఉన్న నేపథ్యంలో ఆ దేశం విదేశీయులకు రెడ్ కార్పెట్ పరిచించింది. 2025 నాటికి ఏటా 5 లక్షల మంది తమ దేశానికి వలస రావచ్చన్న ప్రణాళికతో ఉంది. వలసదారుల వ్యవహారాల మంత్రి సియాన్ ఫ్రేజర్ ఇందుకు సంబంధించి నూతన ప్రణాళికను విడుదల చేశారు. వలసలను ప్రోత్సహించే క్రమంలోనే అనుభవం, నైపుణ్యాలు ఉన్న వారికి శాశ్వత నివాస హోదా ఇవ్వనున్నారు. ఈ ప్రణాళికను ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ సైతం స్వాగతించడం విశేషం. ఈ విషయమై మంత్రి ఫ్రేజర్ మాట్లాడుతూ.. ఇది అతిపెద్ద వలసవాదంగా అభివర్ణించారు.
ఈ కొత్త ప్రణాళిక ప్రకారం 2023లో ఇత దేశాల నుంచి 4,65,000 మంది వస్తారని, 2025 నాటికి ఇలా వచ్చే వారి సంఖ్య 5,00,000కు చేరుకుంటుందని కెనడా అంచనా వేస్తోంది. ఇదిలా ఉంటే గతేడాది 4,05,000 మందికి కెనడా శాశ్వత నివాస హోదా కల్పించింది. ఇక కొత్తగా వచ్చే వారిలో ఎక్కువగా ఎకనామిక్ ఇమ్మింగ్రేట్స్ ఉంటారని, వీరు ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాల్లో ఉన్న సుమారు 1 మిలియన్ ఉద్యోగాలను భర్తీ చేస్తారని భావిస్తున్నారు. కెనడియన్ ఆర్థిక వ్యవస్థలో పది లక్షలకుపైగా ఉద్యోగాలు ఉన్నాయనీ, వలసలను స్వీకరించకపోతే తాము ఆర్థిక సామార్థ్యాన్ని పెంచుకోలేమని మంత్రి ఫ్రేజర్ తెలిపారు. కెనడాలో ప్రస్తుతం కార్మికుల కొరతతో సరిపడ ఇళ్ల నిర్మాణాలు జరగడం లేదని, కొత్త కార్మికులు అందుబాటులోకి వస్తే ఇళ్ల నిర్మాణం వేగవంతమవుతుందని ఫ్రేజర్ సూచించారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..