టీం ఇండియాకు ఫీల్డింగ్‌పై అంత శ్రద్ధలేదు..రోహిత్‌ కన్నా కోహ్లీ చాలా బెటర్‌: Ajay Jadeja

దక్షిణాఫ్రికా చేతిలో టీమిండియా ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. దీంతో టీమ్‌ఇండియా ఫీల్డింగ్‌పై సర్వత్రా విమర్శలు నెలకొన్నాయి. దీనిపై మాజీ క్రెకెటర్‌ అజయ్ జడేజా తాజాగా స్పందించాడు..

టీం ఇండియాకు ఫీల్డింగ్‌పై అంత శ్రద్ధలేదు..రోహిత్‌ కన్నా కోహ్లీ చాలా బెటర్‌: Ajay Jadeja
Jadeja's makes bold statement about India stars
Follow us

|

Updated on: Nov 02, 2022 | 9:13 PM

దక్షిణాఫ్రికా చేతిలో టీమిండియా ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. దీంతో టీమ్‌ఇండియా ఫీల్డింగ్‌పై సర్వత్రా విమర్శలు నెలకొన్నాయి. టీ20 ప్రపంచకప్‌లో సూపర్ 12 గ్రూప్ 2 పోరులో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయింది. రోహిత్ శర్మ సారథ్యంలో 20 ఓవర్లలో 133/9 వికెట్లకే స్కోర్‌ పరిమితమైంది. ఐతే దక్షిణాఫ్రికా అనూహ్యంగా కేవలం 19.4 ఓవర్లలో తన లక్ష్యాన్ని చేరుకుంది. ఈ ఉత్కంఠభరితమైన ఆటలో దక్షిణాఫ్రికాపై టీమ్ ఇండియా ఫీల్డింగ్ చేసిన తీరు క్రికెట్‌ అభిమానులతోపాటు, పలువురు సీనియర్‌ క్రికెటర్లను సైతం దిగ్భ్రాంతికి గురి చేసింది. దీనిపై మాజీ క్రెకెటర్‌ అజయ్ జడేజా తాజాగా స్పందించాడు.

‘విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా తన పగ్గాలు విడచినప్పటి నుంచి టీమ్ ఇండియా ఫీల్డింగ్‌పై ఫోకస్‌ పెట్టడం మానేసిందని అన్నాడు. ఫీల్డింగ్‌కు టీం ఇండియా అంత ప్రాధాన్యం ఇవ్వడం లేదు. విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఫీల్డింగ్‌కు అధిక ప్రాధాన్యతనివ్వడాన్ని నేను చివరిసారిగా చూశాను. కోహ్లీ తన టీంలోకి మంచి ఫీల్డర్లను మాత్రమే ఎంపిక చేస్తాడు. ఐతే ప్రస్తుత కెప్టెన్‌కు మాత్రం ఫీల్డింగ్‌పై అంత శ్రద్ధలేదు. బ్యాటింగ్, బౌలింగ్‌పైనే ఎక్కువ ఫోకస్‌ పెడుతున్నాడు. రవిచంద్రన్‌ అశ్విన్‌, మహ్మద్‌ షమీ బౌలింగ్ పరంగా ఈ ఇద్దరూ మంచి ఆటగాళ్లు. ఐతే వీళ్ల నుంచి మంచి ఫీల్డింగ్‌ను మాత్రం ఆశించకూడదు. జట్టును ఎంచుకునేటప్పుడు వారి నుంచి ఏం రాబట్టాలో కచ్చితంగా తెలుసుకోలేకపోవడంలో విఫలం అయ్యారు. టీం ఇండియా ఆటగాళ్లకు అథ్లెటిక్‌ లక్షణాలు లేవని’ జడేజా అన్నాడు. కాగా బుధవారం అడిలైడ్ ఓవల్‌లో జరిగే సూపర్ 12 గ్రూప్ 2లో భారత్ తదుపరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది.

కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!