IND vs BAN: బంగ్లాతో కీలక పోరుకు సిద్ధమైన రోహిత్ సేన.. వెదర్ నుంచి ప్లేయింగ్ 11 వరకు.. పూర్తి వివరాలు ఇవే..

India Vs Bangladesh Probable Playinh 11: ప్రస్తుతం భారత్ జట్టు గ్రూప్-2లో 3 మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, ఒక ఓటమితో 4 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో బంగ్లాదేశ్ జట్టు కూడా అదే సంఖ్యలో మ్యాచ్‌లు ఆడి 4 పాయింట్లతో మూడవ స్థానంలో ఉంది.

IND vs BAN: బంగ్లాతో కీలక పోరుకు సిద్ధమైన రోహిత్ సేన.. వెదర్ నుంచి ప్లేయింగ్ 11 వరకు.. పూర్తి వివరాలు ఇవే..
Team India
Follow us

|

Updated on: Nov 02, 2022 | 6:30 AM

దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి మ్యాచ్‌లో ఓడిపోయిన టీమ్ ఇండియా.. టీ20 ప్రపంచకప్‌లో తన నాలుగో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. బుధవారం బంగ్లాదేశ్‌తో అడిలైడ్‌లో సూపర్-12 గ్రూప్-2లో భాగంగా జరగనున్న ఈ మ్యాచ్ చాలా కీలకంగా మారింది. ప్రస్తుతం భారత్ జట్టు గ్రూప్-2లో 3 మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, ఒక ఓటమితో 4 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో టీ20 ప్రపంచ కప్ 2022లో బంగ్లాదేశ్ జట్టు కూడా అదే సంఖ్యలో మ్యాచ్‌లు ఆడి 4 పాయింట్లతో మూడవ స్థానంలో ఉంది. మెరుగైన నెట్ రేట్ కారణంగా భారత్ ప్రస్తుతం బంగ్లాదేశ్ కంటే ముందుంది.

ఈ మ్యాచ్‌లో గెలవడం ద్వారా భారత్ సెమీఫైనల్‌లోకి ప్రవేశించడం చాలా సులభంగా మారుతుంది. అదే సమయంలో ఓడిపోతే బంగ్లాదేశ్ దాదాపు ఔట్ అవుతుంది. ఈ మ్యాచ్ తర్వాత బంగ్లాదేశ్ చివరి మ్యాచ్ పాకిస్థాన్‌తో జరగనుండగా, భారత్ జింబాబ్వేతో ఆడాల్సి ఉంది.

ఒకవేళ బంగ్లాదేశ్‌తో భారత జట్టు ఓడిపోతే.. సెమీస్ చేరాలన్న రోహిత్ సేన దారి మూసుకపోతుంది. అలాంటి పరిస్థితిలో చివరి మ్యాచ్‌లో జింబాబ్వేపై గెలిచినప్పటికీ, భారత్ గరిష్టంగా 6 పాయింట్లను మాత్రమే కలిగి ఉంటుంది. ఇటువంటి పరిస్థితిలో పాకిస్తాన్ తన చివరి రెండు మ్యాచ్‌లు గెలిస్తే, అది కూడా 6 పాయింట్లను పొందుతుంది. అప్పుడు మెరుగైన నెట్ రన్ రేట్ ఉన్న జట్టు లాభపడుతుంది.

ఇవి కూడా చదవండి

ఒకవేళ భారత్ ఓడిపోతే బంగ్లాదేశ్‌కు కూడా అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి. భారత్ తర్వాత పాకిస్థాన్‌ను కూడా బంగ్లా ఓడిస్తే 8 పాయింట్లు వస్తాయి. ఈ పరిస్థితి అంతా చూస్తుంటే భారత్‌కు ఈ మ్యాచ్ ఒక విధంగా నాకౌట్ లాంటిదే అని చెప్పొచ్చు. ఒకవేళ ఓటమి ఎదురైతే, భారత్‌కు సెమీస్ మార్గం చాలా పరిమితం కావచ్చు.

వాతావరణం ఎలా ఉందంటే?

వాతావరణ సూచన వెబ్‌సైట్ AccuWeather ప్రకారం, మ్యాచ్ సమయంలో 30 నుంచి 60 శాతం వర్షం పడే ఛాన్స్ ఉంది. అయితే, ఆస్ట్రేలియాలో వాతావరణం చాలా వేగంగా మారుతుంది. అందువల్ల, భారీ వర్షం కురిసే అవకాశం ఎక్కువగా ఉండవచ్చు లేదా తక్కువగా కూడా ఉండవచ్చు.

పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలం?.

ఈ ప్రపంచకప్‌లో అడిలైడ్‌లో ఇంకా మ్యాచ్ ఆడలేదు. ఆస్ట్రేలియన్ టీ20 లీగ్ బిగ్ బాష్‌ను ప్రాతిపదికగా తీసుకుంటే, అది అధిక స్కోరింగ్ గ్రౌండ్‌గా నిలిచింది. ఇక్కడ రాత్రి మ్యాచ్‌లలో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు సగటు స్కోరు 170 పరుగులుగా ఉంది.

ఇక్కడ ఆడిన ఏకైక టీ20 మ్యాచ్‌లో విజయం సాధించడం టీమిండియాకు కలిసిరానుంది. 2016లో ఇక్కడ భారత్ 37 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది.

ప్రాబబుల్ ప్లేయింగ్ 11..

టీమిండియా: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, ఆర్ అశ్విన్, అర్ష్దీప్ సింగ్, మహమ్మద్ షమీ.

మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..