AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అక్షయ నవమి నాడు ఏదీ చేసినా రెట్టింపు ఫలితం దక్కుతుంది… డబ్బు, ఆహారం కొరతే ఉండదట…!

పూర్వం శ్రీలక్ష్మీ దేవి భూమిపైకి వచ్చినప్పుడు..శివకేశవులను పూజించాలనుకుందట. ఇద్దరినీ ఒకే సమయంలో పూజించడం ఎలా సాధ్యం అనుకున్న ఆ అమ్మవారు..ఉసిరి చెట్టును ఎంచుకుని అక్కడే పూజలు చేసిందట.

అక్షయ నవమి నాడు ఏదీ చేసినా రెట్టింపు ఫలితం దక్కుతుంది... డబ్బు, ఆహారం కొరతే ఉండదట...!
Amla Navami
Jyothi Gadda
|

Updated on: Nov 02, 2022 | 12:22 PM

Share

అక్షయ నవమి 2022 : కార్తీక మాసంలోని శుక్ల పక్ష తొమ్మిదవ తేదీని అక్షయ నవమి, ఉసిరి నవమి అంటారు. మన శాస్త్రల్లో అక్షయ నవమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఉసిరి పూజించడం వల్ల అన్ని ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారని నమ్ముతారు. నవంబర్ 2వ తేదీన అక్షయ నవమి రోజు..ఈ రోజున స్త్రీలు, సంతానం, అదృష్టం కోసం ఉపవాసం ఉంటారు. ఈ రోజున శ్రీమహావిష్ణువును, ఉసిరిని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని చెబుతారు. ఈ రోజున ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించడం విశేషం.

పూర్వం శ్రీలక్ష్మీ దేవి భూమిపైకి వచ్చినప్పుడు..శివకేశవులను పూజించాలనుకుందట. ఇద్దరినీ ఒకే సమయంలో పూజించడం ఎలా సాధ్యం అనుకున్న ఆ అమ్మవారు..ఉసిరి చెట్టును ఎంచుకుని అక్కడే పూజలు చేసిందట. శివకేశవులు ఉసిరి చెట్టులో నివసిస్తారని గుర్తించిన అమ్మవారు.. ఉసిరి చెట్టును పూజించి శివకేశవుల ప్ర్రీతికి పాత్రమైందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ రోజున ఉసిరి చెట్టు కింద పూజ చేయాలని పండితులు చెబుతారు.

అక్షయ నవమి రోజున చేసే పూజలతో అన్ని కోరికలను నెరవేరుతాయంటారు.. ఆ వ్యక్తిని మోక్షం మార్గంలో నడిపిస్తాయంటారు. ఈ రోజున స్వచ్ఛంద కార్యకలాపాలు చేయడం వల్ల రాబోయే జీవితకాలం వ్యక్తికి ప్రయోజనం ఉంటుంది. అందుకే అక్షయ నవమి నాడు విష్ణు విజయ స్తోత్రం, కనకధారా స్థవం, దుర్గా స్తోత్రం, లక్ష్మీ అష్టోత్తరం వంటి స్తోత్రాలను పఠించాలి. ఇంకా స్వామికి చక్కెర పొంగళి, దద్ధోజనం నైవేద్యంగా సమర్పించాలి. అక్షయ నవమినాడు చేసే పూజతో పాపాలు నశిస్తాయి. ధనలాభం వుంటుంది. శత్రువులపై విజయం, అధికార ప్రాప్తి లభిస్తుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.

ఇవి కూడా చదవండి

అలాగే ఈ రోజున ఉసిరి చెట్టుకు పూజలు చేసే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఉసిరి చెట్టులో శివకేశవులు కొలువై వుంటారని విశ్వాసం. ఈ రోజున ఉసిరి చెట్టుకు పూజ, దీపం వెలిగించడం.. ఉసిరి చెట్టు కింద భోజనాలు చేయడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మళ్లీ అందరి మనసులు గెల్చుకున్న బిగ్‌బాస్ తనూజ.. వీడియో వైరల్
మళ్లీ అందరి మనసులు గెల్చుకున్న బిగ్‌బాస్ తనూజ.. వీడియో వైరల్
హైదరాబాద్ వాసులకు మరోసారి ఈగల్ టీమ్ హెచ్చరిక
హైదరాబాద్ వాసులకు మరోసారి ఈగల్ టీమ్ హెచ్చరిక
తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం వాతావరణం ఎలా ఉంటుంది..?
తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం వాతావరణం ఎలా ఉంటుంది..?
శ్రీశైలంలో ఆన్ లైన్ విధానానికి భక్తులలో అనూహ్య స్పందన
శ్రీశైలంలో ఆన్ లైన్ విధానానికి భక్తులలో అనూహ్య స్పందన
కోచ్ పదవి నుంచి గౌతమ్ గంభీర్ అవుట్? క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ
కోచ్ పదవి నుంచి గౌతమ్ గంభీర్ అవుట్? క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ
ఆమ్లెట్ Vs ఉడికించిన గుడ్డు.. బరువు తగ్గడానికి ఏది మంచిది?
ఆమ్లెట్ Vs ఉడికించిన గుడ్డు.. బరువు తగ్గడానికి ఏది మంచిది?
కొత్త సంవత్సరం గిఫ్ట్.. ఏపీలోని రైతులకు ప్రభుత్వం నుంచి శుభవార్త.
కొత్త సంవత్సరం గిఫ్ట్.. ఏపీలోని రైతులకు ప్రభుత్వం నుంచి శుభవార్త.
KCR దగ్గరకు వెళ్లి పలకరించిన CM రేవంత్ రెడ్డి
KCR దగ్గరకు వెళ్లి పలకరించిన CM రేవంత్ రెడ్డి
శత్రువుల గుండెల్లో వణుకు.. ఆర్మీ చేతికి అత్యాధునిక అస్త్రాలు..
శత్రువుల గుండెల్లో వణుకు.. ఆర్మీ చేతికి అత్యాధునిక అస్త్రాలు..
ధోనీ కారులో సిగరెట్ ప్యాకెట్.. వైరల్ వీడియోతో సోషల్ మీడియా షేక్
ధోనీ కారులో సిగరెట్ ప్యాకెట్.. వైరల్ వీడియోతో సోషల్ మీడియా షేక్