Sathya Sai Baba: సత్యసాయి ఫొటో నుంచి విభూది.. భక్తుడి ఇంటికి క్యూ కట్టిన పుట్టపర్తి గ్రామస్తులు..
సత్యసాయి ఫొటో నుంచి విభూది రాలుతోందంటూ గ్రామస్తులు ఆ ఇంటికి క్యూ కట్టారు. ఇంతకీ ఆ ఇంట్లో ఏం జరిగింది.
సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో అద్భుతం జరిగింది. సత్యసాయి ఫొటో నుంచి విభూది రాలుతోందంటూ గ్రామస్తులు ఆ ఇంటికి క్యూ కట్టారు. ఇంతకీ ఆ ఇంట్లో ఏం జరిగింది. పుట్టపర్తి మున్పిపాల్టీ పెద్దకమ్మవారిపల్లిలో సత్యసాయి భక్తురాలి ఇంట్లో వింత జరిగిందన్న వార్త ఆనోటా ఈనోటా ఊరు మొత్తం చుట్టేసింది.ఆ దృశ్యం చూసిన ఆ ఇంటివాళ్లు పూజలు మొదలెట్టేశారు. చుట్టుపక్కలవాళ్లంతా తరలివస్తునన్నారు. సత్యసాయిబాబా పుట్టిన నెల కావడంతో ఈ మహిమ బయటపడిందంటున్నారు. ఇవే కాదు గతంలో కూడా జిల్లాలో చాలా వింతలు జరిగాయన్నారు. బాబా మన మధ్యలో లేకపోయినా .. నిత్యం ఆరాధిస్తూ, కొలుస్తూ ఉన్నవారికి వెన్నంటే ఉన్నారని ఈ రూపంలో నిరూపించారంటున్నారు భక్తులు. ప్రతి ఏడాది నవంబర్ నెలలో విభూది రాలుతోందని..ఇదంతా సత్యసాయి మహిమే అంటున్నారు.
ఇదిలావుంటే..సత్యసాయి జిల్లా జీరిగేపల్లిలో మరో వింత చోటు చేసుకుంది. స్తానిక అమ్మాజీ ఆలయంలోకి రాత్రి తొమ్మిది గంటల సమయంలో రెండు ఎలుగుబంట్లు రావడం.. ఆలయ ప్రధాన ద్వారం నుంచి గుడిలోకి వెళ్లాయి. ఆ తర్వాత రెండు ఎలుగుబంట్లలో.. ఓ ఎలుగుబంటి గుడి గంటకు వేలాడుతున్న తాడును నోట్లో కరుచుకొని.. ముందు కాళ్లతో లాగుతూ గుడి గంటను మోగించింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం