కదులుతున్న రైలు నుంచి పడిపోయిన తల్లీబిడ్డను కాపాడిన పోలీసులు.. వీడియో వైరల్‌

కదులుతున్న రైలు కింద పడబోయిన ఓ చిన్నారిని రైల్వే పోలీసులు కాపాడారు.రద్దీ కారణంగా రైలు కదులుతున్న సమయంలో ఆమె పట్టుకోల్పోయింది.

కదులుతున్న రైలు నుంచి పడిపోయిన తల్లీబిడ్డను కాపాడిన పోలీసులు.. వీడియో వైరల్‌
Rpff
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 02, 2022 | 2:09 PM

మన దేశంలో నిత్యం ఎన్నో రైలు ప్రమాద ఘటనలు జరుగుతుంటాయి. పట్టాలు దాటుతుండగా కొందరు… కదులుతున్న రైలు నుంచి పడిపోయి మరికొందరు.. ప్రమాదాల బారినపడుతుంటారు. తాజాగా అలాంటిదే మరో సంఘటన చోటు చేసుకుంది. కదులుతున్న రైలు కింద పడబోయిన ఓ చిన్నారిని రైల్వే పోలీసులు కాపాడారు. ఈ ఘటన ముంబయిలోని మన్‌కుర్ద్‌ రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

ముంబయిలోని మన్‌కుర్ద్‌ రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకుంది. మంగళవారం మధ్యాహ్నం సమయంలో ఓ మహిళ చిన్నారిని ఎత్తుకుని రెండవ నంబర్‌ ప్లాట్‌ఫాంపైకి వచ్చింది. అక్కడున్న లోకల్‌ ట్రైన్‌ను ఎక్కింది. రద్దీ కారణంగా రైలు కదులుతున్న సమయంలో ఆమె పట్టుకోల్పోయింది. ఈ క్రమంలో మహిళ చేతిలోని చిన్నారి జారి రైలు కింద పడబోయింది. అక్కడే ఉన్న రైల్వే పోలీసు అక్షయ్‌ సోయ గమనించి చిన్నారి రైలు కిందపడకుండా కాపాడాడు.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి..

కొంత దూరం వెళ్లాకా సదరు మహిళను అక్కడే ఉన్న ఓ ప్రయాణికుడు కాపాడాడు. ఇందుకు సంబంధించిన దృష్యాలు రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు అక్షయ్‌ సాహసంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరిన్ని  ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!