Sachin Pilot: రాజస్థాన్ కాంగ్రెస్‌లో మళ్లీ ముసలం.. సీఎం గెహ్లాట్ తీరుపై సచిన్ పైలట్ తీవ్ర విమర్శలు
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌పై ఆ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ మరోసారి విరుచుకుపడ్డారు. నిన్న గెహ్లాట్‌ను ప్రధాని మోదీ పొగిడిన తీరును దుయ్యబట్టిన పైలట్..
రాజస్థాన్ కాంగ్రెస్‌లో మళ్లీ ముసలం పుట్టింది. సీఎం అశోక్ గెహ్లాట్ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు సీనియర్ నేత సచిన్ పైలట్. గులాంనబీఆజాద్ లాగే పార్టీకి నమ్మకద్రోహం చేసేందుకు గెహ్లాట్ కుట్ర చేస్తున్నారని విమర్శించారు సచిన్ పైలట్. పార్లమెంట్‌లో ఆజాద్‌ను పొగిడిన తరువాత ఏం జరిగిందో అందరికి తెలుసన్నారు. ప్రధాని మోదీని అశోక్ గెహ్లాట్ ఆకాశానికి ఎత్తడం.. దానికి బదులుగా ఆయన్ను మోదీ ప్రశంసల్లో ముంచెత్తడం చాలా ఆశ్చర్యకరమైన పరిణామమన్నారు సచిన్ పైలట్. సెప్టెంబర్ 25న సీఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేయకపోవడంపై సీఎం అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ హైకమాండ్‌కు , సోనియాగాంధీకి క్షమాపణలు చెప్పారని అన్నారు సచిన్ పైలట్. సీఎల్పీ సమావేశానికి ఎమ్మెల్యేలు హాజరుకాకపోవడం క్రమశిక్షణారాహిత్యమే అవుతుందని కాంగ్రెస్ హైకమాండ్ కూడా ప్రకటించిదన్నారు. అశోక్ గెహ్లాట్ – మోదీ పరస్పర ప్రశంసలను కాంగ్రెస్ అధిష్టానం సీరియస్‌గా తీసుకోవాలన్నారు సచిన్ పైలట్.
మంగళవారం రాజస్థాన్ లోని బాంస్‌వాఢా జిల్లా మాన్‌గడ్ ధామ్ దగ్గర ద్ద భిల్ ఆదివాసీలు, ఇతర తెగల ప్రజలను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. ఈ వేదికపై రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ ముఖ్యమంత్రులు అశోక్ గెహ్లాట్ , శివరాజ్ సింగ్ చౌహాన్, భూపేంద్ర పటేల్ ప్రధానితో వేదిక పంచుకున్నారు.
మహాత్మా గాంధీ జనడయాడిన దేశానికి, ప్రజాస్వామ్య మూలాలు బలంగా ఉన్న దేశానికి ప్రధాని కావడంతో మోదీ ఏ దేశం వెళ్లినా అమితమైన గౌరవం పొందుతున్నారని ప్రశంసించారు అశోక్ గెహ్లాట్. భారత్‌లో ప్రజాస్వామ్యం సజీవంగా ఉందని అన్నారు.
గెహ్లాట్ , తాను సీఎంగా ఉన్న రోజుల్ని మోదీ గుర్తుచేసుకున్నారు. ముఖ్యమంత్రులుగా తాను , గెహ్లాట్ కలిసి పనిచేశామని , ఆయనకు ఎంతో పాలనా అనుభవం ఉందని అన్నారు. వేదికపై కూర్చొన్న ముఖ్యమంత్రుల్లో ఆయనే అత్యంత సీనియర్’ అని ప్రశంసించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..