Twitter: నెల నెల అంటే కష్టం బాస్.. బ్లూ టిక్ ఛార్జీలపై బాలీవుడ్ నటుడు ఆసక్తికర ట్వీట్..
ఎన్నో వివాదాలు, మరెన్నో ఆరోపణలు, ఇంకెన్నో విమర్శల నడుమే ప్రపంచకుబేరుడు టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ ఎట్టకేలకు ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇలా ట్విట్టర్ కొనుగోలు ముగిసిందో లేదో అలా ఉద్యోగులను తొలగించిన ఒక్కసారిగా అందరినీ ఉలిక్కి పడేలా చేశాడు..
ఎన్నో వివాదాలు, మరెన్నో ఆరోపణలు, ఇంకెన్నో విమర్శల నడుమే ప్రపంచకుబేరుడు టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ ఎట్టకేలకు ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇలా ట్విట్టర్ కొనుగోలు ముగిసిందో లేదో అలా ఉద్యోగులను తొలగించిన ఒక్కసారిగా అందరినీ ఉలిక్కి పడేలా చేశాడు మస్క్. ఇక తాను ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన వెంటనే కచ్చితంగా ప్రక్షాళన ఉంటుందని చెప్పిన ఎలాన్ మస్క్ అన్నంత పని చేస్తున్నాడు. ఆ దిశగానే బ్లూటిక్ విషయమై మొదటి అడుగు వేశాడు. ఆదాయ మార్గాలను పెంచుకునే క్రమంలో బ్లూటిక్‌కు ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఇందులో భాగంగానే యూజర్లు బ్లూటిక్ కలిగి ఉండాలంటే నెలకు 8 డాలర్లు, మన కరెన్సీలో చెప్పాలంటే రూ. 664 చెల్లించాలని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎలాన్ మస్క్ తీసుకున్న ఈ నిర్ణయంపై మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు ఈ నిర్ణయాన్ని తప్పుపడుతుండగా మరికొందరు మాత్రం సమర్థిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ట్విట్టర్ తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రముఖ బాలీవుడ్ నటుడు, క్రిటిక్ కమల్ రషీద్ ఖాన్ తనదైన శైలిలో స్పందించారు. కేఆర్కేగా ఎక్కువగా సుపరితమైన ఈయన నిత్యం ఏదో ఒక అంశంతో వార్తల్లో నిలుస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ట్విట్టర్‌పై పలు ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.
Dear @elonmusk pls introduce lifetime membership charges also. Many of us would love to pay for lifetime.
— KRK (@kamaalrkhan) November 2, 2022
బ్లూటిక్‌కు ఛార్జీలు వసూలు చేయడంపై స్పందించిన కేఆర్‌కే ట్విట్టర్ వేదికగా మస్క్‌ను ఉద్దేశిస్తూ.. ‘నెల నెలా డబ్బులు చెల్లించడానికి నాకు సమయం ఉండదు. కాబట్టి నేను ఐదేళ్లకు ఒకేసారి డబ్బులు చెల్లిస్తాను. నాకు లింక్ సెండ్ చెయ్యి’ అంటూ ట్వీట్ చేశాడు. దీంతో కేఆర్‌కే ఈ ట్వీట్‌ను నిజాయితీగానే చేశాడా.? లేదా ఫన్నీగా చేశాడా.? అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక అంతకు ముందు చేసిన ట్వీట్‌లో.. ట్విట్టర్ సెఫ్టీ హెడ్ పేరును ప్రస్తావిస్తూ.. ‘యోయియల్ చేసిన ట్వీట్స్ గమనిస్తుంటే కొన్ని రోజుల్లో కంగనా రనౌత్ అకౌంట్‌ను రీయాక్టివేట్ చేసే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది’ అంటూ కౌంటర్ వేశాడు.
Tweets of @Yoyoel are giving indication that #KanganaRanaut might be able to get her #Twitter account back within next few weeks.
— KRK (@kamaalrkhan) November 2, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..