AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hair Care Tips: చలికాలంలో వేడి నీళ్లతో తలస్నానం చేస్తున్నారా.. మీ జుట్టు పొడిబారుతుంది.. ఈ 3 చిట్కాలతో ఆ సమస్యకు చెక్ పెట్టండి

చలికాలంలో వేడినీరు వెంట్రుకలను పొడిబారడంతోపాటు బలహీనపరుస్తుంది. ఇలానే నిర్లక్ష్యం చేస్తే ఇది బట్టతలకి దారి తీస్తుంది.

Hair Care Tips: చలికాలంలో వేడి నీళ్లతో తలస్నానం చేస్తున్నారా.. మీ జుట్టు పొడిబారుతుంది.. ఈ 3 చిట్కాలతో ఆ సమస్యకు చెక్ పెట్టండి
Hair Care Tips
Sanjay Kasula
|

Updated on: Nov 03, 2022 | 10:21 AM

Share

చల్లని వాతావరణం ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడమే కాకుండా జుట్టును కూడా ప్రభావితం చేస్తుంది. ఈ సీజన్‌లో జుట్టును వేడి నీళ్లతో శుభ్రం చేయడం వల్ల పొడిబారి నిర్జీవంగా మారుతాయి. జుట్టు పొడిబారడం వల్ల జుట్టు బలహీనపడుతుంది. దీని కారణంగా జుట్టు త్వరగా విరిగిపోతుంది. చల్లని గాలి, పొడి వాతావరణం జుట్టు పొడిగా చేస్తుంది. డ్రై హెయిర్ డ్రై, ఫ్రిజ్జీగా మారి త్వరగా విరిగిపోతుంది. అలాంటి జుట్టులో చుండ్రు సమస్య కూడా పెరగడం మొదలవుతుంది. చలికాలంలో జుట్టు సంరక్షణ చాలా ముఖ్యం. ఈ సీజన్లో, జుట్టు సంరక్షణ కోసం, మహిళలు వివిధ రకాల సౌందర్య ఉత్పత్తులను ఉపయోగిస్తారు. ఇది కొన్నిసార్లు జుట్టుపై దుష్ప్రభావాలను కలిగి ఉంటుంది. శీతాకాలంలో జుట్టు సంరక్షణ కోసం ఇంటి నివారణలను ఉపయోగించడం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. జుట్టు పొడిబారడాన్ని తొలగించడానికి అనుసరించే రెమెడీస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పెరుగుతో జుట్టు పొడిబారడాన్ని నియంత్రించవచ్చు..

పెరుగు తీసుకోవడం జుట్టుకు ఎంత మేలు చేస్తుందో ఆరోగ్యానికి కూడా అంతే మేలు చేస్తుంది. పెరుగు తినడం వల్ల శరీరం హైడ్రేట్‌గా ఉండేలా, వెంట్రుకలకు పెరుగును ఉపయోగించడం వల్ల జుట్టు హైడ్రేట్‌గా ఉంటుంది. పోషకాలు అధికంగా ఉండే పెరుగు చలికాలంలో జుట్టుకు పోషణనిస్తుంది. దీన్ని జుట్టుకు ఉపయోగించడం వల్ల జుట్టుకు పోషణ లభిస్తుంది. ఒక గిన్నెలో పెరుగు తీసుకుని, బ్రష్ సహాయంతో జుట్టు, తలకు పట్టించాలి. 15 నిమిషాల తర్వాత జుట్టును కడిగేస్తే మీ జుట్టు పొడిబారడం తగ్గుతుంది.

గుడ్డును ఉపయోగించి..

జుట్టుకు కోడి గుడ్లను ఉపయోగించడం వల్ల జుట్టుకు తగినంత పోషణ లభిస్తుంది. ప్రొటీన్లు అధికంగా ఉండే గుడ్డు జుట్టుపై కెరాటిన్ ట్రీట్‌మెంట్‌గా పనిచేస్తుంది. కోడిగుడ్లలో ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టుకు పోషణనిస్తుంది. జుట్టుకు గుడ్డును ఉపయోగించాలంటే, ఒక గిన్నెలో గుడ్డు తీసుకొని బాగా కొట్టండి. ఈ పేస్ట్‌ను 15-20 నిమిషాల పాటు జుట్టుకు పట్టించి, ఆ తర్వాత షాంపూతో జుట్టును కడగాలి. గుడ్డును అప్లై చేసిన తర్వాత జుట్టు పొడిబారడంతోపాటు జుట్టు ఆరోగ్యంగా కనిపిస్తుంది.

అలోవెరా అప్లై చేయండి..

చలికాలంలో జుట్టు పొడిబారకుండా ఉండాలంటే అలోవెరా జెల్ ను జుట్టుకు పట్టించాలి. ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న కలబంద జెల్ జుట్టు పొడిబారకుండా చేస్తుంది. జుట్టును ఆరోగ్యవంతంగా చేస్తుంది. కలబందలో మాయిశ్చరైజింగ్ గుణాలు ఉన్నాయి, ఇవి జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. అలోవెరా జెల్ అప్లై చేయడానికి, ఒక గిన్నెలో కలబంద గుజ్జును తీసి బ్రష్ సహాయంతో జుట్టు మొత్తం అప్లై చేయాలి. అరగంట తర్వాత నీళ్లతో జుట్టును కడగాలి. కలబంద జుట్టుకు పోషణను అందిస్తుంది. జుట్టు పొడిని కూడా తొలగిస్తుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం