చంద్రగ్రహణం రోజున తప్పక పాటించాల్సిన నియమాలు.. ఇలాంటి పనులు పొరపాటున కూడా చేయకండి..

ఈ సంవత్సరంలో చివరి చంద్రగ్రహణం నవంబర్ 8, 2022న ఏర్పడుతుంది. సూర్య, చంద్ర గ్రహణాలు సహజంగా జరిగేవి.. అయితే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అంటే

చంద్రగ్రహణం రోజున తప్పక పాటించాల్సిన నియమాలు.. ఇలాంటి పనులు పొరపాటున కూడా చేయకండి..
Lunar Eclipse
Follow us

|

Updated on: Nov 03, 2022 | 11:04 AM

చంద్ర గ్రహణం 2022: జ్యోతిష్యం ప్రకారం గ్రహణం ఒక ముఖ్యమైన సంఘటన. గ్రహణం, అది సూర్యగ్రహణం అయినా లేదా చంద్రగ్రహణం అయినా సరే, జ్యోతిష్యం ప్రకారం,.. అన్ని రాశుల మీద ప్రభావం చూపుతుంది. అంటే గ్రహణం కొందరికి మంచిగా ఉంటే, కొన్ని రాశుల వారికి అశుభం కలిగిస్తుంది. ఇటీవలే ఈ సంవత్సరంలో చివరి సూర్యగ్రహణం సంభవించింది. అది దీపావళి మరుసటి రోజున సూర్యగ్రహం ఏర్పడింది. ఇది భారతదేశంతో సహా ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో కనిపించింది. ఇదిలా ఉండగా, ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం కూడా త్వరలో జరగబోతోంది. అంటే ఏడాది చివరి సూర్యగ్రహణం తర్వాత 15 రోజుల తర్వాత చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. ఈ గ్రహణం భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో పాక్షికంగా, పూర్తిగా కనిపిస్తుంది. ఈ సంవత్సరంలో చివరి చంద్రగ్రహణం నవంబర్ 8, 2022న ఏర్పడుతుంది. సూర్య, చంద్ర గ్రహణాలు సహజంగా జరిగేవి.. అయితే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అంటే జ్యోతిష్య శాస్త్రంలో గ్రహణ సమయంలో కొన్ని పనులు చేయడం నిషిద్ధం. త్వరలో చంద్రగ్రహణం రాబోతుంది కాబట్టి గ్రహణ సమయంలో చేయాల్సినవి, చేయకూడనివి ఏమిటో తెలుసుకుందాం…

చంద్రగ్రహణం సమయంలో ఈ పనులు చేయండి.. జ్యోతిషం ప్రకారం, చంద్రగ్రహణం సమయంలో ఆహారం వండడం, తినడం నిషేధించబడింది. ఈ సమయంలో ఎలాంటి పూజలు చేయకూడదు. గుడి తలుపులు, పూజా గదులు మూసేయాలి. గ్రహణ సమయంలో నిద్రపోకూడదని కూడా అంటారు. గ్రహణ సమయంలో భగవంతుడి నామాన్ని జపించండి.

గ్రహణ సమయంలో గర్భిణులు మరింత జాగ్రత్తగా ఉండాలి. వారు ఇంటి నుండి బయటకు రాకూడదు. అలాగే చంద్రగ్రహణం సమయంలో గర్భిణులు కత్తులు, కత్తెరతో ఏ పనీ చేయకూడదు. చంద్రగ్రహణం సమయంలో చెట్లను, మొక్కలను తాకడం మానుకోండి.

ఇవి కూడా చదవండి

చంద్రగ్రహణం సమయంలో ఈ పనులు చేయవచ్చు .. జ్యోతిషం ప్రకారం, చంద్రగ్రహణం ప్రారంభమయ్యే ముందు అన్ని వండిన ఆహార పదార్థాలలో తులసి ఆకులను ఉంచండి. చంద్రగ్రహణం ప్రారంభం నుండి చివరి వరకు భగవంతుడి నామాన్ని జపించండి. గ్రహణం తర్వాత ఇంటిని శుభ్రం చేసి ఇంటింటా గంగాజలం చల్లాలి. గ్రహణం తర్వాత అన్నదానం చేయడం శ్రేయస్కరం.

(నోట్‌.. ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష్య నిపుణులు చెప్పిన అంశాల మేరకు తెలియజేయడమైనది. కేవలం అవగాహన కోసం మాత్రమే..)

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Latest Articles
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..
పుష్పరాజ్‏కు షూ స్టెప్ కొరియోగ్రఫీ చేసింది ఎవరో తెలుసా ..?
పుష్పరాజ్‏కు షూ స్టెప్ కొరియోగ్రఫీ చేసింది ఎవరో తెలుసా ..?
ఉత్తరాఖండ్ అడవుల్లో కొనసాగుతున్న మంటలు.. 52 మందిపై కేసులు నమోదు
ఉత్తరాఖండ్ అడవుల్లో కొనసాగుతున్న మంటలు.. 52 మందిపై కేసులు నమోదు
అమేథీ, రాయ్‌బరేలీ అభ్యర్థులను ఖరారు చేసిన ఏఐసీసీ
అమేథీ, రాయ్‌బరేలీ అభ్యర్థులను ఖరారు చేసిన ఏఐసీసీ
వేసవిలో రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి వ్యాయామాలు
వేసవిలో రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి వ్యాయామాలు
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..
మేలో శని జయంతి ఎప్పుడు? తేదీ, శుభ సమయం తెలుసుకోండి..
మేలో శని జయంతి ఎప్పుడు? తేదీ, శుభ సమయం తెలుసుకోండి..
తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ భవిష్యత్ ఎలా ఉండబోతోంది?
తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ భవిష్యత్ ఎలా ఉండబోతోంది?
సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్.. నెటిజన్స్ రియాక్షన్ ఇదే..
సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్.. నెటిజన్స్ రియాక్షన్ ఇదే..
స్మార్ట్‌ఫోన్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. 40 వేల ఫోన్‌ 28,000 వేలకే
స్మార్ట్‌ఫోన్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. 40 వేల ఫోన్‌ 28,000 వేలకే