Vastu Tips: మీ ఇంటి నైరుతిలో ఇవి ఉన్నాయా.? భారీగా నష్టపోతారు జాగ్రత్త..

ఇంటిని నిర్మించే ముందు ప్రతీ ఒక్కరూ కచ్చితంగా చూసుకునే అంశం వాస్తు. చిన్న ఇంటి నుంచి పెద్ద, పెద్ద అపార్ట్‌మెంటుల వరకు వాస్తు సరిగ్గా ఉండేలా చూసుకుంటారు. వాస్తు శాస్త్ర పండితుల సూచనలు, సలహాల ఆధారంగా వాస్తు నియమాలను పాటిస్తుంటారు. ఇంటి నిర్మాణం ఏలా అయితే వాస్తు ప్రకారం ఉండాలో...

Vastu Tips: మీ ఇంటి నైరుతిలో ఇవి ఉన్నాయా.? భారీగా నష్టపోతారు జాగ్రత్త..
Vastu Tips
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 03, 2022 | 11:05 AM

ఇంటిని నిర్మించే ముందు ప్రతీ ఒక్కరూ కచ్చితంగా చూసుకునే అంశం వాస్తు. చిన్న ఇంటి నుంచి పెద్ద, పెద్ద అపార్ట్‌మెంటుల వరకు వాస్తు సరిగ్గా ఉండేలా చూసుకుంటారు. వాస్తు శాస్త్ర పండితుల సూచనలు, సలహాల ఆధారంగా వాస్తు నియమాలను పాటిస్తుంటారు. ఇంటి నిర్మాణం ఏలా అయితే వాస్తు ప్రకారం ఉండాలో ఇంట్లో ఉండే వస్తువులు కూడా అదే విధంగా ఉండాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇంట్లో ఉంచే వస్తువులు మన ఆరోగ్య, ఐశ్వర్యాలపై ప్రభావం చూపుతుందని చెబుతుంటారు. ఈ క్రమంలోనే ఇంటి నైరుతి దిక్కున కొన్ని వస్తువులు, నిర్మాణాలు ఉంటే చాలా నష్టపోతారని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ వాస్తు శాస్త్రం ఆధారంగా నైరుతి దిక్కున ఎలాంటి వస్తువులు ఉండకూడదో ఓ లుక్కేయండి..

* వాస్తు నిపుణుల అభిప్రాయం మేరకు నైరుతి దిశలో ఎట్టి పరిస్థితుల్లో పూజ గదిని నిర్మించకూడదు. ఈ దిక్కు ప్రతిష్టించిన దేవతలను పూజిస్తే ఫలితం ఉండదని చెబుతారు. అంతేకాదు ఈ దిక్కున కూర్చుంటే ఏకాగ్రతా కూడా ఉండదు, కాబట్టి ఇక్కడ కూర్చొని ధ్యానం వంటివి చేసినా ప్రశంతంత లభించదు.

* ఇంటికి నైరుతి దిశలో అండర్‌ గ్రౌండ్ వాటర్‌ ట్యాంక్‌ ఎట్టి పరిస్థితుల్లో ఉండకూదు. దీనివల్ల వాస్తు దోషాలు పెరుగుతాయి. అయితే తప్పని పరిస్థితిలో ఈ దిశలో పైకి ట్యాంక్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

* ఇంటికి నైరుతి దిశలో మరుగుదొడ్డి లేకుండా చూసుకోవాలి. ఇది ఇంట్లో ఉండే వారిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. దీనివల్ల ఇంట్లో ఉండే వారి ఆర్థిక పురోగతిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది, అలాగే ఎప్పుడూ అనారోగ్యంతో ఉంటారు.

* నైరుతి దిశలో పిల్లల స్టడీ రూమ్‌ను నిర్మించకూడదు. ఈ దిశలో కూర్చుంటే ఏకాగ్రతా కరువైవుతుంది. కాబట్టి ఎంత చదివినా ఫలితం మాత్రం శూన్యంగా ఉంటుంది.

* నైరుతి మూలన గెస్ట్‌ రూమ్‌ను కూడా నిర్మించకూడదు. ఈ దిశలో నివసించే వారి మనసు నిశ్చలంగా ఉండదు, ప్రవర్తనల్లో ఆకస్మాత్తుగా మార్పు వస్తుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కొందరు వాస్తు నిపుణులు చెప్పిన సూచనల మేరకు అందించినవి మాత్రమే. దీనిపై ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్‌ గమనించాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!