Tirumala: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. తిరుమలలో భారీ రద్దీ.. దర్శనానికి సుమారు 30 గంటల సమయం

తిరుమల గిరులు భక్తులతో నిండిపోయాయి. ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనం కోసం 31 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. కంపార్ట్ మెంట్లో స్వామి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు 30 గంటల సమయం పడుతుంది.

Tirumala: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. తిరుమలలో భారీ రద్దీ.. దర్శనానికి సుమారు 30 గంటల సమయం
Tirumala Rush
Follow us
Surya Kala

|

Updated on: Nov 03, 2022 | 12:07 PM

పవిత్ర కార్తీక మాసం సందర్భంగా ప్రముఖ పుణ్య క్షేత్రం తిరుమల తిరుపతిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశ వ్యాప్తంగా భక్తులు తిరుమలకొండకు భారీగా తరలి వస్తున్నారు. పవిత్ర మాసం.. పుష్ప యాగం వంటి విశేష పండగల సందర్భంగా అశేష సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తున్నారు. దీంతో తిరుమల గిరులు భక్తులతో నిండిపోయాయి. ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనం కోసం 31 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. కంపార్ట్ మెంట్లో స్వామి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు 30 గంటల సమయం పడుతుంది. మరోవైపు కొండమీద భక్తులు వసతి కోసం అవస్థలు పడుతున్నారు. గదులు ఖాళీ లేకపోవడంతో భక్తులకు ఇక్కట్లు తప్పడం లేదు. కొండపై ఉన్న యాత్రికుల వసతి సముదాయాలన్నీ భక్తులతో నిండిపోయాయి.

కాగా బుధవారం రోజున శ్రీవారిని 68,995 మంది భక్తులు దర్శించుకున్నారు. ఒక్కరోజులో రూ. 3.71 కోట్ల శ్రీవారి హుండీ ఆదాయం లభించింది. 29,037 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్లలో ఉన్న భక్తులకు అల్పాహారం, మంచినీటిని టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు సరఫరా చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!