Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

China Space Center: అంతరిక్ష రంగంలో మరో అద్భుతం దిశగా చైనా.. స్పేస్‌ స్టేషన్‌లోకి కోతులను పంపేందుకు..

అంతరిక్ష రంగంలో తనదైన ముద్ర వేయడానికి డ్రాగన్‌ కంట్రీ తహతహలాడుతోంది. ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే అంతరిక్షంలో తనకంటూ ప్రత్యేకంగా ఓ స్పేస్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేసుకుంటోంది. న్యూ తియాంగాంగ్‌ పేరుతో స్పేస్‌ స్టేషన్‌ నిర్మాణాన్ని చైనా ప్రారంభించింది. ప్రస్తుతం ఈ స్పేస్‌ స్టేషన్‌ నిర్మాణ..

China Space Center: అంతరిక్ష రంగంలో మరో అద్భుతం దిశగా చైనా.. స్పేస్‌ స్టేషన్‌లోకి కోతులను పంపేందుకు..
China Space Station
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 06, 2022 | 1:36 PM

అంతరిక్ష రంగంలో తనదైన ముద్ర వేయడానికి డ్రాగన్‌ కంట్రీ తహతహలాడుతోంది. ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే అంతరిక్షంలో తనకంటూ ప్రత్యేకంగా ఓ స్పేస్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేసుకుంటోంది. న్యూ తియాంగాంగ్‌ పేరుతో స్పేస్‌ స్టేషన్‌ నిర్మాణాన్ని చైనా ప్రారంభించింది. ప్రస్తుతం ఈ స్పేస్‌ స్టేషన్‌ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందుకోసం చైనా ముగ్గురు వ్యోగగాములను స్పేస్‌లోకి పంపించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది చివరికల్లా స్పేస్‌ స్టేషన్‌ను పూర్తిచేయడమే లక్ష్యంగా పనులు సాగుతున్నాయి.

ఇదిలా ఉంటే స్పేస్‌ స్టేషన్‌ నిర్మాణం ఇంకా పూర్తి అవ్వకముందే అందులో ఎలాంటి ప్రయోగాలు చేయాలన్న దిశగా చైనా అప్పుడే ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగానే ఇప్పటి వరకు ఏ దేశం చేయని ఓ పనిని చేసేందుకు చైనా శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. తాజా సమాచారం ప్రకారం స్పేస్‌ స్టేషన్‌లోకి కోతులను పంపించేందుకు చైనా తన ప్రయత్నాలను మొదలు పెట్టినట్లు సమాచారం. ఈ ప్రయోగం ద్వారా గురుత్వాకరణ శక్తిలేని చోట జీవులు ఎలా స్పందిస్తాయి, వాటిలో ఎలాంటి మార్పులు జరుగుతాయన్న విషయాన్ని తెలుసుకోవచ్చని బీజింగ్‌లోని చైనీస్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ పరిశోధకుడు జాంగ్‌ లూను తెలిపారు.

అంతరిక్షంలో గ్రావిటీ లేని చోట కోతులు తమ పునరుత్పత్తి విధానాన్ని ఎలా సాగిస్తాయన్న అంశాలను కూడా పరిశోధనలో పరిగణలోకి తీసుకోనున్నారు. కోతులు పెద్ద జంతువులు కావడం వల్ల శాస్త్రవేత్తలు వాటిని స్పేస్‌లో ఒకేచోట ఉండేలా ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాలి. అంతేకాకుండా కోతులకు అవసరమైన ఆహారాన్ని ఎలా అందించాలి.? వాటి వ్యర్థాలను ఎలా తొలగించాలన్న దానిపై పరిశోధకులు దృష్టిసారిస్తున్నారు. అయితే కోతులను ఎన్‌క్లోజర్స్‌లో స్వేచ్చగా ఉంచడం కష్టమనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే అంతరిక్షంలో చైనా నిర్మిస్తున్న ఈ స్పేస్‌ స్టేషన్‌లో ప్రస్తుతం ఇద్దరు పురుష, ఒక మహిళా వ్యోమగామి ఉన్నారు. జూన్‌లో స్పేస్‌ స్టేషన్‌కి వెళ్లిన ఈ ముగ్గురు వ్యోమగాములు స్పేస్‌ స్టేషన్‌ నిర్మాణాన్ని చేపడుతున్నారు. ఈ ఏడాది చివరి నాటికి స్పేస్‌ స్టేషన్‌ నిర్మాణం పూర్తి కానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..