భలే బామ్మ..! మనవరాలికి జన్మనిచ్చిన మహిళ.. నెట్టింట శుభాకాంక్షల వెల్లువ
అమ్మ ప్రేమ అమితమైనది.. అంతులేనిది.. అని నిరూపించింది ఈ బామ్మ.. తన కోడుకు, కోడలికి పిల్లలు పుట్టరని తెలిసి.. 56 ఏళ్ల మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. సొంత నానమ్మే.. మనవరాలికి జన్మనిచ్చింది..
అమ్మ ప్రేమ అమితమైనది.. అంతులేనిది.. అని నిరూపించింది ఈ బామ్మ.. తన కోడుకు, కోడలికి పిల్లలు పుట్టరని తెలిసి.. 56 ఏళ్ల మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. సొంత నానమ్మే.. మనవరాలికి జన్మనిచ్చింది.. ఇది విని ఎవరైనా ఆశ్చర్యపోతారు.. కానీ.. సరోగసి పుణ్యమా అని ఇలాంటి ఘటన జరిగింది. మహిళ తన కొడుకు, కోడలి బిడ్డకు సరోగసి ద్వారా జన్మనిచ్చినట్లు యూఎస్ మీడియా తెలిపింది. ఈ సంఘటన అమెరికాలోని ఉతాహ్ ప్రాంతంలో జరిగింది. తన కోడలికి గర్భాశయాన్ని తొలగించిన నేపథ్యంలో ఈ సరోగసి పద్ధతికి తానే అంగీకరించారని, ఆ దంపతులకు మరో అవకాశం లేకుండా పోయిందని బామ్మ తెలిపింది. బామ్మ చేసిన ఈ పనికి సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తడంతోపాటు.. శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
యునైటెడ్ స్టేట్స్‌లోని ఉటాహ్ ప్రాంతానికి చెందిన జెఫ్ హాక్ అనే వ్యక్తి భార్య కాంబ్రియాకు ఇటీవల గర్భాశయం తొలగించాల్సి వచ్చింది. దీంతో ఆ దంపతుల బాధను గమనించి.. జెఫ్ హాక్ తల్లి.. 56 ఏళ్ల నాన్సీ హాక్ సరోగసి ద్వారా బిడ్డను కనివ్వడనికి ఆఫర్ చేసింది. అయితే, అది సాధ్యం కాదని మొదట జెఫ్ హాక్ దంపతులు వాదించారు. అయితే, నాన్సీ, కుటుంబసభ్యులు వైద్యులను సంప్రదించడంతో.. ఇది సాధ్యమైంది.
జెఫ్ హాక్ తల్లి నాన్సీ తన మనవరాలికి జన్మనిచ్చినట్లు వైద్యులు తెలిపారు. ఆ పాప జెప్ హాక్, కాంబ్రియాల ఐదో సంతానమని వెల్లడించారు. ఇది ఒక అందమైన క్షణమని జెఫ్ హాక్ తెలిపాడు. బిడ్డకు జన్మనిచ్చిన క్రమంలో నాన్సీ హాక్ భావోద్వేగానికి గురయ్యారని.. అయితే ఆ పాపను తనతో పాటు ఇంటికి తీసుకెళ్లలేకపోయారని ద పీపుల్స్ వెల్లడించింది.
View this post on Instagram
నానమ్మ పేరుకు గుర్తుగా పాపకు హన్నా అని నామకరణం చేశారని తెలిపింది. తన తల్లి ఓరోజు అర్ధరాత్రి నిద్రలేచి తన పేరు హన్నాగా చెప్పినట్లు జెఫ్ హాక్ గుర్తు చేసుకున్నట్లు వివరించింది. డెలివరీకి ముందే, ఎలాంటి నిర్ధారణ పరీక్షలు చేయకముందే కడుపులో ఉంది పాపేనని నాన్సీ పేర్కొన్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
View this post on Instagram
ఒక మహిళ తన మనవరాలిని జన్మనివ్వడం.. గర్భాన్ని మోయడం అనేది సాధారణమైన విషయం కాదని.. నాన్సీ చరిత్రలో నిలిచారని డాక్టర్ రస్సెల్ ఫౌల్స్ పేర్కొన్నారు. అయితే, నాన్సీ ఉటా టెక్ యూనివర్శిటీలో పనిచేస్తుందని అక్కడి వైద్యులు వెల్లడించారు.
మరిన్ని ప్రపంచ వార్తల కోసం..