AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp: వాట్సప్ ఫీచర్లలో స్వల్ప మార్పులు.. వెబ్ వెర్షన్‌లో ఆ కీలక ఫీచర్ తొలగింపు..

వాట్సప్ ఫీచర్లలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఇటీవల యూజర్ల వ్యక్తిగత గోప్యత కోసం వాట్సాప్‌ కొత్త ప్రైవసీ ఫీచర్లను పరిచయం చేసింది. దీనిలో భాగంగా వ్యూ వన్స్ ఫీచర్‌ ద్వారా పంపే ఫైల్స్‌ను యూజర్లు స్క్రీన్‌ షాట్‌ తీయలేరు. కానీ, డెస్క్‌టాప్ వెర్షన్‌లో మాత్రం ప్రింట్..

WhatsApp: వాట్సప్ ఫీచర్లలో స్వల్ప మార్పులు.. వెబ్ వెర్షన్‌లో ఆ కీలక ఫీచర్ తొలగింపు..
Whatsapp New Feature
Amarnadh Daneti
|

Updated on: Nov 06, 2022 | 8:17 PM

Share

వాట్సప్ ఫీచర్లలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఇటీవల యూజర్ల వ్యక్తిగత గోప్యత కోసం వాట్సాప్‌ కొత్త ప్రైవసీ ఫీచర్లను పరిచయం చేసింది. దీనిలో భాగంగా వ్యూ వన్స్ ఫీచర్‌ ద్వారా పంపే ఫైల్స్‌ను యూజర్లు స్క్రీన్‌ షాట్‌ తీయలేరు. కానీ, డెస్క్‌టాప్ వెర్షన్‌లో మాత్రం ప్రింట్ స్క్రీన్‌ లేదా ఇతర టూల్స్‌ సాయంతో వ్యూవన్స్‌ ద్వారా ఎవరికైనా పంపినా లేదా రిసీవ్ చేసుకున్న మెసేజ్‌లను స్క్రీన్‌ షాట్ తీసుకుంటున్నట్లు వాట్సాప్‌ గుర్తించింది. దీంతో డెస్క్‌టాప్‌ వెర్షన్‌లో వ్యూ వన్స్ ఫీచర్‌ను తొలగించింది. ఇకపై డెస్క్‌టాప్‌ యూజర్లకు ఈ ఫీచర్‌ అందుబాటులో ఉండదని సంస్థ తెలిపింది. దీంతో వ్యూవన్స్ ద్వారా పంపిన మెసేజ్‌లు డెస్క్‌టాప్‌ లేదా వెబ్‌ వెర్షన్‌ వాట్సాప్‌లో కనిపించవు. మొబైల్ యాప్‌లో మాత్రమే వీటిని చూసే అవకాశం ఉంటుంది. వాట్సాప్‌ ఎడిట్ మెసేజ్‌ ఫీచర్‌ను ఐఓఎస్ బీటా యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది.ఐఫోన్‌ యూజర్లు వాట్సాప్‌ ఐఓఎస్ 22.23.0.73 వెర్షన్‌ను అప్‌డేట్ చేసుకొని ఈ ఫీచర్‌ను పరీక్షించవచ్చు.

ఎడిట్ మెసేజ్‌ ఫీచర్‌ కావాలంటూ చాలా కాలంగా యూజర్లు వాట్సాప్‌ను డిమాండ్‌ చేస్తున్నారు. గత నెలలో మెసేజ్‌ ఎడిట్‌ ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు వాట్సాప్ వెల్లడించింది. ఎడిట్‌ చేసిన మెసేజ్‌ పక్కనే ఎడిటెడ్ అనే లేబుల్ కనిపిస్తుంది. మెసేజ్‌ ఎడిట్‌కు టైమ్‌ లిమిట్ కూడా ఉంటుంది.

కొద్దిరోజుల క్రితం వాట్సాప్‌ పలు కొత్త ఫీచర్లను యూజర్లకు పరిచయం చేసింది. వీటిలో 32 మంది ఒకేసారి వాయిస్‌, వీడియో కాల్స్‌, 2 జీబీ ఫైల్ షేరింగ్‌, ఇన్‌-చాట్ పోల్‌తోపాటు గ్రూపులో 1024 మందిని సభ్యులుగా చేర్చుకునేందుకు వీలు కల్పించింది. ఇటీవల కాలంలో వాట్సప్ తన వినియోగదారుల కోసం అనేక రకాల ఫీచర్లను అందుబాటులోకి తెస్తూ వస్తోంది. మరోవైపు వినియోగదారుల భద్రతకు తగిన ప్రాధాన్యం ఇస్తామని సంస్థ ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం చూడండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్