Sleep deprivation: నిద్ర లేమితో బాధపడుతున్నారా.. ఇలా చేస్తే ప్రశాంతంగా నిద్ర పోవచ్చు..

ఏ పని చేసినా సమ మోతాదులో చేయాలి. ముఖ్యంగా నిద్ర విషయంలో తప్పనిసరిగా సమతుల్యత పాటించాలి. ఎక్కువ సేపు నిద్రపోయినా, తగినంత సేపు నిద్రపోకపోయినా అనేక ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశాలున్నాయి. రోజుకు కనీసం 8 గంటలు నిద్రపోవాలని వైద్య నిపుణులు..

Sleep deprivation: నిద్ర లేమితో బాధపడుతున్నారా.. ఇలా చేస్తే ప్రశాంతంగా నిద్ర పోవచ్చు..
Lack Of Sleep
Follow us
Amarnadh Daneti

|

Updated on: Nov 05, 2022 | 7:58 PM

ఏ పని చేసినా సమ మోతాదులో చేయాలి. ముఖ్యంగా నిద్ర విషయంలో తప్పనిసరిగా సమతుల్యత పాటించాలి. ఎక్కువ సేపు నిద్రపోయినా, తగినంత సేపు నిద్రపోకపోయినా అనేక ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశాలున్నాయి. రోజుకు కనీసం 8 గంటలు నిద్రపోవాలని వైద్య నిపుణులు సూచిస్తారు. ఇంట్లో ఎక్కువ సేపు నిద్రపోతే బద్ధకం పెరిగి ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతుంటారు. కాని కనీస సమయం పడుకోకపోయినా ఇబ్బందే అంటున్నారు వైద్య ఆరోగ్య నిపుణులు. నిద్ర తక్కువైనా ఎన్నో రోగాలు వస్తాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. నిద్ర లేమి కారణంగా ఏకాగ్రత లోపించడంతో పాటు అనేక ఆరోగ్య సమస్యలతో ఇది ముడిపడి ఉంటుందట. అయితే తాజా అధ్యయనం ప్రకారం తగినంత నిద్ర లేకపోవడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఉందని తేలింది. మరి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా కనీస సమయం నిద్రపోవాలంటే మన లైఫ్ స్టైల్ లో కొన్ని మార్పులు అవసరమంటున్నారు వైద్య నిపుణులు.. అవెంటో తెలుసుకుందాం.

రోజులో కనీసం 7 నుంచి 9 గంటలు నిద్రపోవచ్చు. అయితే ఒక గంట అటు ఇటు పర్వాలేదు కాని.. బాగా తక్కువ సమయం పడుకుంటే మధుమేహం వచ్చే ప్రమాదం ఉందని ఓ తాజా అధ్యయనం వెల్లడించింది. నిద్ర లేమి శరీరంలో జీవక్రియ మార్పులకు దారితీస్తుందని, ఫలితంగా గ్లూకోజ్ స్థాయిలను పెంచుతుందని తేలింది. దీని వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఉందని ఈఅధ్యయనం తెలిపింది.

నిద్రకు తగిన సమయం కేటాయించాలి

ఒక రోజులో ఎంత సేపు పడుకోవాలో షెడ్యూల్ చేసుకోవాలి. మనం మేల్కొనే సమయం కూడా నిర్ణయించుకోవాలి. నిద్ర రావడంలేదంటూ కొన్ని సార్లు పడుకోము. అలాకాకుండా మనం నిర్ణయించుకున్న సమయానికి పడుకోవాలి అలా కొద్ది రోజులు ప్రయత్నిస్తే ఆటైంకి పడుకోవడం అలవాటు అయిపోతుంది.

ఇవి కూడా చదవండి

ప్రశాంత వాతావరణం

నిద్రపోయేటప్పుడు ఎంత హాయిగా ఉంటున్నారనేది చూసుకోవాలి. సౌకర్యవంతమైన పరుపులు, దిండ్లు ఎంచుకోవాలి. గది ఉష్ణోగ్రత సమానంగా ఉండేలా చూసుకోవాలి. అవసరమైతే పడుకునే ముందు కొద్ది సేపు మంచి మెలోడీ సాంగ్స్ వినడం మంచిది.

కాఫీ, టీలు తాగడం తగ్గించాలి

నిద్రలేమితో బాధపడుతున్నవారు కాఫీ, టీలు తాగడం తగ్గించాలి. ఇలా చేస్తే నిద్ర నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

ఒత్తిడిని తగ్గించుకోవాలి

వ్యక్తిగత లేదా పని సంబంధిత ఒత్తిడికి గురవడం నిద్రలేమికి కారణం కావచ్చు. మానసిక ఆరోగ్య నిపుణుడిని సంప్రదించడం వలన మీరు మీ మనస్సుపై ఒత్తిడి లేకుండా చూసుకోవచ్చు. నిద్రకు ముందు ఒత్తిడి లేకుండా ఎలా తగ్గించుకోవచ్చో పలు సూచనలు చేస్తారు. వైద్యులు సూచనల ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..

పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!