Crop Loans: రైతుల కోసం ప్రత్యేక పథకం.. ఎటువంటి హామీ లేకుండానే రూ.50 వేల రుణం ఇస్తున్న ఆ బ్యాంకు..

కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు బ్యాంకుల ద్వారా రుణాలివ్వడాన్ని సులభతరం చేసింది. కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశాల మేరకు బ్యాంకులు వారి పరిధిలో క్రమం తప్పకుండా తీసుకున్న రుణం చెల్లించే రైతులకు ఎటువంటి హామీ లేకుండా..

Crop Loans: రైతుల కోసం ప్రత్యేక పథకం.. ఎటువంటి హామీ లేకుండానే రూ.50 వేల రుణం ఇస్తున్న ఆ బ్యాంకు..
Crop Loans
Follow us
Amarnadh Daneti

|

Updated on: Nov 05, 2022 | 9:07 PM

కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు బ్యాంకుల ద్వారా రుణాలివ్వడాన్ని సులభతరం చేసింది. కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశాల మేరకు బ్యాంకులు వారి పరిధిలో క్రమం తప్పకుండా తీసుకున్న రుణం చెల్లించే రైతులకు ఎటువంటి హామీ లేకుండా రుణాలిచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. గతంలో రైతులు రుణం పొందాలంటే ఎన్నో నిబంధనలు ఉండేవి. బంగారం తాకట్టుపెట్టి అగ్రికల్చర్ లోన్లు తీసుకోవల్సి వచ్చేది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని.. వారికి రుణాల మంజూరు సులభతరం చేశారు. తాజాగా పంజాబ్ నేషనల్ బ్యాంకు రైతులకు తీపి కబురు అందించింది. అన్నదాతలు సులభంగానే రుణం పొందే వెసులుబాటు కల్పించింది. పీఎన్‌బీ కిసాన్ తత్కాల్ లోన్ యోజన కింద పంజాబ్ నేషనల్ బ్యాంకు తీసుకొచ్చిన ఈ స్కీమ్ లో రైతులు వెంటనే రూ. 50 వేల వరకు లోన్ పొందవచ్చు. లాంటి తనఖా లేకుండానే ఈ తరహా రుణాలు సులభంగా పొందొచ్చు అన్నదాతలు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ అందిస్తున్న ఈ పథకం కింద రైతన్నలకు రుణ మొత్తం నేరుగా బ్యాంక్ ఖాతాల్లోనే జమ చేస్తుంది. రైతులు వారి ఆర్థిక అవసరాల కోసం బ్యాంక్ నుంచి లోన్ పొందొచ్చని, కిసాన్ తత్కాల్ లోన్ స్కీమ్ అందుబాటులో ఉందని బ్యాంకు అధికారులు తెలిపారు. గరిష్టంగా రూ.50 వేల వరకు రుణం పొందొచ్చని బ్యాంకు తెలిపింది. ఎలాంటి గ్యారంటీ అవసరం లేదని, కనీస డాక్యుమెంట్ల ద్వారా రుణం పొందొచ్చని పేర్కొంది.

రైతులు ఏ అవసరానికి అయినా సరే బ్యాంక్ నుంచి పీఎన్‌బీ కిసాన్ తత్కాల్ రిన్ యోజన కింద లోన్ తీసుకోవచ్చని పంజాబ్ నేషనల్ బ్యాంకు తెలిపింది. ఈ స్కీమ్ కింద లోన్ పొందాలని భావించే రైతులు వ్యవయసాయ భూమి కలిగి ఉండాలి. కౌలు రైతులు కూడా ఈ రుణాలకు అర్హులే. రైతులు లేదా గ్రూపులుగా ఏర్పడిన రైతులు మాత్రమే ఈ రుణం తీసుకునే అవకాశం ఉంటుంది.

కిసాన్ క్రెడిట్ కార్డు కలిగిన రైతులు కూడా బ్యాంక్ నుంచి ఈ స్కీమ్ కింద రుణం పొందొచ్చు. అయితే రైతులు గత రెండేళ్లుగా బ్యాంకులో తీసుకున్న రుణాన్ని సక్రమంగా చెల్లిస్తూ ఉండి ఉండాలి. ప్రస్తుత రుణ పరిమితిలో 25 శాతం వరకు లేదా గరిష్టంగా రూ. 50 వేల వరకు రుణం పొందొచ్చు. తీసుకున్న రుణాన్ని ఐదేళ్లలోగా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అర్హత కలిగిన రైతులు సమీపంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి పీఎన్‌బీ కిసాన్ తత్కాల్ లోన్ స్కీమ్ పూర్తి వివరాలు తెలుసుకొని రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..