Post Office: ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ పని కోసం పోస్టాఫీసు వెళ్లక్కర్లేదు.!
పోస్టాఫీసు తన సేవింగ్స్ బ్యాంక్ స్కీమ్ కోసం కస్టమర్లకు ఈ-పాస్‌బుక్ సౌకర్యాన్ని అందిస్తోంది. ఖాతాదారులు ఈ సదుపాయాన్ని..
మీకు పోస్టాఫీసులో ఖాతా ఉందా.? అందులో ఉన్న స్కీంల ద్వారా మీరు ప్రయోజనం పొందినట్లైతే..? ఈ విషయాలు మీకోసమే. పోస్టాఫీసు తన సేవింగ్స్ బ్యాంక్ స్కీమ్ కోసం కస్టమర్లకు ఈ-పాస్‌బుక్ సౌకర్యాన్ని అందిస్తోంది. ఖాతాదారులు ఈ సదుపాయాన్ని ఆన్‌లైన్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు. ఈ-పాస్‌బుక్ సదుపాయం ద్వారా ఖాతాదారులు తమకు నచ్చిన కాలానికి సంబంధించిన లావాదేవీల స్టేట్‌మెంట్‌ను తనిఖీ చేసుకోవచ్చు.
ఇకపై పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతాదారుడు.. తమ ఖాతాలను ఆన్ లైన్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. దగ్గరలోని సంబంధిత పోస్టాఫీస్ బ్రాంచ్ కు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇండియా పోస్ట్ కస్టమర్లు ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా తమ ఖాతాను యాక్సెస్ చేయవచ్చు. అయితే, పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతాను ఆన్‌లైన్‌లో యాక్సెస్ చేయడానికి మీరు తప్పనిసరిగా రిజిస్టర్డ్ నెట్ బ్యాంకింగ్ లేదా మొబైల్ బ్యాంకింగ్ కలిగి ఉండాలి.
ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి..
- మొదటిగా పోస్టాఫీసు యాప్‌లోకి లాగిన్ అవ్వండి.
- ఆ తర్వాత మొబైల్ బ్యాంకింగ్‌కి వెళ్లండి.
- మీ ఖాతాకు సంబంధించిన వివరాలను పూర్తి చేయండి.
- ‘గో’ బటన్‌పై క్లిక్ చేయండి.
- అనంతరం పోస్ట్ ఆఫీస్ ఖాతా డ్యాష్‌బోర్డ్‌కి వెళ్లారు.
- ఇక్కడ మీరు బ్యాలెన్స్, స్టేట్‌మెంట్‌ను తనిఖీ చేసే అవకాశం ఉంది.
- మీరు మినీ స్టేట్‌మెంట్ కూడా పొందొచ్చు.
- కస్టమర్‌లు ఎలాంటి సమస్య ఎదురైనా.. కస్టమర్ కేర్ నంబర్‌కు కాల్ చేయవచ్చు. టోల్ ఫ్రీ నెంబర్ 1800-425-2440కి సంప్రదించండి.
- పైన పేర్కొన్న నెంబర్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.
- dopebanking@indiapost.gov.inకి కూడా ఫిర్యాదును మెయిల్ చేయవచ్చు.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం..