Loans: కస్టమర్లకు బిగ్‌ అలర్ట్‌.. రుణాల విషయంలో బ్యాంకులు అలా చేస్తే.. ఇక అంతే!

తమ కస్టమర్‌లను ఆకర్షించేందుకు బ్యాంకులు వివిధ రకాల ఆఫర్‌లను అందిస్తుంటాయి. రుణం అనేది ఎవరికైనా పెద్ద ఆర్ధిక బాధ్యత అని చెప్పొచ్చు.

Loans: కస్టమర్లకు బిగ్‌ అలర్ట్‌.. రుణాల విషయంలో బ్యాంకులు అలా చేస్తే.. ఇక అంతే!
Loans
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 05, 2022 | 7:38 PM

కారు లేదా బైక్‌ కొనుగోలు, పిల్లల చదువు, పెళ్లి కోసం రుణం, లేదా వ్యాపారం, గృహ నిర్మాణం కోసం లోన్‌ వంటి పలు అవసరాల కోసం ప్రజలు తరచుగా బ్యాంక్‌ నుంచి రుణం తీసుకుంటుంటారు. ఇక తమ కస్టమర్‌లను ఆకర్షించేందుకు బ్యాంకులు వివిధ రకాల ఆఫర్‌లను అందిస్తుంటాయి. రుణం అనేది ఎవరికైనా పెద్ద ఆర్ధిక బాధ్యత అని చెప్పొచ్చు. ప్రతి నెలా సకాలంలో లోన్ EMI చెల్లించాలి. రుణం తీసుకున్న తర్వాత నిర్ణీత తేదీలోగా కస్టమర్ రుణ వాయిదాలను తిరిగి ఇవ్వకపోతే, బ్యాంకులు కస్టమర్లకు కాల్‌లు, సందేశాలు పంపించి ఇబ్బంది పెడుతుంటారు. అంతేకాదు కొన్నిసార్లు బ్యాంకులు డబ్బు తిరిగి చెల్లించేందుకు కస్టమర్ల దగ్గరకు రికవరీ ఏజెంట్లను కూడా పంపిస్తుంటారు. వారి బెదిరింపులకు సంబంధించిన ఘటనలు కూడా మనం చూస్తూనే ఉంటాం. మీకు కూడా ఇలాంటివి జరుగుతుంటే, RBI ఈ విషయంలో కొన్ని నియమాలను రూపొందించింది. రుణం చెల్లించని పక్షంలో బ్యాంకు ఖాతాదారులను బెదిరిస్తే, ఆ కస్టమర్ పోలీసులకు ఫిర్యాదు చేసి.. సదరు బ్యాంక్ నుంచి పెనాల్టీ తీసుకోవచ్చు.

ఇలా చేస్తే పోలిసులకు ఫిర్యాదు చేయవచ్చు..

ఏ ఖాతాదారుడికైనా రుణం రూపంలో ఇచ్చిన డబ్బును తిరిగి పొందే హక్కు బ్యాంకులకు ఉంది, అయితే దీని కోసం వారు RBI రూపొందించిన కొన్ని నియమాలను తప్పక పాటించాలి. బ్యాంక్ అధికారి లేదా రికవరీ ఏజెంట్ డిఫాల్టర్‌కు ఉదయం 7 నుండి సాయంత్రం 7 గంటల మధ్య మాత్రమే కాల్ చేయవచ్చు. దీంతో పాటు ఆయన ఇంటికి వెళ్లే సమయం కూడా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటలుగా నిర్దేశించారు. ఒకవేళ ఈ సమయాన్ని మించి.. బ్యాంక్ ప్రతినిధి ఎవ్వరైనా కూడా మీ ఇంటికి వచ్చినట్లైతే.. మీరు పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు.

తప్పుగా ప్రవర్తించే హక్కు ఎవరికీ లేదు..

ఒక కస్టమర్ 90 రోజులలోపు వాయిదా డబ్బును డిపాజిట్ చేయకపోతే, బ్యాంకు అతనికి నోటీసు జారీ చేస్తుంది. ఆ తర్వాత, డబ్బు డిపాజిట్ చేయడానికి మళ్లీ 60 రోజులు గడువు ఇస్తుంది. అప్పటికీ ఆ వ్యక్తి డబ్బును డిపాజిట్ చేయకపోతే.. బ్యాంకు అతడు తనఖా పెట్టిన ఆస్తిని అంటే ఇల్లు, లేదా కారును విక్రయించడం ద్వారా డబ్బును తిరిగి పొందవచ్చు. మీరు బ్యాంకు నుండి రుణం తీసుకుని, దాన్ని తిరిగి చెల్లించలేకపోతే, దాని రికవరీ కోసం బ్యాంక్ మిమ్మల్ని సంప్రదించవచ్చు, కానీ ఏ బ్యాంకు అధికారికి లేదా రికవరీ ఏజెంట్‌కు ఏ కస్టమర్‌తోనూ అనుచితంగా ప్రవర్తించే హక్కు లేదు. ఎవరైనా మిమ్మల్ని మానసికంగా లేదా శారీరకంగా వేధిస్తే బ్యాంకుకు ఫిర్యాదు చేయవచ్చు.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!