MBBS Students: చైనాలో MBBS చదువుతున్న ఇండియన్ స్టూడెంట్స్ కు హెచ్చరిక.. వారు మాత్రమే మనదేశంలో మెడికల్ లైసెన్స్ పొందే అవకాశం
ఇప్పుడు చైనాలో మెడిసిన్ చదవడానికి వెళ్లిన విద్యార్థుల ప్రశ్నలన్నింటికీ బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయం సమాధానం ఇచ్చింది. భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నవంబర్ 18, 2021 న NMC జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌ను చూడాలని సూచించింది.
భారతీయ విద్యార్థులకు మెడిసిన్ చదవం అంటే మంచి క్రేజ్ ఉంది. దీంతో ప్రతి సంవత్సరం భారీ సంఖ్యలో విద్యార్థులు విదేశాల్లో వైద్య విద్యనభ్యసించడానికి వెళ్తూ ఉంటారు. చైనాకు కూడా భారీ సంఖ్యలో మెడిసిన్ చదివే భారతీయ విద్యార్థులున్నారు. అయితే చైనా సహా ప్రపంచంలోని వివిధ దేశాల నుండి వైద్య విద్యను అభ్యసించే విద్యార్థులు భారతదేశంలో ప్రాక్టీస్ చేయాలంటే.. ఓ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్ష తర్వాత మాత్రమే వారు భారతదేశంలో మెడికల్ ప్రాక్టీస్ చేయడానికి లైసెన్స్ పొందుతారు. అయితే.. చైనాలో MBBS చేసిన వైద్య విద్యార్థులకు భారతదేశంలోని నిర్వహిస్తున్న పరీక్షపై ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా స్వదేశంలో మెడికల్ ప్రాక్టీస్ లైసెన్స్ పొందడానికి తాము ఏ అర్హత ప్రమాణాలను పూర్తి చేయాలని చైనా లో మెడిసిన్ పూర్తి చేసిన విద్యార్థులు ఆలోచిస్తున్నారు. చైనాలో క్లినికల్ మెడికల్ ప్రోగ్రామ్‌లను అభ్యసించే విద్యార్థులకు అర్హత ప్రమాణాలకు సంబంధించి ఎంబసీని భారతీయ విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రుల నుండి నిరంతరం ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు.
అదే సమయంలో, ఇప్పుడు చైనాలో మెడిసిన్ చదవడానికి వెళ్లిన విద్యార్థుల ప్రశ్నలన్నింటికీ బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయం సమాధానం ఇచ్చింది. నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) నిర్వహించే పరీక్షలో హాజరు కావడానికి అర్హత ప్రమాణాలు ఏమిటని రాయబార కార్యాలయాన్ని అడుగుతున్నారని తెలిపింది.
భారత రాయబార కార్యాలయం సమాధానం ఏమిటంటే? “దీనికి సంబంధించి, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నవంబర్ 18, 2021 న NMC జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌ను చూడాలని సూచించింది. భారత రాయబార కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో, “విదేశీ వైద్య విద్యార్థులు సంబంధిత ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీలో నమోదు చేసుకోవాలని NMC క్లాజ్ 4 (బి) స్పష్టంగా పేర్కొంది.” వాస్తవానికి, విదేశాల నుండి వచ్చే వైద్యులు భారతదేశంలో వైద్యులుగా ప్రాక్టీస్ చేయాలంటే.. FMGE పరీక్షను క్లియర్ చేయాలి.
అంతేకాదు ‘విద్యార్థులకు చదువు తర్వాత మెడికల్ డిగ్రీ ఎక్కడ ఇవ్వబడింది. స్టూడెంట్స్ డాక్టర్స్ గా ప్రాక్టీస్ చేయడం కోసం ఎక్కడ లైసెన్స్ పొందాలి.. అంతేకాదు ఈ మెడికల్ లైసెన్స్ .. భారత దేశంలో మెడికల్ విద్యార్థులకు ఇచ్చిన లైసెన్స్‌తో సమానంగా ఉండాలని భావిస్తున్నారు
Embassy continues to receive queries regarding eligibility for Indian students pursuing clinical medicine program in China to appear in qualifying exam conducted by NMC of India. Students requested to see Gazette Notification dated Nov 18, 2021 by NMC: Embassy of India in Beijing pic.twitter.com/wGqbRkJxXk
— ANI (@ANI) November 7, 2022
భారత దేశం నుంచి మెడిసిన్ చదవడానికి చైనాకు వచ్చే భారతీయ విద్యార్థులను విద్యావంతులుగా, మంచి వైద్య శిక్షణ పొంది.. వైద్యులుగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని… తద్వారా.. మెడిసిన్ స్టూడెంట్స్ NMC అన్ని అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూస్తున్నామని సంబంధిత చైనా అధికారులు చెప్పారు.. ఈ మేరకు భారత రాయబార కార్యాలయం.. వైద్య కళాశాలలను కోరింది. అయితే నవంబర్ 2021 తర్వాత.. చైనాలోని క్లినికల్ మెడిసిన్ ప్రోగ్రామ్‌లో చేరిన విద్యార్థులు.. చైనాలో మెడికల్ డాక్టర్ ప్రాక్టీస్ చేయడానికి లైసెన్స్ పొందడంలో విఫలమైన విద్యార్థులు ‘ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్’ (FMGE) పరీక్షకు హాజరు కావడానికి అనుమతించబడరని పేర్కొంది.
మెడికల్ లైసెన్స్ లేకుండా విద్యార్థులు చైనాలో పని చేయవచ్చా?
చైనాలో మెడిసిన్ చదువుతూ.. మెడిసిన్ ప్రాక్టీస్ లైసెన్స్ పొందిన తర్వాత విద్యార్థులు చైనీస్ ఆసుపత్రులలో అసిస్టెంట్ డాక్టర్లుగా పనిచేయవచ్చా అనే ప్రశ్నను కూడా విద్యార్థులు అడిగారు. ఇలా తమకు ఆ దేశంలోని ఆస్పత్రిలో పనిచేసే అవకాశం ఉంటే తమ ఖర్చులను , చదువుకోసం తీసుకున్న అప్పును తీర్చుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు స్టూడెంట్స్.
ఇదే విషయంపై భారత రాయబార కార్యాలయం స్పందిస్తూ.. స్టూడెంట్స్ కు అలాంటి అవకాశం ఉందా లేదా అనే విషయంపై సంబంధిత చైనా అధికారులతో చర్చిస్తున్నట్లు తెలిపింది. వారి నుంచి సమాధానం వచ్చిన వెంటనే స్టూడెంట్స్ కు చెబుతమని స్పష్టం చేసిని భారత రాయబార సంస్థ అధికారులు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..