Parrot Video: చోరీలపై జర్నలిస్ట్ రిపోర్టింగ్.. లైవ్ లోనే ఇయర్ బడ్ ఎత్తుకెళ్లిన కొంటె చిలుక

. టీవీలో వరుస దొంగతనాలపై వివరాలు చెబుతుంటే టీవీలో ప్రత్యక్ష ప్రసారం జరుగుతోంది. ఇంతలో ఓ రామచిలుక ఎగురుకుంటూ వచ్చి ఆ రిపోర్టర్‌ భుజంపై వాలింది. అయినా అతను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతున్నాడు.

Parrot Video: చోరీలపై జర్నలిస్ట్ రిపోర్టింగ్.. లైవ్ లోనే ఇయర్ బడ్ ఎత్తుకెళ్లిన కొంటె చిలుక
Parrot Steals Chilean Reporter's Earphone
Follow us
Surya Kala

|

Updated on: Nov 06, 2022 | 4:32 PM

ఓ ఫీల్డ్‌ జర్నిలిస్ట్‌ దొంగతనాలపై లైవ్‌ రిపోర్టింగ్‌ చేస్తున్నాడు. ఈ క్రమంలో అతని ఇయర్‌ ఫోన్‌ కొట్టేసారు.. ఇలా మనిషి కొట్టేస్తే.. అది వార్త అయ్యేదేమో.. కానీ ఓ పక్షి అతని చెవి నుంచి ఇయర్ ఫోన్స్ కొట్టేయడం విచిత్ర సంఘటనగా నిలిచింది. ఈ ఘటన చిలీలో చోటుచేసుకుంది. దేశంలో పెరిగిపోతున్న దొంగతనాలపై చిలీ జర్నలిస్ట్ నికోలస్ క్రమ్ లైవ్ రిపోర్ట్ ఇస్తున్నాడు. టీవీలో వరుస దొంగతనాలపై వివరాలు చెబుతుంటే టీవీలో ప్రత్యక్ష ప్రసారం జరుగుతోంది. ఇంతలో ఓ రామచిలుక ఎగురుకుంటూ వచ్చి ఆ రిపోర్టర్‌ భుజంపై వాలింది. అయినా అతను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతున్నాడు. చిలుక చూసి చూసి ఆయన చెవిలో ఉన్న ఇయర్ బడ్ ను నోట కరుచుకుని ఎగిరిపోయింది.

కాస్త ఆలస్యంగా ప్రతిస్పందించిన రిపోర్టర్‌.. తన ఇయర్ బడ్ ను తిరిగి పొందడం కోసం చిలుకను పట్టుకుందామని ప్రయత్నించినా దొరకలేదు. కొంత దూరంలో చిలుక ఇయర్‌ బడ్‌ను పడేసింది. తర్వాత అక్కడికి దగ్గర్లోనే ఇయర్ బడ్ దొరికిందని ఆయన చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాధితుల కష్టాలు చెబుతూ పాపం తను కూడా బాధితుడయ్యాడంటూ ఆ రిపోర్టర్ కు సానుభూతిగా నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఇయర్ బడ్స్ కొట్టేసిన రామ చిలుక 

వీడియో స్పానిష్‌లో ఉన్నప్పటికీ..  ఇది ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రధాన సోషల్ మీడియా నెట్‌వర్క్‌లలో విస్తృతంగా షేర్ అవుతూ సందడి చేస్తోంది. అంతేకాదు నెటిజన్లు పూర్తిగా ఈ వీడియోను పూర్తిగా ఆస్వాదిస్తున్నారు. ఫన్నీ కామెంట్స్ ను పోస్ట్ చేస్తున్నారు. న్యూస్ యాంకర్‌ను హాలీవుడ్ స్టార్ ర్యాన్ గోస్లింగ్‌తో పోలుస్తూ… “చిలీ ర్యాన్ గోస్లింగ్ తన ఎయిర్ పాడ్‌ను కోల్పోయాడు పాపం అని కామెంట్ చేశాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..