Girl Video: ఈ అమ్మాయి సెల్ఫీ పిచ్చి మాములుగా లేదుగా.. సింహంతో సెల్ఫీ .. నెక్స్ట్ ఏమి జరిగిందంటే..

జంతుప్రదర్శనశాలల్లో జంతువులకు అతి దగ్గరగా వెళ్లి సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నిస్తూ ప్రమాదాల బారిన పడిన వీడియోలను మీరు సోషల్ మీడియాలో చాలానే చూసి ఉంటారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఒక యువతి సింహంతో సెల్ఫీ తీసుకోవానికి ప్రయత్నిస్తోంది.

Girl Video: ఈ అమ్మాయి సెల్ఫీ పిచ్చి మాములుగా లేదుగా.. సింహంతో సెల్ఫీ .. నెక్స్ట్ ఏమి జరిగిందంటే..
Girl Selfie Video Viral
Follow us
Surya Kala

|

Updated on: Nov 07, 2022 | 7:06 PM

ప్రతి ఒక్కరికీ సోషల్ మీడియా ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత పాపులర్ కావాలనే పిచ్చి అధికమయ్యింది. అంతేకాదు..  యువతలో సెల్ఫీ క్రేజ్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది. సెల్ఫీ తీసుకోవడం కోసం.. ప్రాణాలను సైతం లెక్కచేయడం లేదు.. అనేక మంది ప్రమాదకమైన ప్లేసెస్ లో సెల్ఫీ తీసుకోవాలని చేసే సాహసంతో ప్రాణాలను సైతం పోగొట్టుకుంటున్నారు. అంతగా యువతలో సెల్ఫీ పిచ్చి పెరిగిపోయిందన్న సంగతి అందరికీ తెలిసిందే. జంతుప్రదర్శనశాలల్లో జంతువులకు అతి దగ్గరగా వెళ్లి సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నిస్తూ ప్రమాదాల బారిన పడిన వీడియోలను మీరు సోషల్ మీడియాలో చాలానే చూసి ఉంటారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఒక యువతి సింహంతో సెల్ఫీ తీసుకోవానికి ప్రయత్నిస్తోంది.  బోనులో ఉన్న సింహం దగ్గరకు వెళ్లి.. వెలుపల నుంచి ఒక అమ్మాయి సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించిన వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక యువతి జూకి వెళ్ళింది. అక్కడ మృగరాజు సింహంతో సెల్ఫీలు దిగడం ప్రారంభించింది. ఇలా సెల్ఫీ తీసుకుంటూ.. సింహానికి దొరికితే తన న జీవితం ఏమవుతుందో అన్న  ఆలోచన ఆ యువతికి కలుగలేనట్లుంది. సింహం, ఎలుగుబంటి బోను సమీపంలోనే ఉన్నట్లు ఈ  వీడియోలో కనిపిస్తుంది. బోను బయట కూర్చున్న ఆ యువతి సింహంతో సెల్ఫీలు తీసుకోవడం ప్రారంభించింది. అప్పుడు ఎలుగుబంటి తన పంజా తీసి ఆ అమ్మాయి టీ షర్టును పట్టుకుంది. దీంతో ఆ యువతి భయంతో అరవడం ప్రారంభించింది. అదృష్టవశాత్తూ, మరొక వ్యక్తి అక్కడ ఉన్నాడు. అతను వెంటనే ఎలుగుబంటి బారి నుండి బాలికను రక్షించాడు. లేకుంటే ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగి ఉండేది.

ఇవి కూడా చదవండి

ఇక్కడ వీడియో చూడండి

ఈ వీడియో ట్విట్టర్‌లో _hasret_kokulum_ అనే ఖాతాతో షేర్ చేశారు. ఇప్పటి వరకూ 40 వేల మంది లైక్ చేశారు. ‘జీవితం అమూల్యమైనది. ఇలాంటి మూర్ఖ పనులతో జీవితాన్ని కోల్పోకూడదని ఒకరు అంటే.. అదే సమయంలో, మరొకరు వ్యాఖ్యానిస్తూ ఎలుగుబంటి కూడా నేను మిమ్మల్ని సెల్ఫీ కోసం తీసుకెళతాను అని చెబుతుందని ఫన్నీగా కామెంట్ చేశారు. ఇది పూర్తిగా మూర్ఖత్వం. సెల్ఫీలు తీసుకునే పిచ్చిలో జనం అంధులవుతున్నారు. మొత్తంమీద, ఈ వీడియోపై కొంతమంది ఆ యువతి చర్చ తప్పు అని అంటూ కామెంట్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వైరల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..