AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MG Windsor EVకి పోటీగా టాటా ఎలక్ట్రిక్​ SUV.. రేంజ్​, ఫీచర్లతోనే అదరగొట్టేస్తోందిగా

భారత ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో పోటీ రోజురోజుకూ పెరుగుతోంది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా కార్ల తయారీ సంస్థలు కొత్త మోడళ్లను తీసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో టాటా మోటార్స్ మరో సరికొత్త ఎలక్ట్రిక్ SUVని అభివృద్ధి చేస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు ‘Kuno’ అనే కోడ్‌నేమ్‌ను కేటాయించారు. MG Windsor EVకి పోటీగా తీసుకురానున్న ఈ మిడ్‌సైజ్ ఎలక్ట్రిక్ SUVని 2027-28 ఆర్థిక సంవత్సరంలో మార్కెట్లోకి ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

MG Windsor EVకి పోటీగా టాటా ఎలక్ట్రిక్​ SUV.. రేంజ్​, ఫీచర్లతోనే అదరగొట్టేస్తోందిగా
Tata Kuno Electric Suv
Nikhil
|

Updated on: Nov 02, 2026 | 6:00 AM

Share

కుటుంబ అవసరాలకు సరిపోయే విశాలమైన క్యాబిన్, మెరుగైన బ్యాటరీ సామర్థ్యం, ఆకర్షణీయమైన రేంజ్‌తో ఈ కొత్త SUVని రూపొందించే అవకాశం ఉంది. అయితే Kuno అనేది ప్రస్తుతానికి ప్రాజెక్టు కోడ్‌నేమ్ మాత్రమే. మార్కెట్లోకి విడుదలయ్యే సమయంలో ఇదే పేరును కొనసాగిస్తారా లేదా అన్నది ఇంకా స్పష్టత లేదు. సుమారు 4.3 మీటర్ల పొడవుతో రానున్న ఈ కారు టాటా EV లైనప్‌లో Nexon EV కంటే పైన, Sierra EV కంటే దిగువన స్థానం సంపాదించనుంది. ఈ కారు ప్లాట్‌ఫామ్, తయారీ, బ్యాటరీ, ధరకు సంబంధించిన వివరాలు ఆసక్తిని పెంచుతున్నాయి.

విశాలమైన క్యాబిన్

టాటా Kuno ఎలక్ట్రిక్ SUVని కంపెనీకి చెందిన ప్రత్యేక Acti.ev ప్లాట్‌ఫామ్‌పై అభివృద్ధి చేసే అవకాశం ఉంది. ఈ ప్లాట్‌ఫామ్ ఫ్రంట్ వీల్ డ్రైవ్ (FWD), రియర్ వీల్ డ్రైవ్ (RWD), ఆల్ వీల్ డ్రైవ్ (AWD) వంటి విభిన్న పవర్‌ట్రెయిన్ లేఅవుట్లకు మద్దతు ఇస్తుంది. ఇందులో ఫ్లాట్ ఫ్లోర్, బ్యాటరీ కోసం ప్రత్యేకంగా రూపొందించిన స్థలం ఉండటంతో క్యాబిన్‌లో ఎక్కువ స్థలాన్ని అందించవచ్చు. దీంతో కుటుంబ ప్రయాణాలకు అనువైన ఇంటీరియర్‌ను రూపొందించే అవకాశం ఉంది.

తయారీ విషయానికి వస్తే ఈ SUVని గుజరాత్‌లోని టాటా మోటార్స్ సనంద్ ప్లాంట్‌లో ఉత్పత్తి చేయవచ్చని సమాచారం. ఏడాదికి 80,000 నుంచి లక్ష యూనిట్ల వరకు తయారీ సామర్థ్యాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై కంపెనీ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. 2031 ఆర్థిక సంవత్సరం నాటికి తన ఎలక్ట్రిక్ వాహనాల లైనప్‌ను ఆరు మోడళ్ల నుంచి 10 మోడళ్లకు విస్తరించాలని టాటా లక్ష్యంగా పెట్టుకుంది.

బ్యాటరీ రేంజ్

Kuno బ్యాటరీ సామర్థ్యం, మోటార్ పవర్, డ్రైవింగ్ రేంజ్ వివరాలను టాటా ఇంకా వెల్లడించలేదు. అయితే Curvv EV, Sierra EV మోడళ్లలో ఉపయోగించిన బ్యాటరీ, మోటార్ టెక్నాలజీని ఇందులోనూ వినియోగించే అవకాశం ఉంది. ప్రస్తుతం Curvv EVలో 55kWh బ్యాటరీ ప్యాక్ ఉండగా, ఒక్కసారి ఛార్జ్ చేస్తే 502 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ వెల్లడించింది. ఇక Sierra EVలో 65kWh, 75kWh బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. వీటితో గరిష్ఠంగా 665 కిలోమీటర్ల వరకు రేంజ్ లభిస్తుందని ప్రకటించింది. అయితే ఈ బ్యాటరీ సామర్థ్యాలు Kunoలో ఉంటాయనే విషయంపై ఇంకా స్పష్టత లేదు.

ధర విషయానికి వస్తే టాటా Kuno EV ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. Curvv EV, Sierra EV మధ్య స్థానంలో ఉండేలా ధర నిర్ణయించే అవకాశం ఉంది. ప్రస్తుతం Curvv EV ధరలు రూ.17.19 లక్షల నుంచి ప్రారంభమవుతుండగా, Sierra EV ధరలు రూ.18.79 లక్షల నుంచి రూ.25.99 లక్షల వరకు ఉన్నాయి. అధికారిక వివరాలు వెల్లడయ్యే వరకు Kuno ధర, ఫీచర్లు, రేంజ్‌పై స్పష్టత రావాల్సి ఉంది.

Follow Us