AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓరి దేవుడో.. మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. కొత్త సబ్‌ వేరియంట్‌తో కఠిన ఆంక్షలు, లాక్‌డౌన్‌..!

చాలా నగరాల్లోని పాఠశాలలు ఆన్‌లైన్ క్లాస్‌లోకి వెళ్లిపోయాయి. ఆసుపత్రుల్లో సేవలపై ఆంక్షలు విధించారు. చాలా దుకాణాలు, రెస్టారెంట్లు మూసివేయబడ్డాయి. వారి సిబ్బందిని క్వారంటైన్‌లో ఉంచారు.

ఓరి దేవుడో.. మళ్లీ విజృంభిస్తున్న కరోనా..  కొత్త సబ్‌ వేరియంట్‌తో కఠిన ఆంక్షలు, లాక్‌డౌన్‌..!
Corona
Jyothi Gadda
|

Updated on: Nov 12, 2022 | 1:03 PM

Share

ప్రపంచ దేశాల్ని వణికించిన కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. కొవిడ్‌కు పుట్టినిలైన చైనాలో మరోసారి కరోనా వైరస్‌ కోరలు చాస్తోంది. కోవిడ్ నుంచి కోలుకుని పూర్తిగా బయటపడి రెండేళ్లు పూర్తి కాకుండానే మళ్లీ చైనాలో కరోనా పాజిటివ్ కేసులు విచ్చలవిడిగా పెరుగుతున్నాయి. ఆ దేశంలో తాజాగా పది వేలకు పైనే కొత్త కేసులు నమోదు కావటం కలకలం రేపుతోంది. చైనాలో కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ యొక్క కొత్త తరంగం కనిపించిందని, చాలా నగరాల్లో లాక్‌డౌన్ ప్రకటించబడినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. శుక్రవారం దాదాపు 10,000 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ సోకిన వారిలో చాలా మందికి ఎలాంటి లక్షణాలు లేవని చెబుతున్నారు. పశ్చిమ చైనాలోని చాంగ్‌కింగ్, దక్షిణాదిలోని గ్వాంగ్‌జౌ నగరాల్లో లాక్‌డౌన్ కారణంగా దాదాపు 50 లక్షల మంది ప్రభావితమయ్యారు. బీజింగ్‌లో ప్రతిరోజూ 21 లక్షల మందికి కోవిడ్ పరీక్షలు చేస్తున్నారు.

చాలా నగరాల్లోని పాఠశాలలు ఆన్‌లైన్ క్లాస్‌లోకి వెళ్లిపోయాయి. ఆసుపత్రుల్లో సేవలపై ఆంక్షలు విధించారు. చాలా దుకాణాలు, రెస్టారెంట్లు మూసివేయబడ్డాయి. వారి సిబ్బందిని క్వారంటైన్‌లో ఉంచారు. కొన్ని ప్రాంతాల్లో పోలీసులు, ఆరోగ్య కార్యకర్తలతో ప్రజలు వాగ్వాదానికి దిగిన దృశ్యాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

కోవిడ్‌కు వ్యతిరేకంగా చైనా అనుసరిస్తున్న జీరో టాలరెన్స్ విధానంతో ప్రజలు విసుగు చెందారు. లక్షలాది కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయి. ఈ అంశంపై చైనా రాజకీయ నేతలు గురువారం సమావేశమయ్యారు. వారాలుగా క్వారంటైన్‌లో ఉన్న వారి విడుదలకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకున్నారనేది ఇంకా వెల్లడించలేదని వర్గాలు తెలిపాయి.

ఇవి కూడా చదవండి

జీరో టాలరెన్స్ విధానం వల్ల చైనాలో ఇన్‌ఫెక్షన్ రేటు తగ్గింది. కానీ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. ముందస్తు సమాచారం లేకుండా పాఠశాలలు, పరిశ్రమలు, దుకాణాలను ఒక్కసారిగా మూసివేయడంతో జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

కోవిడ్ కేసులు మళ్లీ పెరగడంతో, చాలా ప్రాంతాల్లో వ్యాపారాలు మూసివేయబడుతున్నాయి. ఆంక్షలు విధిస్తున్నారు. కార్యాలయ భవనాలు, షాపింగ్ మాల్స్ మరియు బహిరంగ ప్రదేశాల్లోకి ప్రవేశించడానికి, ప్రజలు రోజుకు ఒకసారి కోవిడ్ పరీక్ష చేయించుకోవాలి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి