Sania and Shoaib: షోయబ్ కు మోడల్ తో ఎఫైర్.. అందుకే సానియాతో విడాకులంటున్న పాక్ మీడియా
పాకిస్తాన్‌కు చెందిన మోడల్ కమ్ యూట్యూబర్ ఆయోషా ఓమర్‌తో షోయబ్ పెట్టుకున్న ఎఫైరే సానియా కాపురంలో చీలికలు తెచ్చిందని పాక్ మీడియాలో కథనాలొచ్చాయి. కొన్నాళ్ల క్రితం షోయబ్ మాలిక్‌కు సదరు మోడల్‌తో పరిచయమైందని, ఆ పరిచయం కాస్త ప్రేమగా మారిందట.
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్తాన్ క్రికెట్ టీం మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ ఈ రెండు పేర్లు 2010లో క్రీడాలోకంలో సంచలనం సృష్టించాయి. భారతీయ క్రీడాకారిణి సానియా మీర్జా పాకిస్తానీ క్రికెటర్ పై మనసు పడి పెళ్ళి చేసుకోవడం అప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మళ్ళీ ఇప్పుడు ఈ ఇద్దరి పేర్లూ మరోసారి క్రీడాప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారాయి. విడిపోతున్న సెలబ్రిటీల లిస్ట్‌లో ఇప్పుడు సానియా, మాలిక్‌లు చేరిపోయారంటూ ఓ వైపు భారత్ లో ప్రచారం జరుగుతుంటే.. మరోవైపు పాకిస్థాన్ మీడియా మాత్రం ఏకంగా విడిపోయారని కథనాలను ప్రసారం చేస్తోంది. సానియా విడాకులు అటు పాకిస్తాన్ క్రీడా ప్రపంచంలోనూ, ఇటు భారతీయ క్రీడాకారుల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందా? ఈ ఇద్దరి మధ్యా మనస్పర్థలు విడాకుల వరకు వెళ్ళాయా? అంటే అవుననే అంటున్నారు వారి సన్నిహితులు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజమేనంటున్నారు. దాపరికం లేమీ లేదు డైవోర్స్ వాస్తవమేనంటున్నారు. “వేర్ డూ బ్రోకెన్ హార్ట్స్ గో” అంటూ సానియా ఇటీవల పెట్టిన పోస్ట్ ఇప్పుడు కలకలం రేపుతోంది. దీనిపై వచ్చిన ప్రశ్నలకు సానియా, షోయబ్ మౌనం అనుమానాలను బలపరుస్తోంది. దీంతో వీరిద్దరి మధ్యా ఏం జరుగుతోందన్న చర్చ పాకిస్తాన్ మీడియాలో కథలు కథలుగా ప్రచారం జరుగుతోంది.
అయితే సానియా, షోయబ్‌ల విడాకుల వ్యవహారం చరమాంకానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇద్దరి అంగీకారం మేరకే విడాకుల నిర్ణయానికి వచ్చినట్టు షోయబ్ మాలిక్‌కు అత్యంత సన్నిహితుడొకరిని ఉటంకిస్తూ పాకిస్తాన్ మీడియా వెల్లడించింది. వారిద్దరూ ఇప్పటికే దూరమయ్యారని, కేవలం విడాకుల పత్రాలకు సంబంధించిన ప్రక్రియ మాత్రమే పూర్తి చేయాల్సి ఉందని ఆ మిత్రుడు వెల్లడించినట్టు కూడా తెలిపాయి.
సానియా ప్రస్తుతం దుబాయ్‌లో ఉండగా.. టీ20 ప్రపంచ కప్ విశ్లేషకుడిగా మాలిక్ పాకిస్థాన్‌లో ఉన్నాడు. సానియా ఇటీవల ట్విటర్‌లో విడుదల చేసిన ఓ ఫొటో, దానికి రాసిన పోస్ట్..ఆమె, షోయబ్ విడిపోనున్నారన్న పుకార్లకు తావిచ్చింది. అయితే అవి నిజమేనని షోయబ్ మిత్రుడొకరు ధ్రువీకరించినట్టు ఓ పాక్ జాతీయ చానెల్ వెల్లడించింది. అలాగే మాలిక్ వ్యవహారాలు చూసే మేనేజ్‌మెంట్ సంస్థ సభ్యుడు కూడా విడాకుల విషయాన్ని వెల్లడించాడు. ‘అవును, వారు విడిపోయారన్నది నిజం. ఇంతకంటే వివరాలు వెల్లడించలేను’ అని ఆ సభ్యుడు తెలిపాడు.
గతనెల 30న కుమారుడు ఇజాన్ పుట్టినరోజు సందర్భంగా సానియా, మాలిక్ కలుసుకున్నారు. షోయబ్ పాకిస్థాన్ నుంచి దుబాయ్ వచ్చి కుమారుడి జన్మదిన వేడుకల్లో పాల్గొన్నాడు. అయితే ఈ వేడుకకు సంబంధించి సానియా చేసిన పోస్ట్‌లలో షోయబ్ ఫొటోలు లేకపోవడం కూడా వారు విడిపోతున్నారన్న వార్తలకు బలం చేకూర్చింది.
సరిహద్దులు చెరిపేస్తూ హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌లకు 2010 లో ఒక్కటయ్యారు. హైదరాబాద్ వేదికగా వీరిప్రేమ వివాహం ఓ సంచలనమే అయ్యింది. 2018లో ఇజాన్ మీర్జా మాలిక్‌కి జన్మనిచ్చారు. అంతవరకూ బాగానే ఉంది. అయితే ఈ మధ్య వీరిద్దరి మధ్యా వివాదాలపై పాకిస్తాన్ మీడియా కోడై కూస్తోండడం సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది. సానియా తన కొడుకుతో ఉన్న ఓ ఫొటో ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేస్తూ … ఈ అద్భుతమైన క్షణాలే తనని కష్టతరమైన రోజుల నుంచి బయటపడేట్టు చేస్తాయంటూ… కామెంట్ పెట్టడంతో సానియా వైవాహిక జీవితంలో ఏదో జరుగుతోందన్న చర్చ రచ్చరేపుతోంది. వారి వైవాహిక బంధంపై.. ఎన్నో ప్రశ్నలు.. మరెన్నో అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. పాక్ మీడియా కథనాలు, తాజాగా సానియా సోషల్ మీడియా పోస్ట్‌లు.. హాట్‌టాపిక్‌గా మారాయి.
పాకిస్తాన్‌కు చెందిన మోడల్ కమ్ యూట్యూబర్ ఆయోషా ఓమర్‌తో షోయబ్ పెట్టుకున్న ఎఫైరే సానియా కాపురంలో చీలికలు తెచ్చిందని పాక్ మీడియాలో కథనాలొచ్చాయి. కొన్నాళ్ల క్రితం షోయబ్ మాలిక్‌కు సదరు మోడల్‌తో పరిచయమైందని, ఆ పరిచయం కాస్త ప్రేమగా మారిందట. సన్నిహితంగా ఉంటూ మరింత దగ్గరయ్యారన్నది రూమర్ల సారాంశం. మోడల్ ఆయేషా మోజులో పడిన షోయబ్ మాలిక్.. సానియాను పట్టించుకోవడం మానేశాడన్న వార్తలు షికారు చేస్తున్నాయి. మోడల్ తో కొన్ని నెలల క్రితం షోయబ్ ఫోటో షూట్ చేశాడు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆమెతో సన్నిహితంగా ఉన్న కారణంగానే సానియా.. షోయబ్‌ను దూరం పెట్టిందట. అయేషా ఒమర్, షోయబ్‌ల ఫోటో షూట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. నిజానికి సానియా – మాలిక్ మధ్య ఎటువంటి సమస్యలు ఉన్నాయో ఇంకా స్పష్టంగా తెలియడం లేదు. వాళ్లిద్దరూ క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో రూమర్స్ మరింత ఎక్కువ అవుతున్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..