Indian Cricket: సెమీస్‌లో టీమిండియా ఓటమికి అదే కారణమా..? చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు
టీ20 ప్రపంచకప్ రెండో సెమీ ఫైనల్‌లో భారత్ పది వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో మాజీ క్రికెటర్ల నుంచి విమర్శలు, సలహాల పరంపర సాగుతూనే ఉండగా.. చెన్నై సూపర్ కింగ్స్ హెడ్ కోచ్..
టీ20 ప్రపంచకప్ రెండో సెమీ ఫైనల్‌లో భారత్ పది వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో మాజీ క్రికెటర్ల నుంచి విమర్శలు, సలహాల పరంపర సాగుతూనే ఉండగా.. భారత క్రికెట్ బోర్డ్‌కు చెన్నై సూపర్ కింగ్స్ హెడ్ కోచ్ ఆసక్తికరమైన సూచనిచ్చారు. భారత ఆటగాళ్లకు ఇతర దేశాల పిచ్‌ల మీద ఆడిన అనుభవం తక్కువగా ఉండడమే వారి వైఫల్యాలకు కారణమని, వారిని విదేశీ టోర్నీలలో ఆడేందుకు బీసీసీఐ అనుమతించాలని అన్నారు. వీదేశీ టోర్నీలలో భారత ఆటగాళ్లు ఆడడానికి ఆ జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ నిరాకరించి ఉండవచ్చు కానీ అది మంచి ఐడియా అని అన్నారు.
న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు ఆట తీరుపై మాట్లాడుతూ..‘‘ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో భారత జట్టు 168 చేయగలిగింది. కానీ ఇంగ్లీష్ ప్లేయర్లు అలెక్స్ హేల్స్, జోస్ బట్లర్‌లు దానిని సునాయాసంగా, ఇంకా చెప్పాలంటే నాలుగు ఓవర్లు మిగిలిఉండగానే చేధించారు. అందుకు కారణం వారికి బిగ్ బాష్ లీగ్(బీబీఎల్) ఉన్న అనుభవమే కారణం. అస్ట్రేలియా మైదానాలలో జరిగే ఆ లీగ్‌లో మెల్‌బోర్న్ రెనెగేడ్స్, అడిలైడ్ స్ట్రైకర్స్, హోబర్ట్ హరికేన్స్ మరియు సిడ్నీ థండర్స్ కోసం ఆడిన హేల్స్‌కు గొప్ప అనుభవం ఉంది. అలాగే బట్లర్ కూడా 2013 నుండి బీబీఎల్‌లో మెల్‌బోర్న్ రెనెగేడ్స్ మరియు సిడ్నీ థండర్ జట్టుల తరపున ఆడుతున్నాడు. ఆ అనుభవమే సెమీఫైనల్‌లో విజయం సాధించడానికి దోహదపడింది. ప్రపంచ క్రికెట్‌లో ఈ ఆటగాళ్లు రాణించడానికి విదేశీ టోర్నీలలో ఆడడమనేది నిజంగా ఉపయోగకరమైనదనే చెప్పుకోవాలి. తద్వారా ఆటగాళ్లు ఇంతకు ముందు ఆడిన మైదానంలో తిరిగి ఆడడానికి కంఫర్టబిలిటీని ఫీల్ అవుతారు’’ అని అన్నారు. అలాగే వచ్చే రెండెళ్లలో వెస్ట్ ఇండీస్ టీ20 ప్రపంచకప్ జరగబోతుందని, ఇలాంటి సమయంలో అక్కడ జరిగే కరీడియన్ ప్రిమియర్ లీగ్(సీపీఎల్)లో భారత ఆటగాళ్లు బాగుంటుందని ఫ్లెమింగ్ సూచించారు. ‘‘వేర్వేరు ప్రాంతాలలో పనులు విభిన్న రీతిలో జరుగుతుంటాయి. ఫోన్‌ను అప్‌డేట్ చేసుకున్నట్లే మనల్ని మనం అప్‌డేట్ చేసుకోవాలి’’ అని స్టీఫెన్ ఫ్లెమింగ్ అన్నారు. కాగా ఫ్లెమింగ్ కోచింగ్‌లోనే చెన్నై సూపర్ కింగ్స్ నాలుగు సార్లు ఐపీఎల్ విజేతగా నిలిచింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..