NZ vs PAK, 1st Semi-Final: ఫైనల్ చేరేది పాకిస్తాన్ జట్టే.. కివీస్‌పై తిరుగులేని ఆధిపత్యం.. ఐసీసీ ఈవెంట్స్‌లో రికార్డులు ఇవే..
PAK vs NZ: టీ20 వరల్డ్ కప్ 2022 సెమీ-ఫైనల్‌కు ముందు పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ ఇప్పటి వరకు 5 సార్లు ఐసీసీ టోర్నమెంట్‌లలో సెమీ-ఫైనల్స్‌లో తలపడ్డాయి. ఇందులో పాకిస్థాన్ 3 మ్యాచ్‌లు గెలవగా, న్యూజిలాండ్ రెండుసార్లు విజయం సాధించింది.

New Zealand vs Pakistan: టీ20 ప్రపంచ కప్ 2022 (T20 World Cup 2022) మొదటి సెమీ ఫైనల్‌లో నవంబర్ 9న పాకిస్థాన్ వర్సెస్ న్యూజిలాండ్ తలపడనున్నాయి. వీరిద్దరి మధ్య జరిగే ఈ మ్యాచ్‌లో ఏ జట్టు గెలిస్తే ఆ జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది. అదే సమయంలో ఈ మ్యాచ్‌కు ముందు కూడా ఐసీసీ టోర్నమెంట్‌ల సెమీ ఫైనల్‌లో పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ తలపడ్డాయి. ఐసీసీ టోర్నీల్లో ఇప్పటి వరకు 5 సార్లు సెమీ ఫైనల్స్‌లో ఇరు జట్లు తలపడ్డాయి.
ఐసీసీ టోర్నీలో సెమీ ఫైనల్‌లో ఇరు జట్లు తలపడడం ఇది ఆరోసారి. ఇటువంటి పరిస్థితిలో, ఇప్పటివరకు జరిగిన ఐసీసీ టోర్నమెంట్ సెమీ-ఫైనల్స్‌లో పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్‌లలో ఎవరిది పైచేయిగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
1992 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్స్‌లో విజయం పాకిస్తాన్‌దే..




1992లో జరిగిన ICC టోర్నమెంట్‌లో సెమీ-ఫైనల్స్‌లో పాకిస్థాన్ వర్సెస్ న్యూజిలాండ్ తొలిసారి తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ న్యూజిలాండ్‌ను ఓడించింది. ఈ సంవత్సరం పాకిస్తాన్ ఇప్పటివరకు తన మొదటి, ఏకైక వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకుంది.
1999లో కూడా పాకిస్తాన్‌దే ఆధిపత్యం..
1992 తర్వాత 1999 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ సెమీ-ఫైనల్‌లో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లోనూ పాకిస్థాన్ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుని న్యూజిలాండ్‌ను ఓడించింది.
ఛాంపియన్స్ ట్రోఫీ 2000లో న్యూజిలాండ్‌దే హవా..
2000 ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ-ఫైనల్స్‌లో న్యూజిలాండ్ తొలిసారిగా పాకిస్థాన్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను ఓడించి న్యూజిలాండ్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు చేరుకుంది.
2007 టీ20 ప్రపంచ కప్‌లో మరోసారి పాకిస్తాన్‌దే విజయం..
2007 టీ20 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్‌లో పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ పోటీ పడ్డాయి. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు న్యూజిలాండ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది.
2009 ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ విజయం..
2009 ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ-ఫైనల్‌లో న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య పోరు జరిగింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ పాకిస్థాన్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..