IND vs ENG: వామ్మో.. ఇదేం కొట్టుడు సామీ.. ఆ షాట్స్ నామైండ్ నుంచి పోవట్లే: సూర్యను ఆకాశానికెత్తేసిన ఇంగ్లండ్ ప్లేయర్..
Surya Kumar Yadav: టీ20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌కు ముందు టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్‌పై ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ప్రశంసల వర్షం కురిపించాడు.

టీ20 ప్రపంచకప్ 2022 (T20 World Cup 2022)లో టీమిండియా సెమీఫైనల్‌కు చేరుకుంది. ఈ ప్రపంచకప్‌లో భారత్‌తో పాటు ఇంగ్లండ్, పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లు సెమీఫైనల్‌కు చేరాయి. సెమీస్‌లో భారత జట్టు ఇంగ్లండ్‌తో తలపడాల్సి ఉంది. ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ అడిలైడ్ ఓవల్ వేదికగా జరగనుంది. అదే సమయంలో ఈ మ్యాచ్‌కు ముందు, ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ సూర్యకుమార్ యాదవ్(Surya Kumar Yadav)పై ప్రశంసల వర్షం కురిపించాడు.
సూర్యకుమార్ యాదవ్‌ను పొగడ్తలతో ముంచెత్తిన బెన్ స్టోక్స్..
సెమీ-ఫైనల్స్‌లో టీమిండియాతో మ్యాచ్‌కు ముందు సూర్యకుమార్ యాదవ్‌ను ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ప్రశంసించాడు. ‘జింబాబ్వేపై అతను కొట్టిన షాట్‌లను ఇప్పటికీ నమ్మలేకపోతున్నానంటూ’ చెప్పుకొచ్చాడు. ఇంగ్లండ్ జట్టు తరపున విజయవంతమైన ఆల్ రౌండర్‌గా పేరుగాంచిన బెన్ స్టోక్స్.. మ్యాచ్‌ను తనవైపు తిప్పుకుని జట్టును గెలిపించగల సత్తా సూర్యకే ఉందంటూ ప్రశంసించారు.
సూర్యకుమార్ యాదవ్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. T20 వరల్డ్ కప్ 2022 లో సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా ఆడుతూ, మంచి స్కోర్లు నమోదు చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో 3 అర్ధ సెంచరీలు సాధించాడు. అదే సమయంలో అతను ప్రపంచ కప్‌లో ఇప్పటివరకు 225 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతని సగటు 75 కంటే ఎక్కువగా ఉంది. ఈ ప్రపంచ కప్‌లో 193 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేశాడు.




జింబాబ్వేపై మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో భారత స్టార్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ తన బ్యాట్‌తో తుఫాను సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో అతను 25 బంతుల్లో 61 పరుగులతో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. సూర్యకుమార్ యాదవ్ తన ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు.
టీ20 ప్రపంచకప్‌లో సూర్య కుమార్ యాదవ్ చేసిన స్కోర్లు..
1వ మ్యాచ్, భారత్ vs పాకిస్థాన్ – 10 బంతుల్లో 15 పరుగులు
2వ మ్యాచ్, భారత్ vs నెదర్లాండ్స్ – 25 బంతుల్లో 51 పరుగులు
3వ మ్యాచ్, భారత్ vs సౌతాఫ్రికా – 40 బంతుల్లో 68 పరుగులు
4వ మ్యాచ్, భారత్ vs బంగ్లాదేశ్ – 16 బంతుల్లో 30 పరుగులు
5వ మ్యాచ్, భారత్ vs జింబాబ్వే – 25 బంతుల్లో 61 పరుగులు
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..