- Telugu News Photo Gallery Cricket photos Rohit Sharma to Babar Azam T20 World Cup Semifinal Teams captains records in group matches
T20 World Cup 2022: అత్యంత చెత్త దశలో సెమీస్ సారథులు.. కెరీర్‌లోనే దారుణంగా.. నాకౌట్‌లోనైనా రాణించేనా?
T20 World Cup Semifinals: గ్రూప్ దశలో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అత్యధికంగా 132 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ 132.22 స్ట్రైక్ రేట్‌తో 119 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ ఐదు మ్యాచ్‌ల్లో 89 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
Updated on: Nov 08, 2022 | 4:51 PM

ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో సెమీఫైనలిస్ట్ జట్లను ఖరారు చేశారు. భారత్, న్యూజిలాండ్‌లు తమ గ్రూపుల్లో అగ్రస్థానంలో ఉన్నాయి. పాకిస్థాన్, ఇంగ్లండ్‌లు తమ లీగ్ దశ ప్రయాణాన్ని రెండో స్థానంలో ముగించాయి. సెమీఫైనల్‌కు చేరిన జట్ల కెప్టెన్లు మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయారు. ఈ టోర్నీలో ఆయా జట్ల బాస్‌ల ప్రదర్శన యావరేజ్‌గా ఉంది. అంతేకాదు ఈ నలుగురు టీమ్ లీడర్‌లలో ఎవరూ ఈ టోర్నీలో టాప్-10 స్కోరర్‌లలో లేకపోవడం గమనార్హం.

గ్రూప్ దశలో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అత్యధికంగా 132 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ 132.22 స్ట్రైక్ రేట్‌తో 119 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ ఐదు మ్యాచ్‌ల్లో 89 పరుగులు మాత్రమే చేయగలిగాడు. పాక్ కెప్టెన్ బాబర్ ఆజం ఈ లిస్టులో అత్యంత చెత్తగా మారాడు. గ్రూప్ దశలో 39 పరుగులు మాత్రమే చేయగలిగాడు. నలుగురు కెప్టెన్ల ప్రదర్శన ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..

రోహిత్ శర్మ గ్రూప్ దశలో పెద్దగా రాణించలేకపోయాడు. టోర్నీలో అతను ఇప్పటివరకు ఒకే ఒక అర్ధ సెంచరీ (నెదర్లాండ్స్‌పై 53) మాత్రమే చేశాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో రెండంకెల స్కోరును కూడా దాటలేకపోయాడు. భారత కెప్టెన్ జింబాబ్వేపై 15, బంగ్లాదేశ్‌పై 2, దక్షిణాఫ్రికాపై 15, నెదర్లాండ్స్‌పై 53, పాకిస్థాన్‌పై 4 పరుగులు మాత్రమే చేశాడు.

న్యూజిలాండ్ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ సిడ్నీ వికెట్‌పై కొంత నిరాశగా కనిపించాడు. అక్కడ అతను 2 మ్యాచ్‌ల్లో 8, 23 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అతను ఐర్లాండ్‌పై యాభై పరుగులు చేశాడు. కానీ, ఆ ఇన్నింగ్స్‌లో కూడా విలియమ్సన్ క్లాస్ కనిపించలేదు. గ్రూప్ దశలో ఐర్లాండ్‌పై 61, ఇంగ్లండ్‌పై 40, శ్రీలంకపై 8, ఆస్ట్రేలియాపై 23 పరుగులు చేశాడు.

ఇంగ్లీష్ కెప్టెన్ జోస్ బట్లర్ టైటిల్ కోసం రేసులో ఉన్న జట్ల కెప్టెన్లలో అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. హాఫ్ సెంచరీతో సహా 119 పరుగులు చేశాడు. నలుగురు కెప్టెన్లలో జోస్ స్ట్రైక్ రేట్ (132.22) అత్యుత్తమంగా ఉంది. గరిష్టంగా 15 బౌండరీలు బాదేశాడు. స్కోరు గురించి మాట్లాడితే, అతను శ్రీలంక, న్యూజిలాండ్, ఐర్లాండ్, ఆఫ్ఘనిస్తాన్‌లపై వరుసగా 28, 73, 0, 8 పరుగులు మాత్రమే చేశాడు.

బాబర్ అజామ్ నాలుగు ఇన్నింగ్స్‌ల్లో రెండంకెల స్కోరును దాటలేకపోయాడు. ఏడాది పొడవునా అద్భుతమైన ఫామ్‌లో ఉన్న పాక్ కెప్టెన్ బాబర్ అజామ్.. ప్రపంచకప్ గ్రూప్ దశలో పూర్తిగా పేలవంగా తయారయ్యాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు బాబర్ 39 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అడిలైడ్‌లో బంగ్లాదేశ్‌పై బాబర్ ఒక్కసారి మాత్రమే 10 మార్కును దాటగలిగాడు. అతను బంగ్లాదేశ్‌పై 25, దక్షిణాఫ్రికాపై 6, నెదర్లాండ్స్, జింబాబ్వేపై చెరో 4 పరుగులు చేశాడు. భారత్‌పై ఖాతా కూడా తెరవలేకపోయాడు.





























