- Telugu News Photo Gallery Cricket photos Mark wood suffering from stiff body india vs england semi final t20 world cup 2022 david malan also
IND vs ENG: సెమీ ఫైనల్‌కు గాయాల గండం.. ఇద్దరు ప్లేయర్లు అన్‌ఫిట్.. బరిలో దిగడం కష్టమే?
టీ20 ప్రపంచకప్ 2022 రెండో సెమీఫైనల్‌లో ఇంగ్లండ్, భారత్‌లు పోటీపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు ముందే మరో ఇంగ్లండ్ ఆటగాడు అన్ ఫిట్ అయ్యాడు.
Updated on: Nov 08, 2022 | 8:30 PM

టీ20 ప్రపంచకప్ 2022 రెండో సెమీ ఫైనల్‌లో భారత్, ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. అడిలైడ్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌కు ముందే ఇంగ్లండ్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నిజానికి సెమీఫైనల్‌కు ముందు ఇంగ్లండ్‌కు చెందిన మరో ఆటగాడు కూడా అన్ ఫిట్ అయ్యాడు.

మీడియా నివేదికల ప్రకారం, ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ కండరాల ఒత్తిడితో బాధపడుతున్నందున ఇంగ్లాండ్ ప్రాక్టీస్ సెషన్ నుంచి నిష్క్రమించాడు. ఇంగ్లండ్ జట్టులోని అతిపెద్ద మ్యాచ్ విన్నర్లలో మార్క్ వుడ్ ఒకడని తెలిసిందే.

ఈ టీ20 మ్యాచ్‌లో మార్క్ వుడ్ 4 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు పడగొట్టాడు. ఈ టీ20 ప్రపంచకప్‌లో ఫాస్టెస్ట్ బౌలర్ కూడా అతనే. గంటకు 154.74 వేగంతో బంతిని వేశాడు. అలాగే, ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన సూపర్-12 మ్యాచ్‌లో మార్క్ వుడ్ అత్యంత వేగంగా స్పెల్ విసిరాడు. అందులో అతని వేగం 149.02 కి.మీ. గంటకు చేరింది.

భారత్‌తో జరిగే సెమీఫైనల్ మ్యాచ్‌లో మార్క్ వుడ్ ఆడకపోతే.. ఇంగ్లిష్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తప్పదు. డేవిడ్ మలన్ కూడా గాయపడ్డాడు. అతను సెమీ-ఫైనల్‌లో ఆడటం ఖాయం కాకపోవచ్చు. నివేదికల ప్రకారం, సెమీ-ఫైనల్‌లో అతని స్థానంలో ఫిల్ సాల్ట్ ఆడవచ్చు.

అడిలైడ్ వేదికగా జరిగే మ్యాచ్ కోసం భారత్, ఇంగ్లండ్ జట్లు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. మంగళవారం విరాట్ కోహ్లి, కెప్టెన్ రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్ నెట్స్‌లో చెమటోడ్చారు.




