Venkata Chari |
Updated on: Nov 09, 2022 | 5:50 PM
టీ20 ప్రపంచకప్‌లో సూర్యకుమార్ యాదవ్ గందరగోళం సృష్టిస్తున్నాడు. తన బ్యాట్‌తో బౌలర్ల గుండెల్లో మంటలు పుట్టిస్తున్నాడు. సూర్య షాట్స్ కూడా చాలా చర్చనీయాంశమయ్యాయి. కొత్త తరహా షాట్స్ ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. మైదానంలో పరుగుల వర్షం కురిపిస్తున్న సూర్య కుమార్.. తాజగా మైదానం వెలుపల కూడా కనక వర్షం కురిపిస్తున్నాడు.
అద్భుతమైన బ్యాటింగ్ కారణంగా మార్కెట్‌లో సూర్యకు డిమాండ్ బాగా పెరిగింది. ప్రకటనల ప్రపంచంలో అతను పెద్ద బ్రాండ్ల మొదటి ఎంపికగా మారుతున్నాడు. పెద్ద బ్రాండ్‌లతో అతని డీల్‌ల సంఖ్య 20కి చేరుకోనుంది. అంతే కాదు వీటి విలువ దాదాపు 3 రెట్లు పెరిగింది.
గతంలో సూర్య కుమార్ యాదవ్ రోజుకు దాదాపు రూ.20 లక్షలు వసూలు చేసేవాడంట. ఇప్పుడు రోజుకు దాదాపు రూ.65 నుంచి 70 లక్షల వరకు వసూలు చేస్తున్నాడు. టాలెంట్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ ప్రకారం, 6-7 బ్రాండ్‌లు త్వరలో సూర్యను తమ కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించవచ్చని తెలుస్తోంది.
సూర్యకుమార్ ప్రస్తుతం దాదాపు 10 బ్రాండ్‌లతో అనుబంధం కలిగి ఉన్నాడు. తాజాగా అతని జాబితాలోకి మరిన్ని పెద్ద పేర్లు జోడించబోతున్నాయి. ప్రస్తుతం Mr 360 Dream11, ఫార్మా హెల్మెట్ వంటి బ్రాండ్‌లతో పనిచేస్తున్నాడు.
రాబోయే నెలల్లో, సూర్య జాబితాలో మొబైల్ ఉపకరణాలు, మీడియా, క్రీడలు, విద్య విదేశాల్లోని సేవల బ్రాండ్‌లు కూడా చేరవచ్చని అంటున్నారు. టీ20 ప్రపంచకప్‌లో బలమైన ప్రదర్శన తర్వాత, అతని బ్రాండ్‌ల సంఖ్య దాదాపు 20కి చేరుకుంటుందని భావిస్తున్నారు.