- Telugu News Photo Gallery Cricket photos T20 world cup 2022 fashionable cricketer suryakumar yadav tattoos on his body
Suryakumar Yadav: తల్లిదండ్రుల ఫోటోల నుంచి భార్య పేరు వరకు.. టాటూలతో నిండిన సూర్యకుమార్ బాడీ..
సూర్యకుమార్ యాదవ్ తన ప్రత్యేకమైన షాట్‌లతోనే కాకుండా ఫ్యాషన్‌లో తన స్టైల్‌తోనూ అభిమానుల మనసు దోచుకుంటున్నాడు. టీ20 ప్రపంచ కప్ 2022లో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిన సూర్యకుమార్, తన శరీరంపై తల్లిదండ్రుల ఫోటో నుంచి భార్య పేరు వరకు చాలా టాటూలు వేయించుకున్నాడు.
Updated on: Nov 09, 2022 | 8:20 PM

సూర్యకుమార్‌కు తల్లిదండ్రులంటే ఎంత ప్రేమ ఉందంటే.. తన కుడిచేతిపై వేయించుకున్న ఈ టాటూయే నిదర్శనంగా నిలుస్తుంది. ఇందులో అతను తన తల్లిదండ్రుల ఫోటోలను కూడా టాటూలతో వేయించాడు.

మీరు కూడా ఇలా చేతిపై పచ్చబొట్టు వేయాలనుకుంటే, సూర్యకుమార్ నుంచి ప్రేరణ పొందవచ్చు. సూర్య ఎడమ చేతిపై ఉన్న పచ్చబొట్టు చాలా సృజనాత్మకంగా ఉంది. ప్రేమ, గౌరవం వంటి ప్రేరణాత్మక పదాలు కూడా ఇందులో రాశారు.

సూర్య ఛాతీపై ఎడమవైపు టాటూ వేయించుకున్నాడు. దానిని మావోరీ టాటూ అంటారు. ఇటువంటి నమూనాలు సాంప్రదాయంగా ఉంటాయి. ఇవి వారి సంస్కృతి, చరిత్రను ప్రతిబింబిస్తాయి. గౌరవ చిహ్నాలుగా భావిస్తుంటారు. అదే సమయంలో వీటి కింద సూర్య తన భార్య పేరును టాటుగా వేయించాడు.

ఈ చిత్రంలో మీరు సూర్యకుమార్ రెండు టాటూలను చూస్తున్నారు. ఒకటి అతని చేతిపై, మరొకటి అతని కాలుపై ఉంటుంది. పాదంపై ఉన్న పచ్చబొట్టుపై 'ఒక సమయంలో ఒకే అడుగు' అని రాసి ఉండగా, చేతిపై ఉన్న పచ్చబొట్టులో 'జీవితమే మీరు తయారుచేసినది' అని రాసి ఉంటుంది.

అలాగే తన చేతిపైనా కన్ను బొమ్మను టాటూ వేయించుకున్నాడు. ఇది చూసేందుకు చాలా స్టైలీష్‌గా కనిపిస్తుంది. అలాగే సూర్య పేరును ప్రతిబింబించేలా సూర్యుడి రూపంగానూ కనిపిస్తుంది.




