IND vs ENG: సెమీ ఫైనల్‌లో గెలవాలంటే ఆ ప్లేయర్‌ను పక్కన పెట్టాల్సిందే.. కోహ్లీ ఫేవరేట్ కోచ్ కీలక వ్యాఖ్యలు..

టీ20 ప్రపంచకప్ 2022లో ఇంగ్లండ్‌తో జరిగే సెమీ-ఫైనల్‌లో దినేష్ కార్తీక్ లేదా రిషబ్ పంత్ ఇద్దరిలో ఎవరు ఆడతారు? ఈ చర్చ నిరంతరం సాగుతోంది. దీనిపై రవిశాస్త్రి స్పందించారు.

IND vs ENG: సెమీ ఫైనల్‌లో గెలవాలంటే ఆ ప్లేయర్‌ను పక్కన పెట్టాల్సిందే.. కోహ్లీ ఫేవరేట్ కోచ్ కీలక వ్యాఖ్యలు..
Team India
Follow us

|

Updated on: Nov 07, 2022 | 7:20 PM

టీ20 ప్రపంచకప్ 2022లో సెమీఫైనల్‌కు చేరిన టీమిండియా శుక్రవారం ఇంగ్లండ్‌తో తలపడనుంది. ఇంగ్లండ్‌తో ఈ మ్యాచ్ అడిలైడ్‌లో జరగనుంది. ఈ మ్యాచ్‌కి ముందు టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉంటుందనే చర్చ హాట్ హాట్‌గా సాగుతోంది. ఎందుకంటే జింబాబ్వేపై భారత జట్టు దినేష్ కార్తీక్ స్థానంలో రిషబ్ పంత్‌కు అవకాశం ఇచ్చింది. అలాగే సెమీ ఫైనల్స్‌ ప్లేయింగ్ ఎలెవన్‌లో దినేష్ కార్తీక్‌కు చోటు దక్కకపోవచ్చని భావిస్తున్నారు. ఈ విషయంపై మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా పంత్ పేరునే బలపరిచాడు.

రవిశాస్త్రి మాట్లాడుతూ.. ‘ఇంగ్లండ్‌పై రిషబ్ పంత్ అద్భుతంగా రాణించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో పంత్ అద్భుత ఇన్నింగ్స్‌తో విజయం సాధించాడు. నేను పంత్‌కే ఓటేస్తున్నాను. అతనో X ఫ్యాక్టర్’ అంటూ సమాధానమిచ్చాడు.

అడిలైడ్‌లో పంత్ అద్భుతం: రవిశాస్త్రి

రవిశాస్త్రి ప్రకారం, అడిలైడ్ స్క్వేర్ బౌండరీలు చాలా చిన్నవి. వాటిని ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్స్ ఉపయోగించుకోవచ్చు. ఇంగ్లండ్ బౌలింగ్‌ను పంత్ ఇబ్బంది పెట్టగలడని శాస్త్రి అన్నాడు. శాస్త్రి మాట్లాడుతూ, ‘జట్టులో ఎక్కువగా కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్స్ ఉన్నారు. ఇంగ్లండ్ అటాక్ అద్భుతంగా ఉంటుంది. ఆ జట్టులో కుడి, ఎడమ చేతి బ్యాట్స్‌మెన్స్ ఉన్నారు. అందుకే భారత జట్టులో ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ అవసరం. ముందుగా 3-4 వికెట్లు కోల్పోయినా.. చివరి ఓవర్లలో పంత్ వేగంగా బ్యాటింగ్ చేయగలడు’ అని చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

జింబాబ్వేపై పంత్ విఫలం..

2022 టీ20 ప్రపంచకప్‌లో మొదటిసారిగా జింబాబ్వేపై రిషబ్ పంత్‌కు అవకాశం లభించింది. కేవలం 3 పరుగులకే పంత్ ఔటయ్యాడు. టీ20లో పంత్ రికార్డు ప్రత్యేకంగా ఏమీ లేదు. ఈ ఆటగాడు 53 టీ20 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 23.51 సగటుతో 964 పరుగులు చేశాడు. అతని బ్యాట్‌ నుంచి కేవలం 3 అర్ధ సెంచరీలు మాత్రమే వచ్చాయి. ఇది మాత్రమే కాదు, అతని స్ట్రైక్ రేట్ కూడా 127గా నిలిచింది. పంత్ షాట్ ఎంపిక ఎప్పుడూ ప్రశ్నార్థకంగానే ఉంటుంది.

కాగా , టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా పంత్‌కు అవకాశం ఇవ్వాలని సూచించాడు. మరి ఇంగ్లండ్‌తో జరిగే సెమీఫైనల్‌లో పంత్‌కి అవకాశం లభిస్తుందా లేక దినేష్ కార్తీక్‌కు అవకాశం లభిస్తుందా అనేది చూడాలి. ఈ టీ20 ప్రపంచకప్‌లో కార్తీక్ పేలవ ప్రదర్శన కనబరిచాడు. కాబట్టి ఇప్పుడు ప్లేయింగ్ ఎలెవన్‌లో పంత్ కనిపించే అవకాశం ఉందని తెలుస్తోంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..