T20 World Cup: గ్రూప్ దశలో టీమిండియానే తోపు.. లిస్టులో నంబర్ వన్.. మరో 2 టీంలు.. ఆ రికార్డ్ ఏంటంటే?
Team India Group Stage Matches Wins: టీ20 ప్రపంచకప్‌లో టీమ్ ఇండియా గ్రూప్ దశలో మొత్తం 38 మ్యాచ్‌లు ఆడగా 24 మ్యాచ్‌లు గెలిచింది. దీంతోపాటు ఆఫ్రికా, పాకిస్థాన్‌లు కూడా రెండో స్థానంలో లేవు.
టీ20 ప్రపంచ కప్ 2022 (T20 World Cup 2022) మ్యాచ్‌లు గ్రూప్ దశలో ముగిశాయి. ప్రస్తుతం రెండు సెమీ-ఫైనల్స్‌తోపాటు ఫైనల్ మ్యాచ్ కూడా జరగాల్సి ఉంది. ఈసారి గ్రూప్ దశలో రాణించి న్యూజిలాండ్, ఇంగ్లండ్, భారత్, పాకిస్థాన్ జట్లు సెమీఫైనల్‌కు చేరుకున్నాయి. ఇందులో 4 మ్యాచ్‌ల్లో భారత జట్టు అత్యధిక విజయాలు సాధించింది. దీంతోపాటు అన్ని జట్లూ తలో 3 మ్యాచ్‌ల్లో విజయం సాధించి సెమీఫైనల్‌లో చోటు దక్కించుకున్నాయి. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటివరకు ఏ జట్టు గ్రూప్ దశలో ఎన్ని మ్యాచ్‌లు గెలిచిందో తెలుసుకుందాం.
1. భారత్ (గ్రూప్ దశలో 24 విజయాలు)
టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటివరకు గ్రూప్ దశలో భారత జట్టు మొత్తం 38 మ్యాచ్‌లు ఆడగా, అందులో 24 మ్యాచ్‌లు గెలిచింది. ఇందులో 2022 టీ20 ప్రపంచకప్‌లో నాలుగు విజయాలు ఉన్నాయి. 4 మ్యాచ్‌ల్లో గెలిచి టీమిండియా సెమీఫైనల్‌లోకి దూసుకెళ్లింది. ప్రస్తుతం సెమీ ఫైనల్ మ్యాచ్‌ని నవంబర్ 10, గురువారం ఇంగ్లండ్‌తో ఆడనుంది.
2. పాకిస్థాన్ (గ్రూప్ దశలో 24 విజయాలు)
టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్ దశలో పాకిస్థాన్ జట్టు మొత్తం 38 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో పాకిస్థాన్ కూడా 24 మ్యాచ్‌లు గెలిచింది. అదే సమయంలో, ఈసారి ఆడుతున్న టీ20 ప్రపంచకప్‌లో, పాకిస్తాన్ గ్రూప్ దశలో 5 మ్యాచ్‌లలో 3 గెలిచి సెమీ ఫైనల్‌కు చేరుకుంది. ఆ జట్టు తన సెమీ-ఫైనల్ మ్యాచ్‌ని నవంబర్ 9 బుధవారం న్యూజిలాండ్‌తో ఆడనుంది.
3. దక్షిణాఫ్రికా (గ్రూప్ దశలో 24 విజయాలు)
దక్షిణాఫ్రికా టీ20 వరల్డ్‌లో ఇప్పటివరకు మొత్తం 38 గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 24 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. అయితే ఈసారి జరిగిన టీ20 ప్రపంచకప్‌లో ఆఫ్రికా సెమీఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్ దశలో ఆఫ్రికా కేవలం 2 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..