Watch Video: టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో తలపడేది ఎవరు? వైరలవుతోన్న ఆనంద్ మహీంద్రా ట్వీట్..
T20 World Cup 2022: నవంబర్ 10న భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అంతకుముందు, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Anand Mahindra Viral Tweet: టీ20 ప్రపంచ కప్ 2022 మొదటి సెమీ-ఫైనల్ మ్యాచ్ నవంబర్ 9న జరగనుంది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్, ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. అదే సమయంలో రెండో సెమీస్‌లో ఇంగ్లండ్‌తో భారత జట్టు తలపడనుంది. నవంబర్ 10న భారత్, ఇంగ్లండ్ మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. అడిలైడ్ ఓవల్ వేదికగా ఇంగ్లండ్‌తో భారత జట్టు సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. కాగా, సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరగనుంది.
వైరలవుతోన్న మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ట్వీట్..
అదే సమయంలో, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఒక ట్వీట్ చేశారు. ఆనంద్ మహీంద్రా చేసిన ఈ ట్వీట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ట్వీట్‌లో కుక్క వీడియోను షేర్ చేశారు. అందులో ‘నేను ఈ కుక్కను భవిష్యత్తును చూడమని అడిగాను. #T20WorldCup2022 ఫైనల్‌లో ఎవరు ఉంటారో చెప్పమని అడిగాను’ అంటూ క్యాప్షన్‌లో అందించారు. ఇది వర్తమానానికి చెందిన ‘గోడ’ను చూడటానికి ఈ సులభమైన మార్గాన్ని గుర్తించింది అంటూ చెప్పుకొచ్చారు.
ఆనంద్ మహీంద్రా ట్వీట్ ఇక్కడ చూడండి..
I asked this pooch to look into the future and tell me who would be in the finals of the #T20WorldCup2022 It figured out this ingenious way to look over the ‘wall’ of the present. What do you think it saw? ? pic.twitter.com/a5H5OPRiVU
— anand mahindra (@anandmahindra) November 6, 2022
‘ఏం చూసింది అనుకుంటున్నారా..’
ఆనంద్ మహీంద్రా ఇంకా రాసుకొచ్చారు.. ఏం చూసింది అనుకుంటున్నారా… ముఖ్యంగా భారత జట్టు సెమీ ఫైనల్‌కు చేరుకుంది. సెమీ ఫైనల్లో జోస్ బట్లర్ నేతృత్వంలోని ఇంగ్లండ్ జట్టుతో భారత జట్టు తలపడనుంది అంటూ చెప్పుకొచ్చారు. అంతకుముందు టీమ్ ఇండియా టేబుల్ టాపర్‌గా సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. సూపర్-12 రౌండ్‌లో భారత జట్టు దక్షిణాఫ్రికాపై మాత్రమే ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. మిగిలిన అన్ని మ్యాచ్‌ల్లోనూ టీమిండియా విజయం సాధించింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..