T20 World Cup: ఆంటిని నుంచి గుణతిలక వరకు.. అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొన్న 5గురు క్రికెటర్లు వీరే..

Danushka Gunathilaka: శ్రీలంక ఓపెనర్ దనుష్క గుణతిలకపై తాజాగా ఓ మహిళ అత్యాచారానికి పాల్పడింది. ప్రస్తుతం దనుష్క ఆస్ట్రేలియా పోలీసుల అదుపులో ఉన్నాడు.

T20 World Cup: ఆంటిని నుంచి గుణతిలక వరకు.. అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొన్న 5గురు క్రికెటర్లు వీరే..
Danushka Gunathilaka
Follow us

|

Updated on: Nov 07, 2022 | 9:25 PM

2022 టీ20 ప్రపంచకప్ సందర్భంగా శ్రీలంక క్రికెటర్ దనుష్క గుణతిలకపై ఆస్ట్రేలియాలో అత్యాచారం ఆరోపణలు వచ్చాయి. 29 ఏళ్ల యువతి ఈ ఆరోపణ చేసింది. ఆరోపణలపై ప్రాథమిక విచారణ తర్వాత, సిడ్నీ పోలీసులు గుణతిలకను టీమ్ హోటల్ నుంచి అరెస్టు చేశారు. ప్రస్తుతం అతను ఆస్ట్రేలియాలో ఉన్నాడు. ఇక్కడ, ఈ విషయం వెలుగులోకి రావడంతో శ్రీలంక క్రికెట్ అన్ని రకాల క్రికెట్‌ నుంచి అతన్ని తొలగించింది. అదేంటంటే.. రేప్ కేసులో తీర్పు వచ్చే వరకు అతను ఎలాంటి క్రికెట్ ఆడలేడు.

ఈ జాబితాలో మొదటి పేరు దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ మఖాయా ఆంటినిదే. 1999లో ఆంటోనీ 22 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విద్యార్థిని తెలిపిన వివరాల ప్రకారం.. టాయిలెట్ రూమ్‌లో ఆంటోనీ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడు చెప్పుకొచ్చింది. ఆ తర్వాత ఆంటోనీని అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈ కేసులో నిర్దోషి అని నిరూపించుకోవడానికి ఆంటోనీకి చాలా సమయం పట్టింది. అయితే, ఆ తర్వాత ప్రొటీస్ జట్టు తరపున దశాబ్దం పాటు క్రికెట్ ఆడాడు.

పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్‌పై కూడా అత్యాచారం ఆరోపణలు వచ్చాయి. 2005లో ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా ఓ మహిళ అతనిపై ఆరోపణలు చేసింది. దీంతో అతడిని ఆస్ట్రేలియా టూర్ నుంచి టీమ్ మేనేజ్‌మెంట్ వెనక్కి పంపింది. ఆ సమయంలో ఈ విషయం పెద్దగా హైలెట్ కాలేదు. ఈ విషయాన్ని స్వయంగా అక్తర్ ఓ చాట్ షోలో చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ రూబెల్ హొస్సేన్‌పై 2015లో అతని స్నేహితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పెళ్లి సాకుతో రూబెల్ తనను లైంగికంగా వేధించాడని యువతి తెలిపింది. ఈ ఆరోపణల తర్వాత, రూబెల్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

ఈ జాబితాలో భారత మాజీ స్పిన్నర్ అమిత్ మిశ్రా కూడా చేరాడు. లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రాపై అతని స్నేహితురాలు లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణ తర్వాత 2015లో బెంగళూరు పోలీసులు అమిత్ మిశ్రాను అరెస్టు చేశారు. అయితే, కొన్ని గంటల తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..