T20 World Cup: బిగ్ రిలీఫ్.. మళ్లీ బ్యాట్ పట్టిన హిట్‌మ్యాన్.. అయినా ఆ విషయంలో ఇంకా టెన్షనే
కొద్ది సేపు విశ్రాంతి తీసుకున్న హిట్‌మ్యాన్ మళ్లీ బ్యాట్ పట్టాడు. కాగా రోహిత్ మళ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడం చూసి భారత జట్టుతో పాటు అభిమానులు కూడా ఊపిరి పీల్చుకున్నారు.
ఇంగ్లండ్‌తో కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్‌కు ముందు రోహిత్ శర్మ గాయపడ్డాడనే వార్తతో టీమిండియాలో కలకలం రేగింది. అడిలైడ్‌లోని నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో రోహిత్ శర్మ కుడి చేతికి గాయమైంది. దీంతో క్రీజును వదిలి పక్కకు వెళ్లిపోయాడు. గాయంతో కొద్ది సేపు విలవిల్లాడిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న ఫిజియో ఇతర సిబ్బంది పరుగు పరుగును వచ్చి రోహిత్ గాయాన్ని పరిశీలించారు. తీవ్రతను అంచనా వేసి చికిత్స అందించారు. ఆ తర్వాత కొద్ది సేపు విశ్రాంతి తీసుకున్న హిట్‌మ్యాన్ మళ్లీ బ్యాట్ పట్టాడు. కాగా రోహిత్ మళ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడం చూసి భారత జట్టుతో పాటు అభిమానులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఇంగ్లిష్ టీంతో సెమీస్ కోసం అడిలైడ్‌లో ఆప్షనల్ ట్రైనింగ్ సెషన్ ప్రారంభమైంది. టీ20 ప్రపంచకప్‌లో అంచనాల మేరకు రాణించలేకపోతోన్న రోహిత్ కూడా తన బ్యాటింగ్‌ను మెరుగుపరచుకునేందుకు ప్రాక్టీస్ సెషన్‌కు వచ్చాడు. అక్కడ టీమిండియా త్రోడౌన్ ఎక్సపర్ట్ రఘుతో కలిసి బ్యాటింగ్ ప్రాక్టీస్ మొదలెట్టాడు.
ఈ క్రమంలో రఘు వేసిన ఓ బంతిని పుల్ షాట్ కొట్టేందుకు యత్నించాడు రోహిత్. అయితే అంచనా తప్పడంతో బంతి హిట్ మ్యాన్ కుడి చేతిని బలంగా తాకింది. దీంతో బ్యాట్‌ను పక్కన పెట్టి పక్కకు వెళ్లిపోయాడు. కుడిచేతికి పెద్ద ఐస్‌ప్యాక్ పెట్టుకొని కొద్దిసేపు అలా కూర్చుండిపోయాడు. ఆ తర్వాత మెంటల్ కండీషనింగ్ కోచ్ పాడీ ఆప్టన్‌తో గాయంపై చర్చించాడు. కొద్ది సేపయ్యాక మళ్లీ బ్యాట్ పట్టుకుని నెట్స్‌లోకి అడుగుపెట్టాడు. అయితే మరీ వేగంగా బంతులు వేయవద్దని కోరాడు. భారీ షాట్లు కాకుండా కేవలం డిఫెన్స్ షాట్లు ప్రాక్టీస్ చేశాడు. కాగా ప్రస్తుతం ఏ ఇబ్బంది లేకుండా బ్యాటింగ్ చేసినప్పటికీ ఒకవేళ నొప్పి తిరగబెడితే మాత్రం ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు అతడు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
డిఫెన్స్ షాట్లు ప్రాక్టీస్..
కాగా టీ20 ప్రపంచకప్‌లో రోహిత్ అంచనాల మేరకు రాణించలేకపోతున్నాడు. ఓపెనర్‌గా శుభారంభం చేయడంలో విఫలమవుతున్నాడు. గత ఐదు మ్యాచ్‌ల్లో (4, 53, 15, 2, 15 పరుగులు) కేవలం ఒక్క అర్ధ సెంచరీ మాత్రమే చేశాడు. అయితే కీలక సెమీస్ మ్యాచ్‌లో అతను రాణిస్తాడని అందరూ అనుకుంటున్నారు.
Rohit Sharma got injury earlier in the nets,but he is fit now ???
He has practiced well after that!!!#T20WC2022 #RohitSharma? pic.twitter.com/yS0hcuNduA
— Cric (@Lavdeep19860429) November 8, 2022
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..