T20 World Cup: విమానంలో బిజినెస్‌ క్లాస్‌ సీట్లను వదులుకున్న కోచ్‌, కెప్టెన్‌, కోహ్లీ.. కారణమేంటంటే?

టీమ్ ఇండియా విమానం ఎక్కిన తర్వాత కోచ్‌ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్‌ రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ తమ బిజినెస్ క్లాస్ సీట్లను మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్, హార్దిక్ పాండ్యాలకు ఇచ్చారు. వారు మాత్రం ఎకానమీ క్లాస్‌లో కూర్చొని జర్నీ చేశారు.

T20 World Cup: విమానంలో బిజినెస్‌ క్లాస్‌ సీట్లను వదులుకున్న కోచ్‌, కెప్టెన్‌, కోహ్లీ.. కారణమేంటంటే?
Team India
Follow us
Basha Shek

|

Updated on: Nov 08, 2022 | 10:07 AM

టీ20 వరల్డ్ కప్-2022 సెమీ ఫైనల్స్ ఆడేందుకు భారత జట్టు అడిలైడ్ చేరుకుంది. సోమవారం అడిలైడ్‌లో అడుగుపెట్టిన టీమ్‌ఇండియా గురువారం పటిష్ఠమైన ఇంగ్లండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. కాగా మెల్‌బోర్న్ నుంచి టీమ్ ఇండియా ఇక్కడికి వచ్చింది. కాగా జింబాబ్వే మ్యాచ్‌ తర్వాత మెల్‌బోర్న్ నుంచి వెంటనే అడిలైడ్‌కు పయనమైంది. అయితే ఈ ప్రయాణంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అదంటంటే టీమ్ ఇండియా విమానం ఎక్కిన తర్వాత కోచ్‌ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్‌ రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ తమ బిజినెస్ క్లాస్ సీట్లను మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్, హార్దిక్ పాండ్యాలకు ఇచ్చారు. వారు మాత్రం ఎకానమీ క్లాస్‌లో కూర్చొని జర్నీ చేశారు. కాగా విమానంలో బిజినెస్ క్లాస్ సీట్లు ఎంతో విశాలంగా, సౌకర్యవంతంగా ఉంటాయి. విశ్రాంతి తీసుకునేందుకు ఇవి ఎంతో అనుకూలంగా ఉంటాయి.  కాగా  టీ20 ప్రపంచకప్ మొదలైనప్పటి నుంచి వేలాది కిలోమీటర్ల ప్రయాణం చేసింది భారత జట్టు.  ఈనేపథ్యంలో బౌలర్లకు తగిన విశ్రాంతి ఇచ్చేందుకు గానూ మెన్‌ అండ్‌ బ్లూ తమ బిజినెస్ క్లాస్ సీట్లను బౌలర్లకు కేటాయించింది.

కాగా జట్టులోని ప్రతి ఆటగాడికి బిజినెస్ క్లాస్ సీటు లభించదు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిబంధనల ప్రకారం ఒక్కో జట్టుకు నాలుగు బిజినెస్ క్లాస్ సీట్లు లభిస్తాయి. చాలా జట్లు తమ కెప్టెన్, వైస్-కెప్టెన్, కోచ్, మేనేజర్‌లకు ఈ సీట్లను అప్పగిస్తారు. అయితే టీమ్ ఇండియా గత కొన్ని రోజులుగా వరుసగా ప్రయాణాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో కీలకమైన సెమీస్‌ మ్యాచ్‌కు ముందు ఫాస్ట్ బౌలర్లకు తగిన విశ్రాంతి ఇవ్వాలన్న భావనతో వారికి బిజినెస్‌ క్లాస్‌ సీట్లు ఇచ్చారు. కాగా భారత్‌, ఇంగ్లండ్‌ జట్ల మధ్య సెమీస్‌ మ్యాచ్‌ గురువారం (నవంబర్‌10) జరగనుంది. అడిలైడ్‌ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో విజయం సాధించేందుకు ఇరు జట్లు కఠినంగా సాధన చేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!