T20 World Cup: సెమీస్‌కు ముందు టీమిండియాకు బిగ్‌ షాక్‌.. ప్రాక్టీస్‌ సెషన్‌లో రోహిత్‌కు గాయం.. ఫిజియో ఏమన్నారంటే?

కీలకమైన సెమీస్‌ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు బిగ్‌ షాక్‌ తగిలేలా ఉంది. ప్రాక్టీస్ సెషన్‌లో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. అడిలైడ్‌ గ్రౌండ్‌లో నెట్స్‌లో బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తుండగా.. హిట్‌మ్యాన్‌ కుడి చేతికి గాయమైంది. దీంతో అతను విలవిల్లాడుతూ పక్కకు వెళ్లిపోయాడు

T20 World Cup: సెమీస్‌కు ముందు టీమిండియాకు బిగ్‌ షాక్‌.. ప్రాక్టీస్‌ సెషన్‌లో రోహిత్‌కు గాయం.. ఫిజియో ఏమన్నారంటే?
Rohit Sharma
Follow us
Basha Shek

|

Updated on: Nov 08, 2022 | 8:19 AM

టీ20 ప్రపంచకప్‌ కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే రెండు గ్రూప్‌ల నుంచి టాప్‌-4 జట్లు సెమీస్‌కు చేరుకున్నాయి. బుధవారం (అక్టోబర్‌ 9) జరిగే మొదటి సెమీస్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌- పాకిస్తాన్‌ తలపడనుండగా.. గురువారం (అక్టోబర్‌ 10)న జరిగే రెండో సెమీస్‌లో ఇండియా, ఇంగ్లండ్‌లు అమీతుమీ తేల్చుకోన్నాయి. కాగా కీలకమైన సెమీస్‌ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు బిగ్‌ షాక్‌ తగిలేలా ఉంది. ప్రాక్టీస్ సెషన్‌లో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. అడిలైడ్‌ గ్రౌండ్‌లో నెట్స్‌లో బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తుండగా.. హిట్‌మ్యాన్‌ కుడి చేతికి గాయమైంది. దీంతో అతను విలవిల్లాడుతూ పక్కకు వెళ్లిపోయాడు. విషయం తెలుసుకున్న జట్టు ఫిజియో రోహిత్‌ శర్మ దగ్గరికి పరుగు పరుగున వెళ్లిపోయి అతనికి చికిత్స అందించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు టీమిండియా అభిమానులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి.

కాగా రోహిత్‌ గాయం తీవ్రతపై ఇంకా పూర్తి సమాచారం లేదు. అయితే ఇంగ్లండ్‌ వంటి పటిష్ఠమైన జట్టుతో సెమీస్‌ మ్యాచ్‌కు ముందు హిట్‌ మ్యాన్‌ గాయపడడం నిజంగా టీమిండియాకు ఎదురుదెబ్బేనని చెప్పుకోవచ్చు. అయితే సెమీఫైనల్‌కు ఇంకా సమయం ఉందని, అంతలోపు కెప్టెన్ కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు. కాగా టీ20 ప్రపంచకప్‌లో రోహిత్‌ పేలవపామ్‌తో సతమతమవుతున్నాడు. కెప్టెన్‌గా విజయాలు సాధిస్తున్నా బ్యాటర్‌గా పూర్తిగా విఫలమవుతున్నాడు. గత ఐదు మ్యాచ్‌ల్లో (4, 53, 15, 2, 15 పరుగులు) కేవలం ఒక్క అర్ధ సెంచరీ మాత్రమే చేశాడు. అయితే కీలక సెమీస్‌ మ్యాచ్‌లో అతను రాణిస్తాడని అందరూ అనుకుంటున్న సమయంలో గాయపడడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..