AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Alzheimers: ఈ అలవాట్లతో చిన్న వయసులోనే గజినీగా మారిపోతారు.. దూరం పెట్టకపోతే అంతే సంగతులు

చెడు అలవాట్లు మెదడు పనితీరుపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. ఆలోచనా సామర్థ్యాన్ని తగ్గించడంతో పాటు జ్ఞాపకశక్తిని దెబ్బతీస్తాయి. అల్జీమర్స్ కూడా అందులో ఒకటి.

Alzheimers: ఈ అలవాట్లతో చిన్న వయసులోనే గజినీగా మారిపోతారు.. దూరం పెట్టకపోతే అంతే సంగతులు
Alzheimers
Basha Shek
|

Updated on: Nov 07, 2022 | 4:18 PM

Share

అనారోగ్యకరమైన ఆహారం, చెడు అలవాట్లు మన శారీరక ఆరోగ్యాన్నే కాదు మానసిక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తాయి. ముఖ్యంగా కొన్ని  అల అందుకే వయసు మళ్లిన తర్వాత వచ్చే వ్యాధులన్నీ ఇప్పుడు యువతలోనూ కనిపిస్తున్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది అల్జీమర్స్. ఇప్పటివరకు దీనికి చికిత్స లేదు. అయితే ఇలా వచ్చేందుకు అవకాశాలున్నవారిలో మాత్రం కొన్ని మందుల ద్వారా దీని తీవ్రతను తగ్గించేందుకు అవకాశం ఉంది. ముఖ్యంగా యుక్తవయసులో ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే.. అల్జీమర్స్‌ వచ్చే ప్రమాదం తగ్గుతుందంటున్నారు. ఇందుకోసం సమతుల్య ఆహారం తీసుకోవం, నీరు ఎక్కువగా తాగడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆల్కహాల్‌, స్మోకింగ్‌ వంటి అలవాట్లకు దూరంగా ఉంటూ.. ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలని సూచిస్తున్నారు.

శారీరక శ్రమ లేకపోవడం..

చాలామంది బిజీలైఫ్‌లో పడి శారీరక వ్యాయామాన్ని పక్కన పెడుతున్నారు. ఇలా చేయడం వల్ల పలు మానసిక సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా అల్జీమర్స్ వ్యాధి ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. కాబట్టి మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వ్యాయామం చాలా అవసరం.

డీహైడ్రేషన్‌

సాధారణంగా రోజుకు 7 నుండి 8 గ్లాసుల నీరు తాగలంటారు నిపుణులు. అయితే కొంతమంది దీనిని ఏ మాత్రం పట్టించుకోరు. తగినంత నీరు తాగకపోవడం మిమ్మల్ని డీహైడ్రేట్‌గా ఉంచుతుంది. దీని వల్ల కూడా అల్జీమర్స్ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఇవి కూడా చదవండి

చెడు అలవాట్లు

ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం వల్ల కూడా మీ మెదడు దెబ్బతింటుంది. ఇది కాకుండా, అనారోగ్యకరమైన ఆహారాలు, ప్రాసెస్డ్ ఫుడ్, చీజ్, బటర్ కేక్, రెడ్ మీట్ మొదలైన వాటిని కూడా దూరం పెట్టాలి లేదా మితంగా తీసుకోవాలి.

నిద్రలేమి

ఉద్యోగమంటూ చాలామంది ఇప్పుడు నైట్‌ షిఫ్టుల్లో కూడా పనిచేస్తున్నారు. అర్ధరాత్రి వరకు మేల్కొని ఉంటున్నారు. దీని ప్రభావం తాత్కాలికంగా కనిపించకపోయినా భవిష్యత్‌లో మాత్రం దీర్ఘకాలిక వ్యాధులను ఎదుర్కోవలసి ఉంటుంది. అందులో అల్జీమర్స్‌ ఒకటి. తగినంత నిద్రలేకపోతే మెదడు పనితీరు మందగిస్తుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..