ఆమెకు 83.. అతనికి 28 ఏళ్లు.. ప్రేమకు వయసు, సరిహద్దులు లేవని నిరూపించిన జంట

పోలాండ్‌కి చెందిన 83 ఏళ్ల బ్రోమా అనే వృద్ధురాలు పాకిస్తాన్‌కి చెందిన 28 ఏళ్ల హఫీజ్‌ నదీమ్‌తో ప్రేమలో పడింది. మొదట ఈ ఇద్దరు ఫేస్‌బుక్‌ ద్వారా స్నేహితులుగా ఒకరికొకరు పరిచయమయ్యారు. ఇద్దరి అభిరుచులు ఒకటవ్వడంతో మంచి స్నేహితులుగా మారిపోయారు.

ఆమెకు 83.. అతనికి 28 ఏళ్లు.. ప్రేమకు వయసు, సరిహద్దులు లేవని నిరూపించిన జంట
Marriage
Follow us
Basha Shek

|

Updated on: Nov 06, 2022 | 10:04 PM

‘ప్రేమ గుడ్డిది, ప్రేమకు వయసుతో సంబంధం లేదు’ అనే డైలాగులు సాధారణంగా సినిమాల్లోనే చూస్తుంటాం. అయితే అప్పుడప్పుడు నిజ జీవితంలోనూ ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి. కొందరి దంపతులను చూసి ఇలాంటి ఈ మాటలు నిజమేననిపిస్తుంది. ఈ ప్రేమకథ కూడా అలాంటిదే. ఆమెకు 83 ఏళ్లు.. అతనికి 28 ఏళ్లు.. వయసులో ఎంతో వైరుధ్యం ఉన్న వీరి మధ్య ప్రేమ చిగురించింది. పెళ్లికూడా చేసుకోవాలనుకున్నారు. అయితే సమాజంతో పాటు ఇరు కుటుంబ పెద్దలు అభ్యంతరం తెలిపారు. అయితే ఒకరినొకరు విడిచి జీవించి ఉండలేమంటూ పెద్దల్ని ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. పోలాండ్‌కి చెందిన 83 ఏళ్ల బ్రోమా అనే వృద్ధురాలు పాకిస్తాన్‌కి చెందిన 28 ఏళ్ల హఫీజ్‌ నదీమ్‌తో ప్రేమలో పడింది. మొదట ఈ ఇద్దరు ఫేస్‌బుక్‌ ద్వారా స్నేహితులుగా ఒకరికొకరు పరిచయమయ్యారు. ఇద్దరి అభిరుచులు ఒకటవ్వడంతో మంచి స్నేహితులుగా మారిపోయారు. ఆ తర్వాత మనసులు కూడా కలవడంతో వారి స్నేహం కాస్త ప్రేమగా చిగురించింది. అంతే ఒకరికొకరు జీవితాంతం కలిసే ఉండాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. అయితే ఆమె ఉండేది పోలండ్‌లో అతను ఉండేది పాకిస్తాన్‌లో. కానీ ప్రేమకు ఎల్లలు, హద్దులు ఉండవు కదా.. అందుకే ప్రియుడి కోసం ఏకంగా పాకిస్తాన్‌ వచ్చేసింది.

ఇక్కడికి వచ్చిన కొద్దిరోజుల తర్వాత తర్వాత ఈ జంట తమ పెళ్లికి పెద్దలను ఒప్పించారు. ఆతర్వాత పాకిస్తాన్‌లోని హఫ్జాబాద్‌లో కాజీపూర్‌లో ముస్లిం సంప్రదాయపద్ధతిలో నిఖా జరుపుకొని ఒక్కటయ్యారు. పెళ్లి తర్వాత తామెంతో సంతోషంగా ఉన్నామంటూ పలు ఇంటర్వూలు కూడా ఇస్తున్నారీ దంపతులు. కాగా ఈ జంట పెళ్లికి ముందు ఎప్పుడూ కలుసుకోలేదు. ‘పెళ్లి చేసుకోవాలనుకున్న తర్వాతే కలుద్దామని మేం నిర్ణయించుకున్నాం. పెద్దలను మా వివాహానికి ఒప్పించాం. ఇప్పుడు మేమెంతో హ్యాపీగా ఉన్నాం’ అని మురిసిపోతున్నాడు నదీమ్‌. కాగా ఇతను ఓ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు.

Marriage

ఇవి కూడా చదవండి

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు