AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Janhvi Kapoor: కొత్త ఇల్లు కొన్న శ్రీదేవి కూతురు.. ఎన్ని కోట్లో తెలిస్తే నోరెళ్లబెడతారు!

ఒక్కో సినిమాకి నాలుగు నుంచి ఐదు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటోన్న జాన్వీ ఏడాదికి సుమారు అరడజనుకు పైగా సినిమాలలో నటిస్తోంది. అలాగే పలు ఉత్పత్తులకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ చేజేతులా సంపాదిస్తోంది.

Janhvi Kapoor: కొత్త ఇల్లు కొన్న శ్రీదేవి కూతురు.. ఎన్ని కోట్లో తెలిస్తే నోరెళ్లబెడతారు!
Janhvi Kapoor
Basha Shek
|

Updated on: Nov 05, 2022 | 4:21 PM

Share

అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది జాన్వీ కపూర్‌. అందం, అభినయంతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఓవైపు గ్లామరస్‌ పాత్రలు పోషిస్తూనే మరోవైపు గుంజన్‌ సక్సేనా, రూహీ, గుడ్‌లక్‌ జెర్రీ లాంటి హీరోయిన్‌ ఓరియంటెడ్‌ సినిమాలతోనూ మెప్పిస్తోంది. ఇటీవల మిలీ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శుక్రవారం (నవంబర్‌ 4) రిలీజైన ఈ చిత్రం పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది.  ఒక్కో సినిమాకి నాలుగు నుంచి ఐదు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటోన్న జాన్వీ ఏడాదికి సుమారు అరడజనుకు పైగా సినిమాలలో నటిస్తోంది. అలాగే పలు ఉత్పత్తులకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ చేజేతులా సంపాదిస్తోంది. ఈనేపథ్యంలో ముంబైలోని బాంద్రాలో ఓ విలాసవంతమైన డ్యూప్లెక్స్‌ విల్లాను కొనుగోలు చేసిందట ఈ స్టార్‌ కిడ్‌. ఇందుకోసం ఆమె ఏకంగా రూ.65 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. స్టాంప్‌ డ్యూటీ కింద మరో రూ.3.90 కోట్లు అదనంగా చెల్లించిందట. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌ కూడా ఇటీవలే పూర్తయిందట.

కాగా కొత్త ఇంటిని కొనుగోలు చేసేముందే జుహులోని తన ఇంటిని నటుడు రాజ్‌కుమార్‌ రావుకు రూ.45 కోట్లకు అమ్మేసిన సంగతి తెలిసిందే. దీనికి మరో 20 కోట్లు యాడ్ చేసి బాంద్రాలో తన కలల ఇంటిని సొంతం చేసుకుంది. 8,669 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ విశాలమైన విల్లాలో జాన్వీ రిలాక్స్‌ అయ్యేందుకు వీలుగా ఫస్ట్‌ ఫ్లోర్‌లో స్విమ్మింగ్‌ పూల్‌, గార్డెన్‌ ఏరియా కూడా ఉన్నాయట. కాగా నిన్న విడుదలైన మిలీ సినిమాలో జాన్వీ నటనకు ప్రశంసలు వస్తున్నాయి. తండ్రి బోని కపూర్‌ నిర్మించిన ఈ చిత్రానికి మత్తుకుట్టి జేవియర్‌ దర్శకత్వం వహించారు. జాన్వీతో పాటు సన్నీ కౌశల్‌, మనోజ్‌ పాహ్వా, సీమ, జాకీ ష్రాఫ్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

మేడారం ముస్తాబు.. కాకతీయుల నిర్మాణాలకు ఏమాత్రం తీసిపోని గ్రానైట్
మేడారం ముస్తాబు.. కాకతీయుల నిర్మాణాలకు ఏమాత్రం తీసిపోని గ్రానైట్
వాహనాలు కొనేవారికి గుడ్‌న్యూస్.. ఇకపై షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్‌?
వాహనాలు కొనేవారికి గుడ్‌న్యూస్.. ఇకపై షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్‌?
పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే
పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో