Hansika: యాపిల్‌ బ్యూటీ కాబోయే భర్తకు ఇది వరకే పెళ్లైందా? నెట్టింట వైరలవుతోన్న వీడియోలు, ఫొటోలు

మూడు ముళ్లే తరువాయి అన్న తరుణంలో హన్సికకు కాబోయే వరుడి గురించి సోషల్‌ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. అదేంటంటే.. సొహైల్‌కు ఇది వరకే పెళ్లైందట. అది కూడా హన్సిక స్నేహితురాలితోనే.

Hansika: యాపిల్‌ బ్యూటీ కాబోయే భర్తకు ఇది వరకే పెళ్లైందా? నెట్టింట వైరలవుతోన్న వీడియోలు, ఫొటోలు
Hansika Motwani
Follow us
Basha Shek

|

Updated on: Nov 05, 2022 | 5:27 PM

యాపిల్‌ బ్యూటీ హన్సిక మెత్వాని పెళ్లి ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ముంబైకు చెందిన వ్యాపారి సోహైల్‌ కతూరియాతో ఆమె డిసెంబర్‌లో ఏడడుగులు నడవనుంది. ఇటీవలే ప్యారిస్‌లోని ఈఫిల్‌ టవర్‌ సాక్షిగా సోహైల్‌కు ఓకే చెప్పిన హన్సిక తన పెళ్లి వార్తను అధికారికంగా ప్రకటించింది.వీరి వివాహానికి సంబంధించి జైపూర్‌ ప్యాలెస్‌లో ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక మూడు ముళ్లే తరువాయి అన్న తరుణంలో హన్సికకు కాబోయే వరుడి గురించి సోషల్‌ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. అదేంటంటే.. సొహైల్‌కు ఇది వరకే పెళ్లైందట. అది కూడా హన్సిక స్నేహితురాలితోనే. అయితే విభేదాల కారణంగా వీరు విడాకులు తీసుకుని విడిపోయారట. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. హన్సిక స్నేహితురాలు రింకీ, సొహైల్‌ వివాహం 2016లో జరిగిందట. కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో గోవాలోని ఓ రిసార్ట్‌లో ఎంతో గ్రాండ్‌గా జరిగిన ఈ వెడ్డింగ్‌లో హన్సిక సైతం సందడి చేశారు. సంగీత్‌, హల్దీ లాంటి ప్రి వెడ్దింగ్‌ వేడుకల్లో రింకీతో కలిసి డ్యాన్సులు కూడా చేసింది.

అయితే పెళ్లైన కొన్నేళ్లకే రింకీ, సొహైల్‌ విడిపోయారట. ఇప్పుడు అతనితోనే హన్సిక ఏడడుగులు నడవనుందని సోషల్‌ మీడియాలో ఫొటోలు, వీడియోలు హల్‌చల్‌ చేస్తున్నాయి. కొన్ని ఆంగ్ల వెబ్‌సైట్లు వీరి పెళ్లి గురించి రకరకాల కథనాలు ప్రచురించాయి. అయితే వీటిపై హన్సిక కానీ ఇతర కుటుంబ సభ్యులెవరూ స్పందించలేదు. కాగా సోహైల్‌, హన్సిక ఒకే కంపెనీలో భాగస్వామ్యులుగా ఉన్నారు. చాలారోజుల నుంచి వీరిద్దరి మధ్య స్నేహం ఉందని తెలుస్తోంది. ఈక్రమంలోనే జీవితాన్ని పంచుకునేందుకు రెడీ అయ్యారని టాక్‌ నడుస్తోంది. కాగా డిసెంబర్‌ 4న రాజస్థాన్‌లోని ఓ ప్రముఖ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా హన్సిక-సోహెల్‌ పెళ్లి వేడకకు కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. కేవలం అత్యంత సన్నిహితులు, స్నేహితులనే వీరి పెళ్లికి ఆహ్వానిస్తున్నారట.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే