AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెండుసార్లు క్యాన్సర్‌ జయించింది.. ఇప్పుడు మరోసారి ప్రాణాలతో పోరాడుతున్న నటి

ఇక కొంతమంది అరుదైన వ్యాధులతో బాధపడుతున్నారు. రీసెంట్ గా సమంత తాను ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నా అని సోషల్ మీడియా వేదికగా తెలిపి షాక్ ఇచ్చింది.

రెండుసార్లు క్యాన్సర్‌ జయించింది.. ఇప్పుడు మరోసారి ప్రాణాలతో పోరాడుతున్న నటి
Heroine
Rajeev Rayala
|

Updated on: Nov 05, 2022 | 5:49 PM

Share

సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా విషాదాలు చోటు చేసుకున్నాయి. ఈ మధ్యకాలంలో చాలా మంది సినిమా తారలు కన్నుమూసిన విషయం తెలిసిందే. ఇక కొంతమంది అరుదైన వ్యాధులతో బాధపడుతున్నారు. రీసెంట్ గా సమంత తాను ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నా అని సోషల్ మీడియా వేదికగా తెలిపి షాక్ ఇచ్చింది. అది ప్రాణాంతక వ్యాధి అయినప్పటికీ తాను కోలుకుంటున్నా అని తెలిపింది సామ్. కొద్దిరోజుల క్రిత్రం తనకు మయోసైటిస్ అనే వ్యాధి సోకినట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఇప్పుడు మరో నటి క్యాన్సర్ తో హాస్పటల్ లో చేరింది. అయితే ఇప్పటికే ఆమెకు రెండు సార్లు క్యాన్సర్ తో పోరాడింది. ఇప్పుడు మరోసారి హాస్పటల్  వెంటిలేటర్ మీద ప్రాణాలతో పోరాడుతుంది. ఇంతకు ఆమె ఎవరంటే..

బెంగాలీ నటి ఐంద్రీలా శర్మ.. ఈమె ఒక ఫేమస్ యాక్ట్రెస్.. అందం అభినయం కలబోసిన ఈ చిన్నది తన సినిమాతో ఆకట్టుకుంది. ఎంతోమంది ప్రేక్షకులని సొంతం చేసుకుంది కూడా.. ఇక అక్కడ ‘జుమూర్‌’, ‘భోలో బాబా పర్‌ కరేగా’ వంటి సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. దాంతో ఈ అమ్మడికి మంచి పేరు, స్టార్ డమ్ వచ్చింది. అంతా సాఫీగా సాగిపోతుండగా ఆమె క్యాన్సర్ బారిన పడింది. అయితే ఇప్పటికే రెండు సార్లు ఆమె క్యాన్సర్ బారిన పడి.. దానినుంచి బయట పడింది. ఇక ఇప్పుడు మరోసారి హాస్పటల్ లో చేరింది ఐంద్రీలా శర్మ.

ఇవి కూడా చదవండి
Aindrila Sharma

ఇప్పుడు ఆమెకు స్ట్రోక్‌ రావడంతో ఆస్పత్రిలో చేర్పించారు కుటుంబసభ్యులు. ఇంట్రా సెరిబ్రల్‌ హెమరేజ్‌ కారణంగా ఐంద్రీలా శర్మ శరీరంలో కొంత భాగం పక్షవాతానికి గురైందని చికిత్స చేస్తోన్న వైద్యులు అంటున్నారు. ప్రస్తుతం ఆమె కోమాలోకి వెళ్లిందని.. ఆమె మెదడులో రక్తం గట్టకట్టిందని వైద్యులు తెలిపారు. పరిస్థితి విషమంగా ఉందని.. వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

EPFO కొత్త అప్డేట్లు.. 3.0 వెర్షన్‌లో ఏకంగా AI ఫీచర్‌!
EPFO కొత్త అప్డేట్లు.. 3.0 వెర్షన్‌లో ఏకంగా AI ఫీచర్‌!
పిజ్జా, స్వీట్లు తిన్నా స్లిమ్‌గా ఉండే సీక్రెట్ చెప్పిన మృణాల్
పిజ్జా, స్వీట్లు తిన్నా స్లిమ్‌గా ఉండే సీక్రెట్ చెప్పిన మృణాల్
నంద్యాల జిల్లాలో ఘోరప్రమాదం.. కాలిబూడిదైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. స్పాట్‌లోనే..
నంద్యాల జిల్లాలో ఘోరప్రమాదం.. కాలిబూడిదైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. స్పాట్‌లోనే..
బాలీవుడ్ బ్యూటీ ఫేవరెట్ విజిటబుల్ గురించి తెలిస్తే షాకవుతారు
బాలీవుడ్ బ్యూటీ ఫేవరెట్ విజిటబుల్ గురించి తెలిస్తే షాకవుతారు
సినిమాలు మానేసి.. రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా మారిన టాలీవుడ్ హీరోయిన్
సినిమాలు మానేసి.. రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా మారిన టాలీవుడ్ హీరోయిన్
ఊరటనిచ్చిన బంగారం ధరలు.. ఒక్కసారిగా డౌన్..
ఊరటనిచ్చిన బంగారం ధరలు.. ఒక్కసారిగా డౌన్..
మెగాస్టార్ సినిమాలో యంగ్ బ్యూటీకి చాన్స్? హిట్ దక్కినట్టేనా!
మెగాస్టార్ సినిమాలో యంగ్ బ్యూటీకి చాన్స్? హిట్ దక్కినట్టేనా!
3 కొత్త ఫోన్లు వచ్చేస్తున్నాయి.. ఓ లుక్కేయండి!
3 కొత్త ఫోన్లు వచ్చేస్తున్నాయి.. ఓ లుక్కేయండి!
కుర్రాళ్ళ మతిపోగొడుతున్న కృతిశెట్టి
కుర్రాళ్ళ మతిపోగొడుతున్న కృతిశెట్టి
యాక్షన్ సినిమాలకు కాలం చెల్లిందా? టాలీవుడ్‌ తెరపై మళ్లీ కామెడీ
యాక్షన్ సినిమాలకు కాలం చెల్లిందా? టాలీవుడ్‌ తెరపై మళ్లీ కామెడీ