Unstoppable 2: కుర్రహీరోలను ఓ ఆటాడుకున్న బాలయ్య.. మీలాంటి వారిని ఈ షోకు పిలవడమే తప్పు అంటూ కౌంటర్స్..
ఇక మూడవ ఎపిసోడ్ లో యంగ్ హీరోస్ అడివి శేష్, శర్వానంద్ విచ్చేయగా..వారిద్దరిని ఓ ఆటాడుకున్నారు బాలయ్య. పంచులు.. సెటైర్లతో ఎపిసోడ్ పూర్తిగా నవ్వులు పూయించారు. ఆద్యంతం
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం ఆహాలో బాలయ్య హోస్ట్‌గా అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే సీజన్ 2 సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న సంగతి తెలిసిందే. తనదైన యాంకరింగ్ స్టైల్లో… పంచులు.. ప్రాసలతో అతిథులను ఆడుకుంటున్నారు బాలయ్య.. మొదటి సీజన్ భారీ విజయాన్ని అందుకోగా.. ఇప్పుడు సీజన్ 2కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ షోలో మొదటి ఎపిసోడ్ లో నారా చంద్రబాబు, నారా లోకేష్ సందడి చేయగా.. రెండవ ఎపిసోడ్లో సిద్ధూ జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ అలరించారు. ఇక మూడవ ఎపిసోడ్ లో యంగ్ హీరోస్ అడివి శేష్, శర్వానంద్ విచ్చేయగా..వారిద్దరిని ఓ ఆటాడుకున్నారు బాలయ్య. పంచులు.. సెటైర్లతో ఎపిసోడ్ పూర్తిగా నవ్వులు పూయించారు. ఆద్యంతం ఫన్నీగా సాగిన ఈ షోలో చివరకు మీలాంటి వారిని ఈషోకు పిలవడమే తప్పు అంటూ బాలకృష్ణ సరదాగా అనేస్తూ షాకిచ్చారు.
బాలయ్య నటించిన టాప్ హీరో సినిమాలోని బీడులు తాగండి బాబులు.. తాగి స్వర్గాన్ని తాకండి బాబులు అనే పాట పాడడం వల్ల అమ్మ చేతిలో తన్నులు తిన్నానంటూ చెప్పుకొచ్చారు అడివి శేష్. సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పుడు శర్వా మాత్రమే నాకు స్పూర్తిగా నిలిచాడని.. కెరీర్ ఆరంభంలో ఎవరు అవకాశాలు ఇచ్చేవారు కాదని.. స్వతహాగా రచనపై ఆసక్తి ఉండడంతో నా సినిమాలకు కథలు నేనే రాసుకునేవాడినని అన్నారు అడివి శేష్. అలాగే పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన బాయ్స్ సినిమా స్క్రీన్ టెస్ట్ లో పాల్గొనే అవకాశం వచ్చినా వెళ్లలేదని.. ఇప్పటికీ ఆ విషయంలో బాధపడుతుంటానని అన్నారు. అంతేకాకుండా తాను గతంలో ఒకరితో రిలేషన్ షిప్ లో ఉన్నానని.. కానీ ఇప్పుడు లేదని.. తాను సింగిల్ అంటూ చెప్పుకొచ్చారు.
ఇక గేమ్ లో భాగంగా రానా దగ్గుబాటికి శర్వా కాల్ చేయగా.. లైఫ్ లో నుంచి ఈ దొంగ నా కొ.. లను కట్ చేయ్ అంటూ రానాకు సలహా ఇచ్చారు బాలయ్య. ఇక రానా టాక్ షో ప్రిన్స్ అయితే.. తాను టాక్ షో కింగ్ అన్నారు. బొబ్బిలి సింహం సినిమా ఓపెనింగ్ రోజు అనుకోకుండా హీరోయిన్ మీనాతో లిప్ లాక్ చేసిన విషయాన్ని చెప్పుకొచ్చారు బాలయ్యి. ఈ క్రమంలోనే శర్వానంద్ ఫోన్ లో ఎన్ని బిట్లు ఉన్నాయని అడగ్గా.. అతడి బిజినెస్ వ్యవహారాల గురించి మాట్లాడారు. దీంతో శర్వా స్పందిస్తూ.. నాకు మీ ఆస్తుల చిట్టా మొత్తం తెలుసు. మీరు మర్చిపోయారు అనుకుంటా మీ నాన్న గారి దగ్గర మా తాతయ్య చార్టెడ్ అకౌంటెంట్. మీ ఆస్తుల లిస్ట్ అన్ని స్కాన్ కాపీలు మా దగ్గర ఉన్నాయి. నేను కూడా మీ ఆస్తుల లిస్ట్ బయటపెడతా.. ఎన్ని బిట్లు ఉన్నాయో చెప్పమంటారా సర్ అన్నాడు. దీంతో బాలయ్య ఫన్నీగా.. ఆ బిట్లు కాదమ్మ.. డౌన్ లోడ్ బిట్లు అంటూ నవ్వులు పూయించారు. చివరగా.. నాది ఫ్యామిలీ షో.. నీలాంటి వారిని పిలవడమే తప్పు అంటూ సరదాగా వ్యాఖ్యనించారు బాలయ్య. మొత్తానికి అన్ని ఎపిసోడ్స్ కంటే.. ఈ ఇద్దరు కుర్ర హీరోస్ ఎపిసోడ్ భలే ఫన్నీగా సరదాగా సాగింది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.