Urvasivo Rakshasivo: అప్పుడే ఓటీటీలోకి ఊర్వశివో రాక్షసివో.. ఏకంగా రెండింట్లో స్ట్రీమింగ్‌.. ఎప్పటినుంచంటే?

ఈ సినిమాతో చాలా ఏళ్ల తర్వాత ఓ కమర్షియల్‌ హిట్‌ను సొంతం చేసుకున్నాడు అల్లు శిరీష్‌. ఇదిలా ఉంటే థియేటర్లలో అలరిస్తోన్న ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌ గురించి నెట్టింట ఓ ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది.

Urvasivo Rakshasivo: అప్పుడే ఓటీటీలోకి ఊర్వశివో రాక్షసివో.. ఏకంగా రెండింట్లో స్ట్రీమింగ్‌.. ఎప్పటినుంచంటే?
Urvasivo Rakshasivo
Follow us
Basha Shek

|

Updated on: Nov 05, 2022 | 3:51 PM

సుమారు మూడేళ్ల గ్యాప్‌ తర్వాత అల్లు శిరీష్‌ నటించిన చిత్రం ఊర్వశివో రాక్షసివో. అను ఇమ్మాన్యుయేల్‌ శిరీశ్‌ పక్కన రొమాన్స్‌ చేసింది. రాకేశ్‌ శశి తెరకెక్కించిన ఈ రొమాంటిక్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌లో వెన్నెల కిశోర్‌, సునీల్‌, పోసాని కృష్ణమురళి, అనీష్‌ కురువిల్లా ప్రధాన పాత్రలు పోషించారు. అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్‌పై ధీరజ్‌ మొగిలినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎలాంటి అంచనాలు లేకుండా నవంబర్‌ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా యూత్‌ను బాగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాతో చాలా ఏళ్ల తర్వాత ఓ కమర్షియల్‌ హిట్‌ను సొంతం చేసుకున్నాడు అల్లు శిరీష్‌. ఇదిలా ఉంటే థియేటర్లలో అలరిస్తోన్న ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌ గురించి నెట్టింట ఓ ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ డిజిటల్‌ రైట్స్‌ను రెండు ఓటీటీలు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహా వీడియోస్‌తో పాటు నెట్‌ ఫ్లిక్స్‌లు ఫ్యాన్సీ డీల్‌కు ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

కాగా ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం ఈ సినిమా అయినా థియేట్రికల్‌ రన్‌ పూర్తయిన 8 వారాల తర్వాత డిజిటల్‌ ప్లాట్‌ఫాంలోకి అడుగుపెడుతోంది. ఈ సినిమా కూడా నెల రోజుల తర్వాత స్ట్రీమింగ్‌ కానున్నట్లు తెలుస్తోంది. అంటే డిసెంబర్‌ మొదటివారం లేదా రెండో వారంలో ఓటీటీల్లో అడుగుపెట్టనునన్నట్లు సమాచారం. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా తమిళ్‌ సినిమా ప్యార్ ప్రేమ కాద‌ల్ ఆధారంగా ఊర్వశివో రాక్షసివో సినిమా రూపొందింది. ఓ ట్రెడిష‌న‌ల్ అబ్బాయి, మోడ్రన్‌ అమ్మాయి మ‌ధ్య సాగే ప్రేమ‌క‌థ‌ను ఆసక్తికరంగా రాకేశ్‌ తీర్చిదిద్దారు. లివింగ్‌రిలేష‌న్స్‌, పెళ్లి ప‌ట్ల యువ‌త ఆలోచ‌న‌లు ఎలా ఉంటున్నాయో ఈ సినిమాలో చక్కగా చూపించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే